Skip to main content

Telangana 10th, Inter Results : పదో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ రిజ‌ల్ట్స్ ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో టెన్త్‌ మూల్యాంకన ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చంది. ఈ మేర‌కు ప‌దో త‌ర‌గ‌తి ఫలితాలను జూన్ 30వ తేదీలోగా వెల్లడిస్తామని ఎస్సెస్సీ బోర్డ్‌ అధికారులు స్పష్టం చేశారు.
Inter and 10th Results
TS Inter and 10th Results Release Date

ఈ ఫ‌లితాల విడుద‌ల‌ తేదీని విద్యాశాఖ త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. మే 23వ తేదీ నుంచి జూన్‌ ఒకటి వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరిగిన విష‌యం తెల్సిందే. ఈ సారి ఆరు పేర‌ప‌ర్ల‌తో ప‌రీక్ష నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌ల్లో ఎటువంటి స‌మ‌స్య‌ల లేకుండా పూర్త‌య్యాయి. ఈ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌ (www.sakshieducation.com) లో చూడొచ్చు. 

After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..?

How to check TS 10th Class 2022 Results:
➤ Visit results.sakshieducation.com or education.sakshi.com

➤ Click on TS 10th Class 2022 results - General / Vocational on the home page

➤ In the next page, enter your hall ticket number and submit

➤ The results will be displayed on the screen.

➤ Save a copy of the marks sheet for further reference

ఈసారి పరీక్షలు రాసిన వారిలో..

TS 10th Exams


ఈసారి మొత్తం 2,861 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 1,140 పాఠశాలల నుంచి 5,09,275 మంది హాజరయ్యారు. ఇందులో బాలురు 2,58,098 మంది, బాలికలు 2,51,177 మంది ఉన్నారు. ఈ ఏడాది పరీక్షలు రాసిన వారిలో 5,08,110 మంది రెగ్యులర్‌ విద్యార్థులు కాగా, 1,165 మంది ప్రైవేటు విద్యార్థులున్నారు. 2,861 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, 33 వేల మంది ఇన్విజిలేటర్లను విధుల‌ను నిర్వ‌హించారు. అలాగే రాష్ట్ర కార్యాలయం నుంచి 4 ప్రత్యేక ఫ్లైయింగ్ స్వాడ్స్ బృందాలు, 144 ఫ్లైయింగ్ స్వాడ్స్ బృందాలను ఏర్పాటు చేసింది.

After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..?

ఈ సారి స‌రైన స‌మ‌యంలోనే..
కరోనాతో గత రెండేళ్లుగా విద్యా సంవత్సరంలో ఒడిదొడుకులు చోటుచేసుకున్నా విష‌యం తెల్సిందే. టెన్త్ ప‌రీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేశారు.రెండేళ్ల తర్వాత టెన్త్‌ పరీక్షలు జరగడంతో ఈసారి 11 ప్రశ్నపత్రాలకు బదులు 6 మాత్రమే ఇచ్చారు. పరీక్షల సమయాన్ని కూడా పెంచారు. టెన్త్‌లో ప్ర‌శ్న‌ప‌త్రాల‌ను 70 శాతం సిలబస్‌ మాత్రమే ఇచ్చారు. దీంతో ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనా వ్యాప్తి తగ్గడంతో ఈసారి విద్యాసంవత్సరం సాధారణ సమయాల్లోనే చేపట్టాలని తెలంగాణ విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.

Best Polytechnic Courses: పాలిటెక్నిక్‌తో.. గ్యారెంటీగా జాబ్ వ‌చ్చే కోర్సులు చేరాలనుకుంటున్నారా..? అయితే ఈ స‌మాచారం మీకోస‌మే..

తెలంగాణలో ఈ సారి జ‌రిగిన ప‌రీక్ష‌ల తేదీలు ఇలా..

తేదీ పరీక్ష
23–5–22     మొదటి భాష
24–5–22 ద్వితీయ భాష
25–5–22 తృతీయ భాష
26–5–22 గణితం
27–5–22 జనరల్‌ సైన్స్‌
28–5–22 సోషల్‌ స్టడీస్‌
30–5–22 ఓఎస్సెస్సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ (సంస్కృతం, అరబిక్‌)
31–5–22 ఓఎస్సెస్సీ మెయిన్‌ (సంస్కృతం, అరబిక్‌)
01–6–22     ఎస్సెస్సీ ఒకేషనల్‌ కోర్సు

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు మాత్రం..?
ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తైంది. అలాగే ఇంటర్‌ స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ దాదాపు పూర్తయినట్టేనని అధికార వర్గాలు అంటున్నాయి. దీంతో జూన్ 28వ తేదీ ఇంటర్‌ ఫలితాలను విడుద‌ల... ఈ మేర‌కు త్వ‌ర‌లోనే ఫ‌లితాల‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంటర్ బోర్డ్ నుంచి విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్ సెకండియర్ పరీక్షలు ముగిసిన 20 రోజుల్లో వారి ఫలితాలను విడుదల చేస్తామని ఇంటర్ బోర్డ్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. మే 6వ తేదీన‌ మొదలైన ఇంటర్మీడియెట్‌ పరీక్షలు మే 24వ తేదీ వ‌రకు జ‌రిగాయి. తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్ట్‌,సెకండియ‌ర్ ఫ‌లితాల‌ను సాక్షిఎడ్యుకేషన్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

How to check TS Inter 2022 Results:
➤ Visit results.sakshieducation.com or education.sakshi.com

➤ Click on TS Inter results - General / Vocational on the home page

➤ In the next page, enter your hall ticket number and submit

➤ The results will be displayed on the screen.

➤ Save a copy of the marks sheet for further reference

ఈ సారి మాత్రం..
ఈ సారి ఇంట‌ర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 9,07,396 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఫస్టియర్‌ విద్యార్థులు 4,64,626 మంది కాగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,42,768 మంది ఉన్నారు. అలాగే ఈ సారి 1,443 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. 25,530 మంది ఇన్విజిలేటర్లను, 150 మందితో సిట్టింగ్‌ స్క్వాడ్, మరో 75 మందితో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ల‌ను ఏర్పాటు చేసి ప‌టిష్టంగా ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు.

After Inter: ఇంటర్మీడియెట్‌ తర్వాత.. ఏకకాలంలో డిగ్రీతోపాటు పీజీ పూర్తి..

జూలై మొదటి వారంలోనే..
ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూలై మొదటి వారంలో నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా కరోనాతో విద్యా సంవత్సరంలో ఒడిదొడుకులు చోటుచేసుకున్న విష‌యం తెల్సిందే. అలాగే ఇంటర్‌ పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేశారు. అలాగే ఈ సారి ఇంటర్ ప‌రీక్ష‌ల ప్ర‌శ్న‌ప‌త్రాల‌ను 70 శాతం సిలబస్ నుంచి మాత్రమే ఇచ్చారు. దీంతో ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనా వ్యాప్తి తగ్గడంతో ఈసారి విద్యాసంవత్సరం సాధారణ సమయాల్లోనే చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.

After Inter: ఇంటర్‌తోనే.. ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు..

తెలంగాణలో ఈ సారి జ‌రిగిన ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..

ఫస్టియర్‌

తేదీ

పరీక్ష

6–5–22

ద్వితీయ భాష

9–5–22

ఇంగ్లిష్‌

11–5–22

మ్యాథ్‌స్ –1ఎ, బాటనీ, పొలిటికల్‌ సైన్స్

13–5–22

మ్యాథ్‌స్ –1బి, జువాలజీ, హిస్టరీ

16–5–22

ఫిజిక్స్, ఎకనామిక్స్‌

18–5–22

కెవిుస్ట్రీ, కామర్స్‌

20–5–22

పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జికోర్సు–మ్యాథ్‌స్

23–5–22

మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ

సెకండియర్‌

తేదీ

 పరీక్ష

7–5–22

ద్వితీయ భాష

10–5–22

ఇంగ్లిష్‌

12–5–22

మ్యాథ్‌స్ –2ఎ, బాటనీ, పొలిటికల్‌ సైన్స్

14–5–22

మ్యాథ్‌స్ –2బి, జువాలజీ, హిస్టరీ

17–5–22

ఫిజిక్స్, ఎకనామిక్స్‌

19–5–22

కెవిుస్ట్రీ, కామర్స్‌

21–5–22

పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జికోర్సు మ్యాథ్స్‌

24–5–22

మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ

Published date : 28 Jun 2022 10:37AM

Photo Stories