Tenth Class: ఫీజు గడువు పెంపు?
అయితే జనవరి 8 నుంచి సెలవులే కొనసాగుతున్న నేపథ్యంలో ఫీజు గడువు పెంచాలని వచ్చిన ప్రతిపాదనలపై తెలంగాణ విద్యాశాఖ సానుకూలంగా స్పందించనుంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం వెలువడే వీలుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
వారికి ఫీజు మినహాయింపు లభించదా?
టెన్త్ పరీక్ష ఫీజు రూ. 125గా ఉండగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సహా దివ్యాంగులకు విద్యాశాఖ ఫీజు మినహాయింపు ఇచ్చింది. అయితే వార్షికాదాయం రూ. 24 వేలలోపు ఉన్నవాళ్లకే ఇది వర్తిస్తుందంటూ 40 ఏళ్ల కిందటి నిబంధన తెరపైకి తెచ్చింది. వాస్తవానికి ప్రస్తుతం అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పేదలు అర్హత సాధించాలంటే గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షల్లోపు వార్షికాదాయం ఉండాలని ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులిచ్చింది. కానీ విద్యాశాఖ ఈ మార్పును గుర్తించకపోవడంతో రూ.24 వేలకు ఆదాయ ధ్రువపత్రం ఎలా ఇస్తామని రెవెన్యూ అధికారులు అంటున్నారు. పేదలకు ప్రభుత్వమిచ్చే పెన్షన్లే నెలకు రూ.3 వేలు ఉంది కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి కైనా ఈ నిబంధనపై విద్యాశాఖ పునరాలోచించాలని పలువురు కోరుతున్నారు.
చదవండి:
‘పది’ తర్వాత పదిలమైన కెరీర్‌కు సోపానాలు
విద్యార్థులలో లోపించిన ఏకాగ్రత.. బ్రిడ్జి కోర్సు తీసుకువచ్చే ఆలోచనలో విద్యాశాఖ..