Head Master Uppalaya: ఏ స్కూల్‌కు వెళ్లినా రూపురేఖల మార్పు
Sakshi Education
సాక్షి ప్రతినిధి, వరంగల్ : హనుమకొండ జిల్లాలోని కాజీపేట మండలం న్యూశాయంపేట పరిధి పోశంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం ఉప్పలయ్య ఏ స్కూల్‌కు వెళ్లినా దాని రూపురేఖలే మారుస్తారన్న పేరుంది.
ఆయన గతంలో హనుమకొండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేశారు. హెచ్‌ఎంగా వచ్చినప్పుడు 170 మంది విద్యార్థులుండేది.
సరైన సదుపాయాలు లేక చెట్లకిందే మధ్యాహ్న భోజనం వండే వారు. టాయ్‌లెట్స్ అంతంత మాత్రమే. అలాంటి పాఠశాలలో దాతల సహకారంతో పాఠశాల రూపురేఖలే మార్చేశారు.
చదవండి: Kavita Teacher: ఆటపాటలతో పాఠాలు.. కవిత టీచర్ క్లాసంటే పిల్లలకు ఎంతో ఇష్టం
కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ కింద వీ4 ఈక్విప్‌మెంటు కంపెనీ సహకారంతో రూ.1.75 లక్షలతో డిజిటల్ క్లాస్‌రూమ్ ఏర్పాటు చేయించారు.
అబ్దుల్‌కలాం ఫౌండేషన్ సహకారంతో రూ.3.50 లక్షలతో అధునాతన లైబ్రరీ ఏర్పాటు చేయించారు. ఇలాంటి లైబ్రరీ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనూ లేదంటే అతిశయోక్తి కాదు.
Published date : 05 Sep 2024 05:05PM