సర్వశిక్షా అభియాన్ఉద్దేశం?
1. ‘సర్వశిక్షా అభియాన్ (SSA) నినాదం ఏది?
1) ప్రాథమిక విద్య - ప్రాథమిక హక్కు
2) అందరికీ విద్య- అందరి వికాసం
3) అందరూ చదవాలి - అందరూ ఎదగాలి
4) అందరి చదువు - అందరి అభివృద్ధి
- View Answer
- సమాధానం: 3
2. NPEGEL పథకాన్ని ప్రధానంగా ఏ ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు?
ఎ) స్త్రీల అక్షరాస్యత జాతీయ అక్షరాస్యత కంటే తక్కువగా ఉన్న ప్రాంతాల్లో
బి) అక్షరాస్యతలో లింగ వ్యత్యాసం జాతీయ సగటు కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో
సి) స్త్రీల అక్షరాస్యత జాతీయ అక్షరాస్యత కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో
డి) బాలికల డ్రాపవుట్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో
1) ఎ, బి, సి, డి
2) ఎ, బి, డి
3) ఎ, బి, సి
4) బి, సి, డి
- View Answer
- సమాధానం: 2
3. కింది వాటిలో సర్వశిక్షా అభియాన్ (SSA) ఉద్దేశం ఏది?
1) 3-6 ఏళ్ల బాలబాలికలందరికీ పూర్వ ప్రాథమిక విద్యను అందించడం
2) ప్రాథమిక విద్యా స్థాయిలో లింగ వివక్ష, సామాజిక వర్గ వ్యత్యాసాలను తొలగించడం
3) సాంఘిక విద్యను అందించడం
4) డ్రాప్ అవుట్ అయిన బాలికలను గుర్తించి కేజీబీవీల్లో చేర్పించడం
- View Answer
- సమాధానం: 2
4. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) సర్వ శిక్షా అభియాన్ (SSA) అనేది స్పష్టమైన కాల వ్యవధితో, బడ్జెట్ కేటాయింపుతో ఉన్న కార్యక్రమం
బి) జిల్లా ప్రాథమిక విద్య కార్యక్రమం (DPEP) అనేది పూర్తిగా స్వదేశీ ఆర్థిక వనరులతో నడుపుతున్న కార్యక్రమం
1) ఎ, బి రెండూ సరైనవే
2) ఎ మాత్రమే
3) బి మాత్రమే
4) ఎ, బి రెండూ సరికావు
- View Answer
- సమాధానం: 2
5.మనదేశంలో మధ్యాహ్న భోజన పథకం మొదట ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
1) ఆంధ్ర ప్రదేశ్
2) గుజరాత్
3) మహారాష్ట్ర
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 4
6. జతపరచండి.
జాబితా - I
i) రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్(RMSA)
ii) సర్వ శిక్షా అభియాన్ (SSA)
iii) రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ (RAA)
జాబితా - II
a) 6-18 ఏళ్ల బాలబాలికలు
b) 14-18 ఏళ్ల బాలబాలికలు
c) 6-14 ఏళ్ల బాలబాలికలు
1) i-b, ii-c, iii-a
2) i-c, ii-b, iii-a
3) i-a, ii-b, iii-c
4) i-c, ii-a, iii-b
- View Answer
- సమాధానం: 1
7. కింది వాటిలో జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమానికి (DPEP) సంబంధించనిది ఏది?
1) పాఠశాల వయసు చిన్నారులు 20 మంది కంటే తక్కువగా ఉన్న చోట ప్రత్యామ్నాయ పాఠశాలలు ఏర్పాటు చేయడం
2) 3 కి.మీ. పరిధిలో ప్రాథమిక ఉన్నత పాఠశాల, ప్రతి 5 కి.మీ. పరిధిలో ఒక ఉన్నత పాఠశాలలను ఏర్పాటు చేయడం
3) 1 కి.మీ. పరిధిలో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడం
4) ఎడ్యుకేషన్ గ్యారెంటీ స్కీం అమలు చేయడం
- View Answer
- సమాధానం: 4
8.కింది వాటిలో ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్య ప్రాజెక్టు (APPEP) సూత్రం కానిది ఏది?
1) నూతన పోకడలతో కూడిన అభ్యసన ప్రక్రియను ఉపాధ్యాయులకు అందించడం
2) వ్యక్తిగత, సామూహిక, తరగతి కృత్యాలను కల్పించడం
3) స్థానిక వనరుల వినియోగం
4) ఇంటి పనిని నియంత్రిస్తూ కృత్యాలను నిర్వహించడం
- View Answer
- సమాధానం: 4
9. సర్వశిక్షా అభియాన్‌కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధుల కేటాయింపులకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
జాబితా - I
i) 9వ ప్రణణాళిక
ii) 10వ ప్రణాళిక
iii) 11వ ప్రణాళిక
జాబితా - II
a) 90 : 10
b) 75 : 25
c) 80 : 20
d) 85 : 15
e) 60 : 40
f) 50 : 50
1) i-d, ii-b, iii-f
2) i-d, ii-f, iii-a
3) i-b, ii-d, iii-e
4) i-c, ii-b, iii-d
- View Answer
- సమాధానం: 1
10. కింది పథకాలు వాటిని అమలు చేసిన సంవత్సరాలకు అనుగుణంగా అవరోహణ క్రమంలో అమర్చండి.
ఎ) ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా ప్రాజెక్టు (APPEP)
బి) సర్వశిక్షా అభియాన్ (SSA)
సి) రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (RMSA)
డి) జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం (DPEP)
1) ఎ, బి, సి, డి
2) డి, సి, బి, ఎ
3) సి, బి, డి, ఎ
4) సి, బి, ఎ ,డి
- View Answer
- సమాధానం: 3
11. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (RMSA) కార్యక్షేత్రానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ప్రతి 5 కి.మీ. పరిధిలోకి మధ్యమిక పాఠశాలను అందుబాటులోకి తీసుకురావడం
బి) 7-10 కి.మీ. పరిధిలో ఉన్నత మాధ్యమిక పాఠశాలలను అందుబాటులోకి తీసుకురావడం
సి) 2017 నాటికి మాధ్యమిక విద్య సార్వత్రిక అందుబాటు
డి) 2020 నాటికి మాధ్యమిక విద్యను అభ్యసించాల్సిన యుక్త వయసు వారందరూ పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవడం
1) ఎ, బి, సి
2) ఎ, బి, డి
3) ఎ, డి, సి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 4
12. జతపరచండి.
జాబితా - I
i) NPEGEL
ii) RAA
iii) KGBV
iv) OBB
జాబితా - II
a) 1987
b) 2004
c) 2015
d) 2003
1) i-b, ii-c, iii-a, iv-d
2) i-d, ii-c, iii-b, iv-a
3) i-a, ii-b, iii-c, iv-d
4) i-c, ii-a, iii-b, iv-d
- View Answer
- సమాధానం: 2
13. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (KGBV)లకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) 2001 జనాభా లెక్కల ప్రకారం మహిళ అక్షరాస్యత జాతీయ అక్షరాస్యత కంటే తక్కువగా ఉన్న ప్రాంతాల్లో, స్త్రీ, పురుష అక్షరాస్యత మధ్య వ్యత్యాసం, జాతీయ వ్యత్యాసం కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కేజీబీవీలను ఏర్పాటు చేస్తారు
బి) ప్రత్యేక అవసరాల విద్యార్థులు, మైనారిటీ డ్రాప్ అవుట్స్ బాలికలు అధికంగా ఉన్న చోట కేజీబీవీలను ఏర్పాటు చేస్తారు
సి) రిజర్వేషన్ పద్ధతి ప్రకారం 75% సీట్లు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు, మిగతా 25% సీట్లు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లోని బాలికలకు కేటాయిస్తారు
డి) కేజీవీబీలను సర్వశిక్షా అభియాన్‌లో భాగంగా నిర్వహిస్తున్నారు
1) ఎ, బి, సి, డి
2) ఎ, బి, డి
3) ఎ, డి, సి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 4
14. NPEGEL ను విస్తరించండి.
1) National Programme for Education of Girls at Elementary Level
2) National Programme for Enrichment for Girls at Elementary Level
3) National Programme for Empowerment of Girls at Elementary Level
4) National Programme for Entertainment for Girls at Elementary Level
- View Answer
- సమాధానం: 1
15. జతపరచండి.
జాబితా - I
i) RMSA
ii) SSA
iii) RAA
జాబితా - II
a) 1-8వ తరగతులకు
b) 1-12వ తరగతులకు
c) 9-12వ తరగతులకు
1) i-c, ii-b, iii-a
2) i-c, ii-a, iii-b
3) i-a, ii-b, iii-c
4) i-b, ii-a, iii-c
- View Answer
- సమాధానం: 2
16. 1986 జాతీయ విద్యా విధానం సూచన అనుసరించి 1987 నుంచి అమలైన ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ OBB పథకానికి సంబంధించి కింది వాటిలో సరైన అంశం ఏది?
ఎ) అన్ని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పాఠశాల భవన నిర్మాణం చేయడం
బి) పాఠశాలలకు కంప్యూటర్లు అందించడం
సి) ప్రతి పాఠశాలలో కనీస బోధనాభ్యసన సామగ్రిని సరఫరా చేయడం
డి) జవహార్ రోజ్‌గార్ యోజన, ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స స్కీం నుంచి నిధులు సమకూర్చి ఈ పథకం కింద గదులు నిర్మించడం
ఇ) 198788లో 20%, 198889లో 30%, 198990లో మిగిలిన 50% పాఠశాలలకు ఈ పథకం అమలు చేయడం
ఎఫ్) పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించడం
1) ఎ, బి, సి, ఇ
2) ఎ, సి, ఇ, ఎఫ్
3) ఎ, సి, డి, ఎఫ్
4) ఎ, సి, డి, ఇ
- View Answer
- సమాధానం: 4
17. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమ విద్యను అందించడానికి, సమాచార నైపుణ్యాలు, కంప్యూటర్ విద్యను అందుబాటులో ఉంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008-09 విద్యా సంవత్సరంలో ప్రారంభించిన పాఠశాలలు?
1) సక్సెస్ పాఠశాలలు
2) ఆదర్శ పాఠశాలలు
3) గురుకుల పాఠశాలలు
4) నవోదయ పాఠశాలలు
- View Answer
- సమాధానం: 1
18. కింది వాటిలో మధ్యాహ్న భోజన పథకం లక్ష్యం కానిది ఏది?
ఎ) సార్వజనీన ప్రాథమిక విద్య
బి) పాఠశాలల్లో నమోదు, నిలకడ పెంచడం
సి) పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహార సరఫరా చేయడం
డి) తెలివైన విద్యార్థులకు బియ్యం అందించడం
ఇ) బాల బాలికల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఆహారం, పౌష్టికాహారం అందించడం
1) ఎ, బి
2) బి, సి
3) సి, డి
4) డి, ఇ
- View Answer
- సమాధానం: 3
19. జతపరచండి.
జాబితా - I
i) APPEP
ii) DPEP
iii) SSA
iv) RMSA
జాబితా - II
a) సార్వత్రిక ప్రాథమిక విద్య సాధన కోసం బడ్జెట్ కేటాయింపులో, కాలవ్యవధితో కూడిన కార్యాచరణ కార్యక్రమం
b) సాంకేతికత ఆధారిత విద్య, ఉపాధ్యాయులకు శిక్షణ లాంటి అంశాలతో గుణాత్మకతో కూడిన మాధ్యమిక విద్యను అందిచడానికి రూపొందించిన కార్యక్రమం
c) ప్రాథమిక పాఠశాలల భవన నిర్మాణం, ఆరు సూత్రాలపైన ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ముఖ్య అంశాల ప్రాతిపదికన రూపొందించిన కార్యక్రమం
d) ప్రాథమిక విద్య సర్వత్రా అందుబాటు, నమోదు, నిలుపుదల, గుణాత్మక విద్య లాంటి లక్ష్యాలను సూక్ష్మ ప్రణాళికల ద్వారా సాధించడానికి రూపొందించిన కార్యక్రమం
1) i-c, ii-d, iii-a, iv-b
2) i-d, ii-c, iii-b, iv-a
3) i-a, ii-b, iii-c, iv-d
4) i-c, ii-a, iii-b, iv-d
- View Answer
- సమాధానం: 1
20.ఆంధ్రప్రదేశ్ జిల్లా ప్రాథమిక విద్య ప్రాజెక్టు (DPEP) అమలుకు ఆర్థిక సహాయం అందించిన విదేశీ సంస్థలు ఏవి?
1) ODA, ప్రపంచ బ్యాంక్, యూనిసెఫ్
2) ODA, ప్రపంచ బ్యాంక్, యునెస్కో
3) ODA, ప్రపంచ బ్యాంక్, UNDP
4) ODA, ప్రపంచ బ్యాంక్, IMF
- View Answer
- సమాధానం: 3
21. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) విద్యార్థుల్లో అన్వేషణా దృక్పథం, సృజనాత్మకత, గణితం, విజ్ఞాన శాస్త్రాల పట్ల అభిరుచిని పెంపొందించడానికి 2015లో అబ్దుల్ కలాం ప్రారంభించిన కార్యక్రమం - రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ (RAA)
బి) "We learn to live, we learn to think and we learn to learn" అనేది రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ నినాదం
సి) ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు గుణాత్మక ఆంగ్ల మాధ్యమ విద్యను అందించాలనే ఉద్దేశంతో 2013లో కేంద్రీయ విద్యాలయ నమూనాతో ఏర్పాటు చేసిన పాఠశాలలు - ఆదర్శ పాఠశాలలు
డి) ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు గుణాత్మక హిందీ మాధ్యమ విద్యను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాఠశాలలు - ఆదర్శ పాఠశాలలు
1) ఎ, బి, డి
2) ఎ, సి, డి
3) ఎ, బి, సి
4) బి, సి, డి
- View Answer
- సమాధానం: 3
22. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) సార్వజనీన బాలికా విద్య కోసం ఆశ్రమ విధానంలో నిర్వహిస్తున్న విద్యాలయాలు కేజీబీవీలు
బి) కేజీబీవీల్లో 1 - 12వ తరగతులు నిర్వహిస్తున్నారు
సి) కేజీబీవీల్లో 10 ఏళ్ల వయసు పైబడిన బాలికలు చేరడానికి అర్హులు
డి) మన రాష్ట్రంలోని కేజీవీబీల్లో సీబీఎస్ఈ సిలబస్ బోధిస్తున్నారు
1) ఎ, సి
2) బి, సి
3) సి, డి
4) బి, డి
- View Answer
- సమాధానం: 4
23. జతపరచండి.
జాబితా - I
i) ప్రతిభా అవార్డ్
ii) ఇన్స్పైర్ అవార్డ్
iii) స్వేచ్ఛ విద్యాలయ పురస్కార్
iv) నేషనల్ మీన్స కమ్ మెరిట్ స్కాలర్షిప్
జాబితా - II
a) రూ. 50,000
b) రూ. 12,000
c) రూ. 20,000
d) రూ. 10,000
1) i-c, ii-d, iii-b, iv-a
2) i-d, ii-c, iii-b, iv-a
3) i-c, ii-d, iii-a, iv-b
4) i-c, ii-a, iii-b, iv-d
- View Answer
- సమాధానం: 3
24. జతపరచండి.
జాబితా - I
i) బడికి వస్తా
ii) బడి పిలుస్తుంది
iii) విద్యాంజలి
iv) కళా ఉత్సవ్
జాబితా - II
a) పాఠశాలల్లో స్వచ్ఛంద బోధనను పెంపొందించడం
b) బాలబాలికల్లో కళాత్మక స్పృహ, నైపుణ్యాలను పెంపొందించడం
c) ప్రాథమిక విద్య - సార్వత్రిక నమోదు
d) బాలికల నమోదు పెంచడం
1) i-d, ii-c, iii-a, iv-b
2) i-d, ii-c, iii-b, iv-a
3) i-c, ii-d, iii-a, iv-b
4) i-c, ii-a, iii-b, iv-d
- View Answer
- సమాధానం: 1
25. కింది వాటిలో సవరణాత్మక బోధన (Remedia Teaching)కు సంబంధించిన కార్యక్రమం ఏది?
1) జ్ఞానధార
2) విద్యాంజలి
3) బడికి వస్తా
4) బడి పిలుస్తోంది
- View Answer
- సమాధానం: 1
26. 2017-18లో ప్రకటించిన స్వచ్ఛ విద్యాలయ పురస్కారాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత?
1) 1
2) 2
3) 3
4) 4
- View Answer
- సమాధానం: 4
27. సమగ్ర శిక్ష అభియాన్ ఏయే తరగతులకు సంబంధించింది?
1) 18 తరగతులు
2) 112 తరగతులు
3) నర్సరీ8 తరగతులు
4) నర్సరీ 12 తరగతులు
- View Answer
- సమాధానం: 4