తొలి ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాన్ని ఎప్పుడు స్థాపించారు?
1. ఉపాధ్యాయ సాధికారత అంటే?
1) ఉపాధ్యాయుడు జీతభత్యాల ద్వారా సంతృప్తి పొందడం
2) ఉపాధ్యాయుడి శక్తి యుక్తులను బలోపేతం చేయడం
3) ఉపాధ్యాయుడు ఆర్థికంగా మెరుగుపడటం
4) ఉపాధ్యాయుడు వేష, భాషల్లో మెరుగుపడటం
- View Answer
- సమాధానం: 2
2.కింది వాటిలో ఉపాధ్యాయ స్థాయి ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించని అంశం ఏది?
1) ఉపాధ్యాయుడు వినూత్న బోధనాభ్యసన సామగ్రిని ఉపయోగించి తరగతి గది కృత్యాలు నిర్వహించడం
2) ఉపాధ్యాయుడు తరగతి గదిలో సృజనాత్మక కృత్యాలను నిర్వహించడం
3) ఉపాధ్యాయుడు విద్యార్థుల తల్లిదండ్రులతో సత్సంబంధాలు కలిగి ఉండటం
4) ఉపాధ్యాయుడు విద్యార్థులతో కలిసిపోయి, వారిలో ఒకడిగా క్రీఢా పద్ధతి ద్వారా కృత్యాలు నిర్వహించడం
- View Answer
- సమాధానం: 3
3. ఏ నిబద్ధత ఉన్న ఉపాధ్యాయులు తమను తాము పాఠశాలకు అర్పించుకుంటారు?
1) భావావేశపరమైన నిబద్ధత
2) ప్రామాణికబద్ధ నిబద్ధత
3) యథాస్థితిలో ఉంచగలిగే నిబద్ధత
4) సమాజం పట్ల నిబద్ధత
- View Answer
- సమాధానం: 1
4. మన దేశంలో తొలి ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాన్ని ఎప్పుడు స్థాపించారు?
1) 1715
2) 1717
3) 1718
4) 1716
- View Answer
- సమాధానం: 4
5. CTE అంటే?
1) పూర్వ ప్రాథమిక ఉపాధ్యాయ విద్యా కార్యక్రమం
2) ఎలిమెంటరీ ఉపాధ్యాయ విద్యా కార్యక్రమం
3) సెకండరీ ఉపాధ్యాయ విద్యా కార్యక్రమం
4) స్నాతకోత్సవ ఉపాధ్యాయ విద్యా కార్యక్రమం
- View Answer
- సమాధానం: 3
6. జతపరచండి.
జాబితా-I జాబితా-II
i) CABE a) 1973
ii) NCERT b) 1921
iii) UGC c) 1961
iv) NCTE d) 1953
1) i-a, ii-d, iii-b, iv-c
2) i-b, ii-c, iii-d, iv-a
3) i-b, ii-c, iii-a, iv-d
4) i-b, ii-d, iii-c, iv-a
- View Answer
- సమాధానం: 2
7. జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష (ఎన్టీఎస్ఈ)ను ఏ సంస్థ నిర్వహిస్తుంది?
1) NCTE
2) NUEPA
3) NCERT
4) EFLU
- View Answer
- సమాధానం: 3
8. 1983లో నియమించిన ఛటోపాధ్యాయ కమిషన్ ఏ అంశానికి సంబంధించింది?
1) ఉపాధ్యాయ వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు
2) ఉపాధ్యాయుల సెలవుల వివరణ
3) ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యం
4) ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత
- View Answer
- సమాధానం: 4
9. జాతీయ అర్హత పరీక్ష (NET) నిర్వహించే సంస్థ?
1) UGC
2) NCERT
3) NCTE
4) NUEPA
- View Answer
- సమాధానం: 1
10. కింది వాటిలో సరికాని జతలు ఏవి?
