Skip to main content

Kavita Teacher: ఆటపాటలతో పాఠాలు.. కవిత టీచర్‌ క్లాసంటే పిల్లలకు ఎంతో ఇష్టం

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: కవిత టీచర్‌ క్లాసంటే పిల్లలకు ఎంతో ఇష్టం. ఎందుకంటే.. ఆమె ఆటపాటలతో పాఠాలను చెప్పేస్తారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం పెద్దరాజమూరు ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న కవిత.. విద్యార్థులకు ఇంటి వద్ద లభించే కాగితం, అట్టముక్కలను తక్కువ ఖర్చుతో వివిధ రూపాల్లోకి మార్చి వాటి ద్వారా క్లాసులు బోధిస్తున్నారు.
Kavita teacher teaches lessons through games

గణితంలో ఎక్కాల చట్రం, స్నేక్‌ ల్యాడర్‌ గేమ్, నంబర్స్, అల్ఫాబెట్స్‌ కాన్సెప్ట్‌ గేమ్‌ పేరుతో విద్యార్థులను ఆకట్టుకుంటూ వారికి అర్థమయ్యేలా పాఠాలు చెబుతున్నారు. నేలపై చుట్టూరా విద్యార్థులను కూర్చోబెట్టుకొని ప్రతి అంశంపై బొమ్మల ద్వారా బోధిస్తున్నారు.

చదవండి: Palle Anantha Reddy: శిథిలమైన బడిని.. గుడిని చేసిన పల్లె అనంతరెడ్డి

అంతేకాదు.. గణితం, సైన్స్, తెలుగు వంటి సబ్జెక్ట్‌లకు సంబంధించి విద్యార్థులకు బోధిస్తున్న అంశాలను, టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌ను ఇన్‌స్టా గ్రాం, యూట్యూబ్‌ చానల్‌ ద్వారా అందరికీ తెలియజేస్తూ లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. 

Published date : 05 Sep 2024 01:41PM

Photo Stories