సమకాలీన భారతదేశంలో విద్యాభ్యాసం
1. జతపరచండి.
జాబితా-1
i) 1971
ii) 1952
iii) 2003
iv) 1980
జాబితా-2
a) జనసంఖ్య స్థిరిత కోశ్ నిధి ఏర్పాటు చేశారు
b) జనాభా విద్య కోసం NCERT పాఠ్యప్రణాళిక రూపకల్పన చేశారు
c) జాతీయ జనాభా విద్యా పథకం ప్రారంభించారు
d) జాతీయ జనాభా నియంత్రణ కార్యక్రమం అమలు చేశారు
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-b, ii-d, iii-a, iv-c
3) i-c, ii-b, iii-d, iv-a
4) i-d, ii-a, iii-c, iv-b
- View Answer
- సమాధానం: 2
2. కింది వాటిలో జాతీయ జనాభా విధానం- 2000 లక్ష్యం కానిది ఏది?
1) 2045 సంవత్సరం నాటికి జనాభా సంఖ్యను స్థిరీకరించాలి
2) 2010 నాటికి మాతృ మరణాల రేటు 100 కంటే తగ్గించాలి
3) వివాహ వయస్సు భావన గురించి తెలియ జేసింది
4) జనాభా స్థిరీకరణ కోసం ఒక నిధిని ఏర్పాటు చేయాలి
- View Answer
- సమాధానం: 3
3. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) విద్య అవకాశాల సమానత్వానికి గిరిజన ప్రాంతాల్లో ఆయా తెగలు వారినే ఉపాధ్యాయులుగా నియమించాలని కొఠారి కమిషన్ సూచించింది.
బి) విద్య అవకాశాల సమానత్వంకి ఎస్సీ/ ఎస్టీ వారు నివసించే ప్రాంతాల్లోనే పాఠశాలలను స్థాపించాలని కొఠారి కమిషన్ సూచించింది
1) ఎ మాత్రమే సరైంది
2) ఎ, బి రెండూ సరైనవి కావు
3) ఎ, బి రెండూ సరైనవే
4) బి మాత్రమే సరైంది
- View Answer
- సమాధానం: 1
4. కింది వాటిలో శాంతి విద్య లక్ష్యం ఏది?
1) విమర్శనాత్మక ఆలోచన
2) సమాజంలో శాంతిని స్థాపించడం
3) గుణాత్మకంగా ఆలోచించడం
4) విలువలతో కూడిన విద్యను అందించడం
- View Answer
- సమాధానం: 4
5. సబల పథకం ఉద్దేశం ఏమిటి?
1) గిరిజన ప్రాంతాల్లోని 11-18 సంవత్సరాల వయస్సు ఉన్న బాలికల్లో సాధికారతను పెంపొందించడం
2) కౌమార దశలోని బాలికల సాధికారతను పెంపొందించడం
3) గ్రామీణ ప్రాంతాల్లోని కౌమార బాలికల్లో జీవన నైపుణ్యాలు పెంపొందించడం
4) ప్రభుత్వ పాఠశాలలోని 10-19 సంవత్సరాల వయస్సు ఉన్న బాలికల సాధికారతను పెంపొందించడం
- View Answer
- సమాధానం: 1
6. కింది వాటిని జతపరచండి.
జాబితా-1
i) సీమాంతర సరఫరా
ii) విదేశీ వినియోగం
iii) వ్యాపార ఉపస్థితి
iv) సహజ వ్యక్తుల ఉపస్థితి
జాబితా-2
a) సేవలు అందించేవారు, స్వీకరించే వారు తమ, తమ ప్రాంతాల నుంచి కదలకుండానే విద్య ప్రసరణ గావించడం
b) తమకు తాముగా విదేశాలకు వెళ్లి విద్యపరమైన సేవలను అందించడం
c) విదేశీ సంస్థలు, స్వదేశీ సంస్థలతో కలిసి బ్రాంచ్లను ఏర్పాటుచేసి విద్యాపరమైన సేవలను అందించడం
d) వినియోగదారులైన విద్యార్థులు ఉన్నత చదువుకు విదేశాలకు వెళ్లి విద్యను అభ్యసించడం
1) i-a, ii-d, iii-c, iv-b
2) i-a, ii-b, iii-c, iv-d
3) i-b, ii-a, iii-c, iv-d
4) i-c, ii-d, iii-b, iv-a
- View Answer
- సమాధానం: 1
7. కింది వాటిని జతపరచండి.
