TS Tenth Class Exams2025: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధనకు ప్రణాళిక
ఆసిఫాబాద్ : పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధనకు విద్యాశాఖ ప్రత్యేక ప్ర ణాళిక సిద్ధం చేసింది. ఈ వారం నుంచే ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. గతేడాది ఉపాధ్యాయుల కొరతతో ఫలితాలు ఆశించిన మేర రాలేదు. ప్రస్తుతం నూతన నియామకాలు, పదోన్నతులతో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ అయ్యాయి. సకాలంలో సిలబస్ పూర్తి చేసి ఉపాధ్యాయులు రివిజన్‌పై దృష్టి సారించనున్నారు.
Download TS 10th Class Model Papers - 2025 TM | EM
నూతన టీచర్ల రాకతో..
జిల్లావ్యాప్తంగా మొత్తం 272 ఉన్నత పాఠశాలలు ఉండగా.. వీటిలో డీఈవో పరిధిలో 77, ప్రైవేట్ స్కూల్స్ 34, గిరిజన ఆశ్రమ, బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీ, గురుకులాలు 171 ఉన్నాయి. సుమారు 6500 మంది విద్యార్థులు పదో తరగతి చదువుకుంటున్నారు. కొన్నేళ్లుగా పదో తరగతి వార్షిక ఫలితాల్లో జిల్లా చివరి నుంచి రెండు, మూడు స్థానాల్లో నిలుస్తోంది. విద్యాశాఖ అనేక చర్యలు తీసుకున్నా మార్పు రావడం లేదు. ఉపాధ్యాయుల కొరత ఉండటం, మారుమూల ప్రాంతాల్లో పనిచేసేందుకు కొందరు ఆసక్తి చూపకపోవడంతో ఉత్తీర్ణతలో విద్యార్థులు వెనుకబడ్డారనే విమర్శలు ఉన్నాయి. డీఎస్సీ ద్వారా నూతనంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 76 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ అయ్యాయి. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో భాగంగా మరో 320 మంది ఎస్జీటీల నుంచి ఎస్‌ఏలుగా ప్రమోషన్లు పొందారు. కొత్త టీచర్ల రాకతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమయ్యాయి. అలాగే 15 మండలాలకు ఇన్‌చార్జి ఎంఈవోలను కూడా నియమించారు. ప్రతిరోజూ ఎంఈవోలు రెండు పాఠశాలలను సందర్శించాలని ఆదేశాలు రావడంతో పర్యవేక్షణ పెరిగింది.
TG 10th Class Study Material
☛ Join our WhatsApp Channel (Click Here)
రెగ్యులర్ డీఈవో లేరు..
డీఈవోగా పనిచేసిన అశోక్ బదిలీపై వెళ్లడంతో ప్రస్తుతం మంచిర్యాల డీఈవో యాదయ్యకు అదనపు విద్యాధికారిగా బాధ్యతలు ఇచ్చారు. ఆయన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా విద్యాధికారిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నేటివరకు ఒక్క పాఠశాలను కూడా క్షేత్రస్థాయిలో సందర్శించలేదు. కార్యాలయానికి సంబంధించిన రికార్డులపై సంతకాల కోసం వచ్చివెళ్తున్నారు. అలాగే కలెక్టర్ నిర్వహించే సమీక్షా సమావేశాలకు మాత్రమే హాజరవుతున్నారు. పాఠశాలలు, ఉపాధ్యాయుల పని తీరు పై పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు ఉన్నా యి. ఇటీవల మంత్రి సీతక్క జిల్లా పర్యటనకు వ చ్చిన సందర్భంగా రెగ్యులర్ డీఈవోను నియమించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరారు. అయినా ఇప్పటివరకు రెగ్యులర్ అధికారిని నియమించలేదు.
ఇదీ చదవండి: TS 10th Class Previous Papers
ప్రణాళిక ఇలా..
పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు ఇన్‌చార్జి డీఈవో ఉదయ్‌బాబు తెలిపారు. ఆయన ‘సాక్షి’కి కార్యాచరణను వివరించారు.
● జిల్లావ్యాప్తంగా డీఈవో పరిధిలోని 77 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సుమారు 3200 వేల మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు.
● ఈ వారం నుంచి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి. విద్యార్థులను గ్రూపులుగా విభజించి, ప్రతీ గ్రూప్‌నకు ఒక టీచర్‌ను కేటాయిస్తారు. ప్రతీ వారం సైకిలింగ్ టెస్టులు నిర్వహిస్తారు.
● డిసెంబర్ 31లోగా వందశాతం సిలబస్ పూర్తి చేస్తారు. సబ్జెక్టుల వారీగా ప్రత్యేక మాడ్యూల్ రూపొందించి జనవరి నుంచి అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు.
● బోధన పూర్తికాగానే పాఠ్యాంశానికి సంబంధించి ఉపాధ్యాయులు ప్రశ్నలు అడిగి, తరగతి గదిలోనే ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తారు.
● తరగతులకు సంబంధించిన ఫొటోలను పాఠశాలల వారీగా జిల్లాస్థాయి వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేస్తారు.
● జిల్లా విద్యాధికారితో పాటు సెక్టోరియల్ అధికారులు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు తరగతుల నిర్వహణను పర్యవేక్షిస్తారు.
● ప్రతిరోజూ విద్యార్థులు పాఠశాలకు వచ్చేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలి. బడికి గైర్హాజరైన వారికి టీచర్లు ఫోన్ చేయాలి.
వందశాతం ఉత్తీర్ణతకు చర్యలు
ఆదర్శ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఉద యం, సాయంత్రం ఒక గంటపాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నాం. సకాలంలో సిలబస్ పూర్తిచేసి, చదువులో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారిస్తాం.
– మహేశ్వర్, ప్రిన్సిపాల్, ఆసిఫాబాద్ మోడల్ స్కూల్
ఉత్తమ ఫలితాలు సాధిస్తాం
2024– 25 విద్యా సంవత్సరంలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు చర్యలు తీ సుకుంటాం. స్కూల్ అసిస్టెంట్ల రాకతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన బోధన అందుతోంది. గత విద్యా సంవత్సరంలో వెనుకబడిన పాఠశాలలో దృష్టి సారించాం.
– యాదయ్య, డీఈవో
Tags
- Plan to achieve best results in class 10th annual exams
- Board Of Secondary Education Telangana
- TS Tenth Class Public Exams 2025 News
- 2025 TS Tenth Class
- sakshieducation latest news
- Tenth Class Exams 2025
- best results in class 10th annual exams
- AsifabadEducation
- 10thGradeExams
- SpecialClasses
- TeacherAppointments
- SyllabusCompletion
- RevisionClasses
- EducationPlan
- ImprovingResults