Scholarship: ఉపకార దరఖాస్తులకు మరో అవకాశం.. చివరి తేదీ ఇదే..
2022–23 విద్యా సంవత్సరంలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించిన విద్యార్థులకు మరో అవకాశం ఇచ్చింది. దరఖాస్తు చేసుకోని విద్యార్థులు జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీలోపు ఈపాస్ వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈమేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా మే 31న ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి మార్చి నెలాఖరుతో దరఖాస్తుకు అవకాశాన్ని ప్రభుత్వం నిలిపివేసింది.
చదవండి: Pragati Scholarship: ఓన్లీ అమ్మాయిలకే... ఏడాదికి రూ.50 వేల స్కాలర్‌షిప్.. పూర్తి వివరాలు ఇవే
కానీ కొందరు విద్యార్థులు సరైన ధ్రువపత్రాలు లేనందున దరఖాస్తు చేసుకోలేకపోయారు. మరికొందరు ఆలస్యంగా కోర్పుల్లో చేరారు. కొన్ని రకాల కోర్సులకు కౌన్సెలింగ్ ప్రక్రియ సైతంచాలా ఆలస్యమైంది. దీనిపై ఆయా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి వినతులు సమర్పించారు.
చదవండి: Scholarships: డిగ్రీకి రూ.2 లక్షలు, పీజీకి రూ.6 లక్షలు... ఇలా చేస్తే యూజీ, పీజీ ఫ్రీ