Skip to main content

Schools: ఫిబ్రవరి 5 నుంచి స్కూళ్లు ప్రారంభం?

కరోనా థర్డ్‌ వేవ్‌ కారణంగా మూతబడిన విద్యాసంస్థలను తిరిగి ప్రారంభిం చాలన్న డిమాండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది.
harishrao
ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు

స్కూళ్లు, కాలేజీలను తెరిస్తే వచ్చే ఇబ్బందులపై ఆరా తీస్తోంది. ఈ మేరకు విద్యా, ఆరోగ్య శాఖల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక కోరినట్టు తెలిసింది. ఆయా విభాగాల అభిప్రాయాలకు అనుగుణంగా సర్కార్‌ నిర్ణయం తీసుకోవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కోవిడ్‌ తగ్గుముఖం పడితే, తల్లిదండ్రులు తమ పిల్లలను పంపడానికి సుముఖంగా ఉంటే ఫిబ్రవరి 5 నుంచి స్కూళ్లను తెరవాలని ప్రభుత్వం యోచిస్తోంది. తాజా పరిస్థితిపై తెలంగాణ‌ ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వైద్య అధికారులతో సమీక్ష జరిపినట్టు సమాచారం. రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తి కొనసాగు తున్నా దాని ప్రభావం స్వల్పంగానే ఉందని వైద్య అధికారులు తెలిపినట్టు తెలిసింది. థర్డ్‌ వేవ్‌ ప్రభావం తగ్గితే యథావిధిగా విద్యాసంవత్సరం ముగించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఒకవేళ సెలవులు పొడిగించాల్సి వస్తే పరీక్షల షెడ్యూల్లోనూ స్వల్ప మార్పులుండే అవకాశముందని చెబుతున్నారు. విద్యా సంస్థలు తిరిగి తెరవాల్సి వస్తే స్కూలుకు రావాలంటూ బలవంతం చేయకుండా, ప్రత్యక్ష బోధనకుతోడు ఆన్ లైన్ బోధనా కొనసాగించాలని భావిస్తున్నారు. మరో రెండు రోజుల్లో విద్యాసంస్థలను తెరవడంపై స్పష్టత వచ్చే అవకాశముంది.

చదవండి:

Schools: విద్యాశాఖ తాజాగా జారీ చేసిన సూచనలివే..

Education: అందరి ఆకాంక్షల చదువే..కానీ

Education: ఉన్నత విద్యకూ ‘విద్యాంజలి’

Published date : 25 Jan 2022 03:41PM

Photo Stories