Education: టీకా భరోసా...చదువుకు రక్షణ
మరోవైపు ప్రైవేట్ పాఠశాలల్లో డ్రాపౌట్ల పెరుగుదల నమోదైంది. ఈ నేపధ్యంలో విద్యా సంస్థలు పునఃప్రారంభమై చదువులు గాడిన పడుతున్నాయనుకుంటున్న దశలో...మరోసారి కరోనా పంజా విసిరింది. విద్యా ప్రగతి పట్టాలు తప్పింది. మళ్లీ ఆన్‌లైన్ తరగతుల ప్రస్తావ తెచ్చింది. ఇది విద్యారంగానికి మేలు చేసేదేనా? మరిప్పుడు ఏం చేయాలి? దీనిపై విద్యావేత్త ఎక్స్‌లెన్షియా ఇన్‌స్టిట్యూషన్స్‌కు చెందిన వెంకట్ మురికి, అపోలో క్రెడిల్ ఆసుపత్రి వైద్యులు డా.బి.వి.ఎల్ నర్సింహారావులు ఏమంటున్నారంటే...
ఓ తాజా చేదు జ్ఞాపకం..
గతంలో లాక్‌డౌన్‌ల కారణంగా అకస్మాత్తుగా పాఠశాలలు మూసివేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల పిల్లలు బాగా నష్టపోయారని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఆన్‌లైన్ విద్యాభ్యాసం ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులకు సవాలుగా మారడం దీనికో కారణం. ఉపాధ్యాయులు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పూర్తిగా భిన్నమైన బోధనా శైలికి సరిపోయేలా వారి పాఠ్య ప్రణాళికలను పునర్నిర్మించుకోవాల్సి వచ్చింది. వర్చువల్ లెర్నింగ్ కారణంగా విద్యార్థులు నేర్చుకునే క్రమంలో ఆన్‌లైన్‌లో తరగతులకు శ్రద్ధ చూపడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇంటర్నెట్ కనెక్షన్‌లను సెటప్ చేయడం, పిల్లలు శ్రద్ధ మళ్లించకుండా తరగతులకు హాజరయ్యేలా చూసుకోవడం ఇలా ఓ వైపు పిల్లల చదువుకు బాధ్యత వహిస్తూ తమ స్వంత పనులపై దృష్టి పెట్టడం తల్లిదండ్రులకు సవాలుగా మారింది.
పాఠశాలకు తిరిగి వెళ్లడం పట్ల ...
ఈ పరిస్థితుల్లో తాజాగా 15–18 సంవత్సరాల వయసులోని టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రకటన దేశవ్యాప్తంగా చదువుల పునరుజ్జీవనానికి ఊపిరిలూదింది. .కోవిన్ పోర్టల్ చెబుతున్న డేటా ప్రకారం, 15–18 ఏళ్ల మధ్య వయస్కుల టీకా డ్రైవ్‌లో మొదటి రోజు 40 లక్షల మంది టీకాలు వేయించుకున్నారు. అంతేకాకుండా పాఠశాలల ప్రాంగణంలోనే విద్యార్థులకు టీకాలు వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం వల్ల చాలా మంది విద్యార్థులు కోవిడ్–19 బారిన పడటం గురించి ఆందోళన లేకుండా పాఠశాలకు తిరిగి వెళ్లడం పట్ల తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు,
సమస్యకి పరిష్కారం ఇదే..
ఏ విధంగా చూసినా చదువులు పూర్తిగా గాడిన పడాలంటే... టీకా డ్రైవ్ ఊపందుకోవడం తప్పనిసరి. థర్డ్ వేవ్ ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మొదటి డోస్‌తో టీకాలు వేసిన విద్యార్థులు రోగనిరోధక శక్తిని పొండం తరగతులను సురక్షితంగా ప్రారంభించడానికి బాటలు వేస్తుంది. విద్యార్ధుల మానసిక ఆరోగ్యాన్ని రిఫ్రెష్ చేస్తుంది. వ్యాక్సినేషన్ డ్రైవ్ హైబ్రిడ్ లెర్నింగ్ కోసం కొత్త మార్గాలను, ఇంటరాక్టివ్ లెర్నింగ్ కోసం వినూత్న పరిష్కారాలను మరింత తెరుస్తుంది. హైస్కూలర్‌లు ప్రీ–యూనివర్శిటీ కాలేజీకి వెళ్లేవారికి, విద్యాసంస్థలకు వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా సాధారణ స్థితికి తిరిగి తీసుకురావడం అంటే అది ఆర్థిక పునరుద్ధరణ అని అర్థం.
ల్యాబ్‌లలో సైన్స్ ప్రయోగాలు, సెమినార్‌లను ప్రదర్శించడం, క్రీడా కార్యకలాపాలలో భాగం కావడం, సంగీతం, నృత్యం, థియేటర్ తదితర విద్యా అనుబంధ కార్యకలాపాలు ఊపందుకుంటాయి. విద్యా రంగం కూడా కోర్సు మాడ్యూళ్లను పునరాలోచించవచ్చు, వాటిని మరింత సమకాలీన పంధాకు మార్చవచ్చు; మొత్తం మీద, టీకా డ్రైవ్ ఖచ్చితంగా పాఠశాలలు మరియు మొత్తం విద్యా రంగంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది, భావి భారత దార్శనికులకు మంచి భవిష్యత్తును రూపొందిస్తుంది.