Skip to main content

Schools: విద్యాశాఖ తాజాగా జారీ చేసిన సూచనలివే..

రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది.
games
ఆటలు వద్దు.. విద్యార్థులను గుంపులుగా చేరనీయొద్దు..

ఇందులో భాగంగా ఇటీవల ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో తాజాగా అన్ని స్కూళ్లకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ పలు సూచనలు జారీ చేశారు. గతంలో జారీ చేసిన కోవిడ్‌ ప్రోటోకాల్‌ అంశాలను పాటిసూ్తనే.. కొన్ని విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. సంక్రాంతి సెలవుల అనంతరం శానిటైజ్‌ చేయించడం, మాసు్కలు తప్పనిసరి చేయడం వంటి చర్యలతో స్కూళ్లను పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంతో తొలిరోజే 65 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రస్తుతం 90 శాతానికి పైగా విద్యార్థులు స్కూళ్లకు వస్తున్నారు.

పాఠశాల విద్యాశాఖ తాజాగా జారీ చేసిన సూచనలివి..

  • పాఠశాలల్లో ప్రార్థన కార్యక్రమాన్ని, క్రీడలను కొనసాగించరాదు.
  • స్కూళ్లలో విద్యార్థులను గుంపులుగా చేరనీయొద్దు.
  • విద్యార్థులు భౌతికదూరం పాటించాలి.
  • తరచూ చేతులు కడుక్కునేలా విద్యార్థులను చైతన్యపర్చాలి.
  • రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు, క్షేత్రస్థాయి అధికారులు పాఠశాలల్లో కోవిడ్‌ ప్రోటోకాల్‌ నిబంధనలు తప్పకుండా అమలయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలి.
  • స్కూళ్ల ఆవరణ, తరగతి గదులను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయాలి.
  • ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయుడు, ఇతర సిబ్బంది తప్పనిసరిగా మాస్కు ధరించేలా చూడాలి.
  • ఎక్కడైనా కోవిడ్‌ సోకినట్లయితే వెంటనే జిల్లా విద్యాధికారులు.. జిల్లా వైద్యాధికారులను సంప్రదించి వైరస్‌ వ్యాప్తి కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి.
  • కోవిడ్‌ సోకిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలి.

చదవండి:

Education: ఉన్నత విద్యకూ ‘విద్యాంజలి’

2వ దశ స్కూళ్ల మ్యాపింగ్ ప్రారంభం

Schools: శిథిలావస్థ నుంచి ఆధునికత వైపు ప్రభుత్వ అడుగులు

Published date : 25 Jan 2022 01:24PM

Photo Stories