Skip to main content

కేటీఆర్‌ ట్వీట్‌పై స్పందించిన హీరో మహేశ్‌బాబు

‘శ్రీమంతుడు సినిమా ఎందరికో స్ఫూర్తినిచ్చిన సినిమా. స్కూల్‌ భవనం నిర్మించి ఇచ్చిన సుభాష్‌ రెడ్డి నిజమైన హీరో. ఆయనలా ప్రజలకు సేవ చేసేందుకు మరెందరో ముందుకు రావాలి.
కేటీఆర్‌ ట్వీట్‌పై స్పందించిన హీరో మహేశ్‌బాబు
కేటీఆర్‌ ట్వీట్‌పై స్పందించిన హీరో మహేశ్‌బాబు

శ్రీమంతుడు బృందంతో కలిసి బీబీపేట స్కూల్‌ను సందర్శిస్తాను’ అని సినీ హీరో మహేశ్‌బాబు ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన తిమ్మయ్యగారి సుభాష్‌ రెడ్డి బీబీపేట ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. ఆ భవనం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో తన సొంత డబ్బు రూ.6 కోట్ల వ్యయంతో ఆధునిక హంగులతో కార్పొరేట్‌ పాఠశాలను తలదన్నేలా భవనాన్ని నిర్మించారు. ప్రారంభం సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‘శ్రీమంతుడు’ సినిమా స్ఫూర్తితో భవనం నిర్మించడం అభినందనీయమని, ఆ సినిమా హీరో మహేశ్‌బాబును తీసుకువస్తానని ప్రకటించారు. అనంతరం మంత్రి, పాఠశాల భవన ప్రారంబోత్సవంలో తాను పాల్గొన్న ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. దీన్ని చూసిన హీరో మహేష్‌బాబు మంత్రి ట్వీట్‌కు రీట్వీట్‌ చేశారు.

School Building

చదవండి:

Good News: ఉద్యోగాల్లో పదేళ్ల వయోపరిమితి సడలింపు

NEET: నీట్‌ రాష్ట్ర ర్యాంక్‌ల సమాచారం

‘ఎయిడెడ్‌’ అప్పగింత స్వచ్ఛందమే

Published date : 11 Nov 2021 06:22PM

Photo Stories