ఎ) NCERT తూర్పు ప్రాంత RIE - భువనేశ్వర్
బి) NCERT పశ్చిమ ప్రాంత RIE - మైసూర్
సి) NCERT దక్షిణ ప్రాంత RIE - భోపాల్
డి) NCERT ఉత్తర ప్రాంత RIE - అజ్మీర్
1) ఎ, బి
2) బి, సి
3) సి, డి
4) డి, ఎ
- View Answer
- సమాధానం: 2
11. ప్రామాణికబద్ధ నిబద్ధత ఉన్న ఉపాధ్యాయుడిలో:
1) అంకితభావం ఉంటూ పాఠశాల లక్ష్యాలు తమ లక్ష్యాలుగా ఉంటాయి
2) వృత్తి ధర్మం భయ భక్తులతో ఉంటుంది
3) వ్యాపార ధోరణి, ఇచ్చిపుచ్చుకోవడం అనే ప్రాతిపదికన పనితీరు ఉంటుంది
4) తమకు తాము సంస్థకు అంకితమయ్యే లక్షణం ఉంటుంది
- View Answer
- సమాధానం: 3
12. జతపరచండి.
జాబితా-I జాబితా-II
i) NUEPA a) 1979
ii) APSCERT b) 1958
iii) CCRT c) 1971
iv) EFLU d) 1967
1) i-c, ii-d, iii-a, iv-b
2) i-c, ii-d, iii-b, iv-a
3) i-c, ii-b, iii-d, iv-a
4) i-c, ii-a, iii-d, iv-b
- View Answer
- సమాధానం: 1
13. ఉపాధ్యాయుడి దృష్ట్యా కింది వాటిలో బహిర్గత ప్రేరణా కారకం కానిది ఏది?
1) జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు పొందడం
2) ఉన్నత స్థాయి ప్రమోషన్ పొందడం
3) అంకిత భావంతో, నిబద్ధతతో తనంతట తాను తన వృత్తి ధర్మాన్ని నిర్వహించడం
4) గ్రామ ప్రజలు సన్మానించడం
- View Answer
- సమాధానం: 3
14. కింది వాటిలో EFLU కు సంబంధించి సరికానిది ఏది?
ఎ) ఇది ఒక ఆంగ్లభాష, విదేశీ భాషల విశ్వవిద్యాలయం
బి) దీని ప్రధాన కేంద్రం న్యూఢిల్లీలో ఉంది
సి) ఇది ఉపాధ్యాయులకు ఆంగ్ల భాషలో వృత్యంతర శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంది
డి) ఇది UNESCO మార్గదర్శకత్వంలో నడిచే సంస్థ
1) ఎ, బి
2) బి, సి
3) సి, డి
4) బి, డి
- View Answer
- సమాధానం: 4
15. NPE-1986 సూచన మేరకు ఉపాధ్యాయ వృత్తి నియమావళిని రూపొందించిన సంస్థ?
1) NCERT
2) NUEPA
3) NCTE
4) CIET
- View Answer
- సమాధానం: 1
16. కింది వాటిలో ఉపాధ్యాయుడి యథాస్థితిలో ఉంచగలిగే నిబద్ధతకు సంబంధించింది ఏది?
1) సంస్థ నుంచి జీతం, ఇతర సౌలభ్యాలు పొందుతూ ఉంటాడు కాబట్టి వృత్తికి అంకితమై ఉంటాడు
2) నిస్వార్థంతో తన వృత్తిలో సంపూర్ణంగా నిమగ్నమై, తను చేసే పనిని ఆస్వాదిస్తూ అనందం పొందుతాడు
3) తమను తాము సంస్థకు అర్పించుకుంటారు
4) యాజమాన్యం తొలగిస్తుందేమోనన్న అభద్రతాభావం వల్ల యథాస్థితిలో కొనసాగడానికి నిబద్ధత పాటిస్తాడు
- View Answer
- సమాధానం: 4
17. తరగతి గదిలో ఒక చిన్న సమస్య తలెత్తినప్పుడు సాధికారత ఉన్న ఉపాధ్యాయుడు:
1) ప్రధానోపాధ్యాయుడి సూచనల కోసం వేచిచూస్తాడు
2) స్వీయ ఆలోచనతో, సమయ స్ఫూర్తితో సమస్యను పరిష్కరిస్తాడు
3) పై అధికారుల అనుమతి కోసం వేచి చూస్తాడు
4) గ్రామ ప్రజలకు ఫిర్యాదు చేస్తాడు
- View Answer
- సమాధానం: 2
18. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ముఖ్య విద్య సలహాదారుగా వ్యవహరించేది?
1) NUEPA
2) NCTE
3) CIET
4) NCERT
- View Answer
- సమాధానం: 4