10th Class: టెన్త్ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి.. పరీక్షకు 5 నిమిషాల ఆలస్యమైనా ఓకే.. ఆ తర్వాత వస్తే..
ఇందులో బాలురు 2,57,952 మంది. బాలికలు 2,50,433 మంది ఉ న్నారు. అధికారులు మొత్తం 2,676 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అధికారులు పరీక్షలు రాసే విద్యార్థులకు ఇప్పటికే హాల్‌టికెట్లు, ప్రింటెడ్ నామినల్ రోల్స్‌ను పంపిణీ చేశారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల వద్ద ఈ హాల్‌టికెట్లను పొందే వీలు కల్పించారు. అంతే కాకుండా ‘బీఎస్‌ఈ.తెలంగాణ.జీవోవీ.ఇన్’ అనే వెబ్‌సైట్ ద్వారా కూడా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ఉంది.
5 నిమిషాల వరకు అవకాశం
పరీక్ష రాసే విద్యార్థులు ఉదయం 8.30 గంటలకల్లా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని పరీక్షల విభాగం స్పష్టం చేసింది. 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, మరో ఐదు నిమిషాల వరకు విద్యార్థులను అనుమతిస్తామని తెలిపింది. ఆ తర్వాత అనుమతించబోరని తెలిపింది.