Apollo 11 Mission: అందరాని చందమామను మానవాళి సగర్వంగా అందుకున్న రోజు ఇదే..
అందరాని చందమామను మానవాళి సగర్వంగా అందుకున్న రోజు అదే. టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న లక్షలాది మంది సాక్షిగా నాసా అపోలో 11 మిషన్ విజయవంతంగా చంద్రునిపై దిగింది. కాసేపటికి వ్యోమగామి నీల్‌ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుని ఉపరితలంపై కాలుపెట్టాడు.
ఆ ఘనత సాధించిన తొలి మానవునిగా చరిత్ర పుటల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఎడ్విన్ ఆ్రల్డిన్‌తో కలిసి నమూనాలు సేకరిస్తూ ఉపరితలంపై కొద్ది గంటలు గడిపాడు. మానవాళి ప్రస్థానంలో చిరస్థాయిగా మిగిలిపోనున్న ఆ మైలురాయికి గుర్తుగా అమెరికా జెండాను సగర్వంగా చంద్రునిపై పాతాడు. అయితే ఈ చర్య పెద్ద గందరగోళానికే దారితీసింది.
నాసా విడుదల చేసిన ఫొటోల్లో ఆ జెండా రెపరెపలాడుతూ కనిపించడం నానా అనుమానాలకు తావిచ్చింది. అసలు భూమిపై మాదిరిగా వాతావరణం, గాలి ఆనవాలు కూడా లేని చంద్రుని ఉపరితలంపై జెండా ఎలా ఎగిరిందంటూ సర్వత్రా ప్రశ్నలు తలెత్తాయి. చివరికి పరిస్థితి అపోలో 11 మిషన్ చంద్రునిపై దిగడం శుద్ధ అబద్ధమనేదాకా వెళ్లింది! అంతరిక్ష రంగంలో దూకుడు ప్రదర్శిస్తున్న యూఎస్‌ఎస్‌ఆర్ మీద ఎలాగైనా పైచేయి సాధించేందుకు నాసా ఇలా కట్టుకథ అల్లి ఉంటుందంటూ చాలామంది.
International Space Station: ‘ఐఎస్‌ఎస్’ను కూల్చాల్సిన అవసరం ఏంటి.. దీనికి ‘నాసా’ ఏం చెప్పింది?
పెదవి విరిచారు కూడా..
కానీ, ఆ జెండా రెపరెపల వెనక నాసా కృషి, అంతకుమించి సైన్స్ దాగున్నాయి. చూసేందుకు అచ్చం గాలికి రెపరెపలాడుతున్నట్టు కన్పించే అమెరికా జాతీయ జెండాను ఎలాగైనా చంద్రునిపై పాతాలన్నది నాసా పట్టుదల. నాసా సాంకేతిక సేవల విభాగం చీఫ్ జాక్ కింజ్లర్ ఈ సవాలును స్వీకరించారు. ఆయన ఆధ్వర్యంలో సైంటిస్టులు ఎంతగానో శ్రమించి మరీ ఆ జెండాను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
జెండా పై భాగం పొడవునా ఒక క్రాస్‌బార్ అమర్చారు. దానికి జెండాను అక్కడక్కడా ప్రెస్ చేశారు. తద్వారా జెండా పలుచోట్ల వంపు తిరిగినట్టు కనిపించేలా చేశారు. ఫలితంగా చూసేందుకది అచ్చం గాలికి రెపరెపలాడుతున్నట్టుగా కనిపించింది. నాసా ఉద్దేశమూ నెరవేరింది. అదే క్రమంలో వివాదాలకూ తావిచ్చింది. జెండా తయారీలో పలు అంశాలను దృష్టిలో పెట్టుకున్నారు.
జెండా కర్రను కూడా అతి తేలికగా, అదే సమయంలో అత్యంత తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో కూడా అత్యంత మన్నికగా ఉండే అనోడైజ్డ్ అల్యుమినియంతో తయారు చేశారు. చంద్రుని నేలపై తేలిగ్గా దిగేందుకు, కిందకు వాలకుండా నిటారుగా ఉండేందుకు వీలుగా దాని మొదట్లో చిన్న స్ప్రింగ్‌ను అమర్చారు. ఇక జెండాను కూడా చంద్రునిపై తీవ్రమైన ఉష్ణోగ్రత తదితరాలను తట్టుకునేందుకు వీలుగా నైలాన్ బట్టతో తయారు చేశారు. అనంతరం పలు అపోలో మిషన్లలో కూడా ఇదే తరహా జెండాలను చంద్రునిపైకి పంపారు.
SpaceX Falcon 9: కుప్పకూలనున్న 20 స్టార్‌లింక్ శాటిలైట్లు.. కారణం ఇదే..