Skip to main content

విద్యార్థులలో లోపించిన ఏకాగ్రత.. బ్రిడ్జి కోర్సు తీసుకువచ్చే ఆలోచనలో విద్యాశాఖ..

కరోనా కాలంలో విద్యార్థులకు జరిగిన నష్టాన్ని పూడ్చటంపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
the department of education has the idea of offering a bridge course
విద్యార్థులలో లోపించిన ఏకాగ్రత.. బ్రిడ్జి కోర్సు తీసుకువచ్చే ఆలోచనలో విద్యాశాఖ..

ముఖ్యంగా గత రెండేళ్లుగా విద్యాబోధన సరిగ్గా సాగే పరిస్థితి లేకపోవడం, అయినప్పటికీ పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేసిన నేపథ్యంలో వారి కోసం బ్రిడ్జి కోర్సు తీసుకురావాలని భావిస్తోంది. దీనిపై త్వరలో సమీక్షించి 2023 విద్యా సంవత్సరంలో చర్యలు తీసుకోనుంది.

లోపించిన ఏకాగ్రత:

గత రెండేళ్లుగా రాష్ట్రంలో 17,27,892 మంది విద్యార్థులు ఆన్ లైన్ విద్యకే పరిమితమయ్యారు. అయితే వారిలో 1,17,570 మంది పేద విద్యార్థులు డిజిటల్‌ ఉపకరణాలు లేని కారణంగా ఆన్ లైన్ పాఠాలు సైతం వినలేక పోయినట్లు కేంద్ర ప్రభుత్వ సర్వేలు వెల్లడించాయి. డిజిటల్‌ ప్లాట్‌ఫాంలో ఎంతో కొంత విద్య అందు బాటులోకి వచ్చినా విద్యార్థుల అభ్యసన, పరిశీలన, ఆచరణలో పూర్తిగా మార్పులొచ్చాయనేది అనేక సర్వేలు నిరూపించాయి. కరోనా తర్వాత జాతీయ స్థాయిలో ‘నిసా’ అనే సంస్థ జరిపిన సర్వే ప్రకారం 30% మంది విద్యార్థులు మాతృభాషలో చదవ డంలో ఇబ్బందిపడుతున్నారు. 3వ తరగతిలో 28 శాతం, 5వ తరగతిలో 25 శాతం, 8వ తరగతిలో 2 శాతం పిల్లలు మాతృభాషలో రాయడంలోనూ వెనుకబడ్డారు. ఆంగ్ల భాషలో 35 శాతం మంది విద్యార్థులు పట్టుకోల్పోయారు. 19 శాతం మంది విద్యార్థులకు ఆంగ్లం చదవడం కష్టంగా కన్పిస్తోంది. 40 శాతం మంది గణితంలో సాధారణ సూత్రాలను కూడా గుర్తుతెచ్చుకోలేకపోతున్నారు. మొత్తంగా చూస్తే బేసిక్స్‌పై దెబ్బకొట్టిన కరోనా వల్ల పైతరగతుల్లో విద్యార్థులు కష్టాలు పడుతున్నారు. పునాది గట్టిగా లేకపోవడం వల్ల హోంవర్క్‌ ఇచ్చినా చెయ్యలేని స్థితిలో ఉన్నారు. క్లాసుల్లో పాఠాలు అర్థం కావడం లేదని చెబుతున్నారు. దీనివల్ల సామర్థ్యం దెబ్బతింటోంది.

సలహాలు స్వీకరిస్తున్న ఎస్‌సీఈఆర్‌టీ...

విద్యాభ్యాసంలో గత రెండేళ్లుగా విద్యార్థులకు జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిన అవసరం ఉందని విద్యారంగ నిపుణులు, ఉన్నతాధికారులు, సూచిస్తున్నారు. అన్ని కోణాల్లోంచి వస్తున్న సర్వేల నేపథ్యంలో స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్, రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్‌సీఈఆర్‌టీ) కూడా దృష్టి పెట్టింది. నష్టాన్ని పూడ్చడంపై అన్నివైపుల నుంచి సలహాలు తీసుకుంటోంది.

ఆచరణీయమైన ఆలోచన తేవాలి..

సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్యార్థులను ఆకర్షించేలా వారు మర్చిపోయిన పాఠ్యాంశాలను బోధించే ప్రయత్నం చేయాలి. దీన్నో సామాజిక బాధ్యతగా చేపట్టాలి. ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే ఇది సాధ్యం. కరోనా వల్ల మూలసూత్రాల అధ్యయనంలో నష్టం వాటిల్లింది. దీన్నే ప్రధానంగా బ్రిడ్జి కోర్సులో చేరిస్తే బాగుంటుంది.

– ఎస్‌.ఎన్.రెడ్డి, తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం ప్రధాన కార్యదర్శి

రాష్ట్రంలో 1–10 తరగతుల్లో చదివే విద్యార్థులు

66,65,475

3–10 వరకూ డిజిటల్‌ విద్య నేర్చుకున్న వారు (కరోనా కాలంలో)

17,27,892

దూరదర్శన్, టీ–శాట్‌లో పాఠాలు విన్నవాళ్ళు

11,34,900

స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, కంప్యూటర్ల ద్వారా

2,22,680

ఎలాంటి డిజిటల్‌ పాఠాలు వినని వాళ్లు

1,17,570

ఆన్ లైన్ ద్వారా పాఠాలు అర్థంకాని వాళ్లు

44.6 శాతం

కరోనా తర్వాత ఆత్మవిశ్వాసం కన్పించని విద్యార్థులు

32.8 శాతం

ఆన్ లైన్ వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చాలని కోరుతున్న విద్యార్థులు

45.1శాతం

చదవండి:

NTRUHS: ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్

Schools: ఫిబ్రవరి 5 నుంచి స్కూళ్లు ప్రారంభం?

 

Intermediate: పాస్ సర్టిఫికెట్ల డౌన్ లోడ్ ప్రారంభ తేదీ ఇదే..

Published date : 27 Jan 2022 01:33PM

Photo Stories