NEET: నీట్ రాష్ట్ర ర్యాంక్‌ల సమాచారం
నవంబర్ 1న నీట్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా రాష్ట్ర స్థాయిలో ఏ ర్యాంక్ వస్తుంది? ఆ ర్యాంక్‌కు సీటు వస్తుందా? లేదా? అని విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనికి వచ్చే వారంలో చెక్ పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్ టీఏ నుంచి నీట్‌లో అర్హత సాధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థుల సమాచారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి నవంబర్ 15 లేదా 16 అందనున్నట్టు సమాచారం. ఎన్ టీఏ నుంచి వివరాలు అందిన రెండు, మూడు రోజుల్లో యూనివర్సిటీ ర్యాంకులు విడుదల చేసే అవకాశం ఉంది. రాష్ట్రం నుంచి 59 వేల మందికి పైగా విద్యార్థులు ఈ ఏడాది నీట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాదితో పోలిస్తే రాష్ట్రం నుంచి అర్హత సాధించిన వారి సంఖ్య ఈ ఏడాది 15 శాతం మేర తగ్గినట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే సీట్ల కేటాయింపులో చివరి కటాఫ్ ర్యాంక్‌లు పెరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.
Must Check NEET Cut-off Ranks
5,010 ఎంబీబీఎస్ సీట్లు
ఆంధ్రప్రదేశ్‌లో 11 ప్రభుత్వ, 15 ప్రైవేటు, 2 మైనార్టీ కాలేజీల్లో కన్వీనర్, యాజమాన్య, ప్రవాస భారతీయ కోటా, ఇలా అన్ని విభాగాల్లో 5,010 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల వరకు మాత్రమే చూస్తే.. ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,180. రాష్ట్రంలో ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లలో 15 శాతం జాతీయ కోటా కింద నేషనల్ పూల్‌లో భర్తీ చేస్తారు. మిగతా 85 శాతం సీట్లను రాష్ట్రమే భర్తీ చేస్తుంది. కాగా, 2 ప్రభుత్వ డెంటల్ కాలేజీల్లో 140 సీట్లు, 14 ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో 1,300 బీడీఎస్ సీట్లు ఉన్నాయి.
చదవండి: