Skip to main content

2వ దశ స్కూళ్ల మ్యాపింగ్ ప్రారంభం

ప్రభుత్వ పాఠశాలల మ్యాపింగ్ రెండో దశను జనవరి 22వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా విద్యా శాఖాధికారులు, ప్రాంతీయ సంచాలకులకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పాఠశాల విద్యా శాఖ సర్క్యులర్ జారీ చేసింది.
2వ దశ స్కూళ్ల మ్యాపింగ్ ప్రారంభం
2వ దశ స్కూళ్ల మ్యాపింగ్ ప్రారంభం

నూతన విద్యా విధానం ప్రకారం పాఠశాల విద్యలో ఫౌండేషన్ విద్యా విధానాన్ని ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీపంలోని హైసూ్కళ్లలో కలుపుతున్నారు. మొదటి దశలో ఒక కిలోమీటర్‌ పరిధిలో ఉన్న స్కూళ్ల మ్యాపింగ్‌ పూర్తయినందున అదే తరహాలో 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల పరిధిలోనివి, ఆపైబడి ఉన్న దూరంలోని స్కూళ్ల మ్యాపింగ్‌ చేపట్టాలని పాఠశాల విద్యా శాఖ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. స్కూళ్లు, విద్యార్థుల సంఖ్య, టీచర్లు, మౌలిక సదుపాయాల వివరాలు, ప్రత్యామ్నాయాలపై కసరత్తు చేయాలని సూచించింది. ప్రైమరీ, అప్పర్‌ ప్రైమరీ స్కూళ్లను సమీపంలోని హైసూ్కళ్ల హెడ్మాస్టర్‌ లాగి¯ŒS ద్వారా మ్యాపింగ్‌ చేయాలని పేర్కొంది. సహజసిద్ధమైన అడ్డంకుల వల్ల మ్యాపింగ్‌కు వీలుకాని వాటికి కారణాలను స్పష్టంగా పేర్కొనాలని తెలిపింది. ప్రభుత్వ, ఎంపీపీ, జెడ్పీపీ, మున్సిపల్, గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలను మ్యాపింగ్‌ చేసేటప్పుడు ఏ యాజమాన్య స్కూలునైనా పరిగణనలోకి తీసుకోవచ్చని వివరించింది. ఎయిడెడ్, రెసిడెన్షియల్‌ స్కూళ్లను మాత్రం దీని నుంచి మినహాయించింది. దూరాన్ని వాస్తవిక రోడ్‌ కనెక్టివిటీ ఆధారంగా చూడాలని, స్ట్రయిట్‌ లైన్లు, ఏరియల్‌ వ్యూ ఆధారంగా చేయవద్దని స్పష్టం చేసింది. ఉర్దూ, ఒడియా, తమిళ్, కన్నడ మాధ్యమ స్కూళ్లను అవే మీడియం స్కూళ్లకు మ్యాపింగ్‌ చేయాలంది. సమానమైన దూరంలో రెండు హైసూ్కళ్లు ఉంటే మౌలిక సదుపాయాలు ఎక్కువగా ఉన్న వాటిని ఎంచుకోవాలని తెలిపింది. మూడు కిలోమీటర్ల పరిధిలో హైసూ్కళ్లు లేని ప్రాంతాల్లోని అప్పర్‌ ప్రైమరీ స్కూళ్లలో మౌలిక సదుపాయాలను అనుసరించి అప్‌గ్రేడ్‌ చేయాలని పేర్కొంది. టీచర్లకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలు తరువాత విడుదల చేస్తామని చెప్పింది.

2024–25 నాటికి సింగిల్‌ మీడియం స్కూళ్లు

2024–25 నాటికి సింగిల్‌ మీడియం స్కూళ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం 2022–23లో 9, 10 తరగతుల్లో మాత్రమే డ్యూయల్‌ మీడియం ఉండాలని పేర్కొంది. 2023–24లో టెన్త్ లో మాత్రమే డ్యూయల్‌ మీడియం ఉండాలని స్పష్టం చేసింది. ఆయా స్కూళ్లలోని సబ్జెక్టు టీచర్ల స్టాఫ్‌ ప్యాట్రన్ ను కూడా ఈ సర్క్యులర్లో పొందుపరిచారు.

చదవండి: 

Schools: శిథిలావస్థ నుంచి ఆధునికత వైపు ప్రభుత్వ అడుగులు

Holidays: విద్యాసంస్థల పునః ప్రారంభం అప్పటి నుంచే..ఈ సారి పరీక్షలను..?

Education: టీకా భ‌రోసా...చదువుకు రక్షణ

Published date : 21 Jan 2022 12:52PM

Photo Stories