విద్యా హక్కులు - చట్టాలు
1. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) RTE-2009 చట్టం ప్రకారం వయస్సు ధ్రువీకరణ పత్రం లేకపోతే పాఠశాలల్లో ప్రవేశం నిరాకరించవచ్చు
బి) బడి మధ్యలో మానేసిన పిల్లలు పాఠశాలలో చేరితే వారిలో కనీస అభ్యసన సామర్థ్యాలను 3 నెలల నుంచి 2 సంవత్సరాల్లోపు సాధించాలని RTE-2009 పేర్కొన్నది.
1) ఎ, బి రెండూ సరైనవి కావు
2) ఎ సరైంది, బి సరైంది కాదు
3) ఎ, బి రెండూ సరైనవి
4) ఎ సరైంది కాదు, బి సరైంది
- View Answer
- సమాధానం: 4
2. RTE-2009 ప్రకారం జతపరచండి.
జాబితా-1
i) దండన నిషేధం
ii) వృథా, స్తబ్థత నిషేధం
iii) T.C. లేకపోయినా ప్రవేశం నిరాకరించరాదు
iv) ఉపాధ్యాయుడి విధులు
జాబితా-2
a) సెక్షన్ 16
b) సెక్షన్ 05
c) సెక్షన్ 17
d) సెక్షన్ 24
1) i-b, ii-c, iii-d, iv-a
2) i-d, ii-a, iii-b, iv-c
3) i-c, ii-a, iii-b, iv-d
4) i-a, ii-d, iii-c, iv-b
- View Answer
- సమాధానం: 3
3. RTE-2009 చట్టం ప్రకారం జతపరచండి.
జాబితా-1
i) ప్రాథమిక విద్య అంటే
ii) బాలలు అంటే
iii) బలహీన వర్గాలు అంటే
iv) ప్రతికూల వర్గాలు అంటే
జాబితా-2
a) వార్షిక ఆదాయం తక్కువగా ఉన్న పిల్లలు
b) 1 నుంచి 8 తరగతులు
c) సామాజికంగా వెనుకబడిన పిల్లలు
d) 6 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు
1) i-b, ii-d, iii-a, iv-c
2) i-b, ii-d, iii-c, iv-a
3) i-d, ii-b, iii-a, iv-c
4) i-c, ii-d, iii-a, iv-b
- View Answer
- సమాధానం: 1
4. RTEలోని అధ్యాయం-04కు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) సాధారణ గడువు ముగిసిన తర్వాత వచ్చిన ప్రవేశం నిరాకరించరాదు
2) T.C. అడిగిన వెంటనే H.M ఇవ్వాలి
3) ఉపాధ్యాయులను ఉపాధ్యాయేతర పనుల్లో నియమించరాదు
4) క్యాపిటేషన్ రుసుం వసూలు చేస్తే దానికి 10 రెట్లు జరిమానా విధించాలి
- View Answer
- సమాధానం: 2
5. RTE-2009 చట్టం ప్రకారం కింది వాటిలో సరైన ప్రవచనం ఏది?
1) మొత్తం ఉపాధ్యాయ సంఖ్యలో 20% కంటే ఎక్కువ ఖాళీలు ఉంటే వెంటనే ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి
2) ఎస్సీలకు ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో 5% సీట్లను 1వ తరగతిలో కేటాయించాలి
3) చట్టం అమల్లోకి వచ్చిన 5 సంవత్సరాల్లోపు గుర్తింపు పొందని పాఠశాల తమ సొంత ఖర్చుతో ప్రభుత్వ గుర్తింపు పొందాలి
4) SMCల ఏర్పాటులో నాల్గింట కనీసం మూడు వంతుల సభ్యులు తల్లిదండ్రులై ఉండాలి
- View Answer
- సమాధానం: 4
6. 1 నుంచి 5 తరగతులు ఉన్న పాఠశాలలో 146 మంది విద్యార్థులు ఉంటే ఎంత మంది ఉపాధ్యాయులను నియమించాలి?
