Skip to main content

10th Class Exam Fee Schedule: టెన్త్‌ పరీక్ష ఫీజు తేదీల‌ను ప్ర‌క‌టించిన పరీక్షల విభాగం.. చివ‌రి తేదీ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: మార్చి–2025లో జరిగే పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును టెన్త్‌ పరీక్షల విభాగం న‌వంబ‌ర్‌ 8న ప్రకటించింది.
Telangana 10th Board Exam Fee Schedule Released  Tenth class exam fee payment deadline announcement Deadline for Tenth, Vocational, and OSC exam fee payment Tenth exam fee payment deadline announced by Tenth Examinations Department

టెన్త్, ఒకేషనల్, Open ఎస్సెస్సీ పరీక్షలు రాసే విద్యార్థులు న‌వంబ‌ర్‌ 18లోగా ఫీజు చెల్లించాలని తెలిపింది. రూ.50 ఫైన్‌తో డిసెంబర్‌ 2 వరకు, రూ.200 ఫైన్‌తో డిసెంబర్‌ 12 వరకు, రూ.500 లేట్‌ ఫీజుతో డిసెంబర్‌ 21 వరకూ ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది.

చెల్లింపు గడువు లేట్ ఫీజు
నవంబర్ 18, 2024 -
డిసెంబర్ 2, 2024 రూ.50
డిసెంబర్ 12, 2024 రూ.200
డిసెంబర్ 21, 2024 రూ.500

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2025 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

పరీక్ష ఫీజు, దరఖాస్తుల వివరాలు సంబంధిత స్కూల్‌ ప్రధానోపాధ్యాయుల వద్ద లభిస్తాయని తెలిపింది. రెగ్యులర్‌ విద్యార్థులు రూ.125, మూడు సబ్జెక్టులు రాసే విద్యార్థులు రూ.110, మూడు కన్నా ఎక్కువ సబ్జెక్టులు రాసేవారు రూ.125 ఫీజుగా చెల్లించాలని పరీక్షల విభాగం వెల్లడించింది.

వర్గం ఫీజు
రెగ్యులర్ విద్యార్థులు రూ.125
మూడు సబ్జెక్టులు రాసే విద్యార్థులు రూ.110
మూడు కన్నా ఎక్కువ సబ్జెక్టులు రూ.125
Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 16 Nov 2024 05:57PM

Photo Stories