Admissions: గురుకుల కళాశాలలో అడ్మిషన్లకు గడువు పొడిగింపు
Sakshi Education
రాయదుర్గం: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో అడ్మిషన్ల కోసం దరఖాస్తు గడువు తేదీని పెంచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శారద తెలిపారు.
గురుకుల కళాశాలలో అడ్మిషన్లకు గడువు పొడిగింపు
2023–24 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మిడియట్ కోర్సు ల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తు తేదీని ఫిబ్రవరి 4 వరకు పొడిగించామన్నారు. ఈ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంపీసీలో 120 సీట్లు, బైపీసీలో 120 సీట్లు, ఎంఈసీలో 80 సీట్లు ఉన్నాయన్నారు.