1) 4
2) 5
3) 6
4) 7
- View Answer
- సమాధానం: 2
7. RTE-2009 చట్టం ప్రకారం జతపరచండి.
జాబితా-1
i) సెక్షన్ 13
ii) సెక్షన్ 22
iii) సెక్షన్ 10
iv) సెక్షన్ 25
జాబితా-2
a) షెడ్యూల్లో సూచించిన విధంగా ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ఉండాలి
b) SMC సూచించిన విధంగా పాఠశాల అభివృద్ధి ప్రణాళికను తయారుచేయాలి
c) ప్రవేశపరీక్షలు నిషేధం
d) 6-14 ఏళ్ల పిల్లలను పాఠశాలలకు పంపడం తల్లిదండ్రుల విధి
1) i-c, ii-b, iii-d, iv-a
2) i-a, ii-b, iii-c, iv-d
3) i-b, ii-d, iii-c, iv-a
4) i-d, ii-a, iii-c, iv-b
- View Answer
- సమాధానం: 1
8. 6 నుంచి 8 తరగతులు ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ఎంత?
1) 1 : 30
2) 1 : 25
3) 1 : 35
4) 1 : 40
- View Answer
- సమాధానం: 3
9. కింది వాటిలో సరికానిది ఏది?
1) T.C. లేకపోయినా ప్రవేశం నిరాకరించరాదు
2) T.C. అడిగిన వెంటనే H.M. ఇవ్వాలి
3) రాష్ట్ర ప్రభుత్వం అధీకృతం చేసిన సంస్థల ద్వారా అర్హత పొందినవారే ఉపాధ్యాయులుగా అర్హులు
4) జాతీయ స్థాయిలో 15 మంది సభ్యులకు మించకుండా జాతీయ సలహా మండలి ఏర్పాటుచేయాలి
- View Answer
- సమాధానం: 3
10. ఒక విద్యా సంస్థ మొదటిసారి ప్రవేశ పరీక్షలను నిర్వహించగా రూ. 25,000 జరిమానా విధించింది. మరల రెండోసారి కూడా ప్రవేశ పరీక్ష నిర్వహించింది అయితే ఎంత జరిమానా విధించాలని RTE పేర్కొన్నది?
1) 25,000
2) 30,000
3) 50,000
4) 1,00,000
- View Answer
- సమాధానం: 3
11. స్థానిక ప్రభుత్వం విధుల గురించి తెలియజేసే సెక్షన్?
1) 10
2) 09
3) 12
4) 08
- View Answer
- సమాధానం: 2
12. RTE-2009 చట్టం ప్రకారం జతపరచండి.
జాబితా-1
i) రాష్ట్రపతి ఆమోదం
ii) క్యాబినెట్ ఆమోదం
iii) లోక్‌సభ ఆమోదం
iv) రాజ్యసభ ఆమోదం
జాబితా-2
a) జూలై 20
b) ఆగస్టు 04
c) ఆగస్టు 26
d) జూలై 02
1) i-d, ii-c, iii-b, iv-a
2) i-c, ii-b, iii-d, iv-a
3) i-c, ii-d, iii-b, iv-a
4) i-a, ii-d, iii-b, iv-c
- View Answer
- సమాధానం: 3
13. RTE-2009లో ఉన్న అధ్యాయం-04 పేరు?
1) బాలల హక్కుల సంరక్షణ
2) సంబంధిత, స్థానిక ప్రభుత్వాలు, తల్లిదండ్రుల విధి
3) పాఠ్యప్రణాళిక, మూల్యాంకనం, ప్రాథమిక విద్య పూర్తి
4) బడులు, టీచర్లు, బాధ్యతలు
- View Answer
- సమాధానం: 4
14. కింది వాటిలో సరికానిది ఏది?
1) ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ బోధన చేయరాదు
2) ప్రాసిక్యూషన్‌కు ముందస్తు అనుమతి పొందాల్సిన అవసరం లేదు
3) ప్రాథమిక విద్యలో బోర్డు పరీక్షలు నిషేధం
4) ప్రాథమిక విద్య పూర్తి అయిన తర్వాత సంబంధిత విద్యార్థికి ధ్రువీకరణ పత్రం అందజేయాలి
- View Answer
- సమాధానం: 2
15. జతపరచండి.
జాబితా-1
i) UNCRC ప్రకటన జారీ
ii) UNCRC డ్రాప్ట్పై చర్చ
iii) UNCRC ఆమోదం
iv) UNCRC అమలు
జాబితా-2
a) 1990
b) 1989
c) 1979
d) 1959
1) i-d, ii-c, iii-b, iv-a
2) i-c, ii-d, iii-a, iv-b
3) i-b, ii-c, iii-d, iv-a
4) i-a, ii-d, iii-c, iv-b
- View Answer
- సమాధానం: 1
16. కింది వాటిలో సరైంది ఏది?
G) UNCRC ప్రకారం 18 ఏళ్లలోపు వారందరూ బాలలే
బి) భారతదేశం UNCRC ని 1992లో ఆమోదించింది
1) ఎ, బి రెండూ సరైనవి
2) ఎ సరైంది, బి సరైంది కాదు
3) ఎ, బి రెండూ సరైనవి కావు
4) ఎ సరైంది కాదు, బి సరైంది
- View Answer
- సమాధానం: 1
17. జతపరచండి.
జాబితా-1
i) జీవించే హక్కు
ii) భాగస్వామ్యపు హక్కు
iii) రక్షణ పొందే హక్కు
iv) అభివృద్ధి చెందే హక్కు
జాబితా-2
a) అన్యాయం
b) విద్య
c) ఆరోగ్యం
d) భావ వ్యక్తీకరణ
1) i-d, ii-a, iii-c, iv-b
2) i-b, ii-c, iii-a, iv-d
3) i-c, ii-d, iii-a, iv-b
4) i-c, ii-b, iii-a, iv-d
- View Answer
- సమాధానం: 3
18. ప్రస్తుత జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం చైర్మన్?
1) డాక్టర్ శాంతిసిన్హా
2) ఆర్.కె. మాథుర్
3) శృతినాయర్ కేకర్
4) కుషాల్ సింగ్
- View Answer
- సమాధానం: 3
19. జతపరచండి.
జాబితా-1
i) ప్లాంటేషన్ చట్టం
ii) గనుల చట్టం
iii) ఫ్యాక్టరీల చట్టం
iv) చైల్డ్ ప్రొటెక్షన్ చట్టం
జాబితా-2
a) 12 సంవత్సరాలలోపు వారిని పనుల్లో నియమించరాదు
b) 16 సంవత్సరాలలోపు వారిని పనుల్లో నియమించరాదు
c) 14 సంవత్సరాలలోపు వారిని పనుల్లో నియమించరాదు
d) 15 సంవత్సరాలలోపు వారిని పనుల్లో నియమించరాదు
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-b, ii-c, iii-d, iv-a
3) i-c, ii-d, iii-a, iv-b
4) i-d, ii-a, iii-c, iv-b
- View Answer
- సమాధానం: 1
20. ‘డిక్లరేషన్ ఆఫ్ రైట్ టు డెవలప్మెంట్’ను ఆమోదించిన సంవత్సరం?
1) 1986
2) 1992
3) 1993
4) 1995
- View Answer
- సమాధానం: 3
21.జతపరచండి.
i) అల్పసంఖ్యాక వర్గాల వారికి విద్యాలయాల ఏర్పాటు
ii) అక్రమ రవాణా, కట్టు బానిసత్వం నిషేధం
iii) నేరం, శిక్ష నుంచి రక్షణ
iv) నిర్బంధం నుంచి రక్షణ
జాబితా-2
a) ఆర్టికల్ 22
b) ఆర్టికల్ 30
c) ఆర్టికల్ 23
d) ఆర్టికల్ 20
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-c, ii-b, iii-d, iv-a
3) i-d, ii-c, iii-b, iv-a
4) i-b, ii-c, iii-d, iv-a
- View Answer
- సమాధానం: 4
22. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏ స్థాయి అధికారాలు కలిగి ఉంటుంది?
