TS SSC Supplementary Exams 2023 Dates : టీఎస్ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఇవే..
హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను ప్రకటించారు. బాలికలు 88.53 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 84.68 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణతలో నిర్మల్ జిల్లా ఫస్ట్ (99శాతం).. వికరాబాద్ లాస్ట్(86.60 శాతం) స్థానంలో ఉన్నాయి. అలాగే జూన్ 14వ తేదీ నుంచి 22 వరకు టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.
How to check TS 10th Class Results 2023?
- Visit https://results.sakshieducation.com/
- Click on TS 10th class results link available on the home page
- Enter your roll no. and click on submit
- The results will be displayed on the screen
- Download and save a copy of the mark sheet for further use.
☛➤ తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు-2023 కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
4,84,384 మంది విద్యార్థులు..
రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఈ ఏడాది రెగ్యులర్ విద్యార్థులు 4,86,194 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 4,84,384 మంది హాజరయ్యారు. 1,809 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. రాష్ట్రంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 11 వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెల్సిందే. పరీక్షలు జరిగిన నెలలోనే ఫలితాలను విడుదల చేసింది.
చదవండి: After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భవిష్యత్ ఉంటుంది..?
ఈ ఏడాది పదో తరగతి ఉత్తీర్ణత వివరాలు ఇలా..
☛తెలంగాణ టెన్త్ ఫలితాల్లో 86 శాతం ఉత్తీర్ణ నమోదైంది.
☛బాలుర ఉత్తీర్ణత 84.68 శాతం
☛బాలికలు 88.53 శాతం ఉత్తీర్ణత
☛2,793 స్కూళ్లలో వందశాతం ఉత్తీర్ణత
☛నిర్మల్ జిల్లా 99 శాతంతో మొదటి స్తానంలో ఉండగా.. వికారాబాద్ జిల్లా 59.46 శాతంతో చివరి స్థానంలో ఉంది.
☛25 పాఠశాలలో జీరో శాతం ఉత్తీర్ణత
☛ప్రభుత్వ పాఠశాలలో 72.39 శాతం ఉత్తీర్ణత
☛తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 98.25 ఉత్తీర్ణత
గతేడాది తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో పెద్ద ఎత్తున ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఏకంగా 90 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. వీరిలో బాలుర ఉత్తీర్ణత శాతం 87.61 కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 92.45 గా ఉంది.
చదవండి: Best Career Options After 10th: పది తర్వాత.. కెరీర్ ప్లానింగ్!
☛ Government Jobs: పది, ఇంటర్ అర్హతతోనే సర్కారీ కొలువులెన్నో..!