1) సుప్రీంకోర్టు
2) సివిల్ కోర్టు
3) హైకోర్టు
4) జిల్లా కోర్టు
- View Answer
- సమాధానం: 2
23. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌ను ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న కమిటీ ఎంపిక చేస్తుంది
బి) జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను 1993 సెప్టెంబర్ 28న ఆర్డినెన్స ద్వారా ఏర్పాటు చేశారు
1) ఎ, బి రెండూ సరైనవి
2) ఎ, బి రెండూ సరైనవి కావు
3) ఎ సరైంది, బి సరైంది కాదు
4) బి సరైంది, ఎ సరైంది కాదు
- View Answer
- సమాధానం: 1
24. RTE ప్రకారం జతపరచండి.
జతపరచండి.
జాబితా-1
i) PIO
ii) వ్యక్తి స్వేచ్ఛ
iii) మూడో పార్టీ
iv) APIO
జాబితా-2
a) 48 గంటల లోపు సమాచారం ఇవ్వాలి
b) 30 రోజుల లోపు సమాచారం ఇవ్వాలి
c) 40 రోజుల లోపు సమాచారం ఇవ్వాలి
d) 35 రోజుల లోపు సమాచారం ఇవ్వాలి
1) i-a, ii-c, iii-d, iv-b
2) i-c, ii-d, iii-b, iv-a
3) i-b, ii-a, iii-c, iv-d
4) i-b, ii-a, iii-d, iv-c
- View Answer
- సమాధానం: 3
25.దురుద్దేశంతో తప్పుడు సమాచారం ఇచ్చినా, సకాలంలో సమాచారం ఇవ్వకపోయినా ఒక రోజుకి ఎంత జరిమానా విధించవచ్చు?
1) రూ. 100
2) రూ. 200
3) రూ. 250
4) రూ. 500
- View Answer
- సమాధానం: 3
26. మండల స్థాయి సమాచారం కోరితే దరఖాస్తు ఫీజు ఎంత చెల్లించాలి?
1) ధరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
2) రూ. 5
3) రూ. 2
4) రూ. 10
- View Answer
- సమాధానం: 2
27. ప్రస్తుత కేంద్ర సమాచార కమిషన్ చైర్మన్?
1) ఆర్.కె. మాథుర్
2) హెచ్.ఎల్. దత్తు
3) కె.ఎల్. ఖేహర్
4) డాక్టర్ సుభాషణ రెడ్డి
- View Answer
- సమాధానం: 1
28. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలల్లోపు PIO, APIO లను నియమించాలి
బి) కేంద్ర సమాచార కమిషన్ సభ్యులను రాష్ట్రపతి ఎంపిక చేస్తారు
1) ఎ, బి రెండూ సరైనవి కావు
2) ఎ సరైంది కాదు, బి సరైంది
3) ఎ, బి రెండూ సరైనవి
4) ఎ సరైంది, బి సరైంది కాదు
- View Answer
- సమాధానం: 1
29. జతపరచండి.
జాబితా-1
i) RTI అమలు
ii) NHRC అమలు
iii) UNCRC అమలు
iv) RTE అమలు
జాబితా-2
a) 2005 అక్టోబర్ 12
b) 1990 సెప్టెంబర్ 2
c) 2010 ఏప్రిల్ 1
d) 1993 అక్టోబర్ 12
1) i-a, ii-d, iii-b, iv-c
2) i-a, ii-b, iii-d, iv-c
3) i-d, ii-a, iii-b, iv-c
4) i-b, ii-a, iii-c, iv-d
- View Answer
- సమాధానం: 1
30. పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు గురించి తెలియజేసే ఆర్టీఈ సెక్షన్?
1) 20
2) 21
3) 22
4) 23
- View Answer
- సమాధానం: 2