జాబితా-1
i) 15 (1)
ii) 15 (3)
iii) 16 (1)
iv) 30 (1)
జాబితా-2
a) అల్పసంఖ్యాక వర్గాల వారు విద్యాలయాలను స్థాపించుకోవచ్చు
b) ప్రభుత్వ సర్వీసుల్లో స్త్రీ, పురుష భేదం లేకుండా అవకాశాలు కల్పించాలి
c) స్త్రీ విద్య కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలి
d) ప్రభుత్వం లింగ ఆధారంగా విద్యను అందించడంలో వివక్ష చూపకూడదు
1) i-c, ii-a, iii-d, iv-b
2) i-d, ii-c, iii-b, iv-a
3) i-a, ii-d, iii-c, iv-b
4) i-d, ii-a, iii-b, iv-c
- View Answer
- సమాధానం: 2
8. కింది వాటిలో సరికానిది ఏది?
1) జవహర్ బాలల ఆరోగ్యరక్ష కార్యక్రమాన్ని 2010 నవంబర్ 14న ప్రారంభించారు
2) రాష్ట్రీయ కిశోర స్వస్థ్య కార్యక్రమం 2014 జనవరి 7న ప్రారంభించారు
3) విద్యార్థుల్లో కంటి పరీక్షల కోసం ‘చిన్నారి చూపు’ అనే కార్యక్రమాన్న 2012 డిసెంబర్ 8న ప్రారంభించారు
4) రాష్ట్రీయ బాలల స్వచ్ఛత కార్యక్రమం 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లల కోసం ప్రవేశపెట్టారు.
- View Answer
- సమాధానం: 4
9. కౌమార విద్య లక్ష్యం కానిది ఏది?
1) జీవన నైపుణ్యాలను పెంపొందించడం
2) బాధ్యతాయుతమైన లైంగిక ప్రవర్తన గురించి అవగాహన కలిగించడం
3) కౌమార బాలికల్లో సాధికారతను పెంపొందించడం
4) హెచ్ఐవీ/ఎయిడ్స గురించి అవగాహన కలిగించడం
- View Answer
- సమాధానం: 3
10. కింది వాటిని జతపరచండి.
జాబితా-1
i) సంజ్ఞనాత్మక ఆలోచన నైపుణ్యం
ii) సామాజిక ఆలోచన నైపుణ్యం
iii) స్వయం నియంత్రణ ఆలోచన నైపుణ్యం
iv) జీవన నైపుణ్యం కానిది
జాబితా-2
a) భావ వ్యక్తీకరణ నైపుణ్యం
b) సృజనాత్మక ఆలోచన
c) సానుభూతి
d) ఉద్వేగాలను అధిగమించడం
1) i-d, ii-c, iii-b, iv-a
2) i-c, ii-d, iii-a, iv-b
3) i-a, ii-d, iii-b, iv-c
4) i-b, ii-a, iii-d, iv-c
- View Answer
- సమాధానం: 4
11.‘అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్ డిఫిషియెన్సీ’ వారి మానసిక వైకల్య వర్గీకరణ ప్రకారం కింది వాటిని జతపరచండి.
జాబితా-1
i) తీవ్ర మానసిక వైకల్యం
ii) స్వల్ప మానసిక వైకల్యం
iii) మిత మానసిక వైకల్యం
iv) అతి తీవ్ర మానసిక వైకల్యం
జాబితా-2
a) IQ 2035
b) IQ 7090
c) IQ 20 లోపు
d) IQ 3550
e) IQ 5070
1) i-a, ii-e, iii-d, iv-c
2) i-d, ii-b, iii-a, iv-c
3) i-d, ii-e, iii-b, iv-a
4) i-d, ii-e, iii-b, iv-c
- View Answer
- సమాధానం: 1
12. కింది వాటిలో సరైంది ఏది?
జాబితా-1
ఎ) భారతదేశంలో సమైక్య విద్యను ప్రవేశపెట్టాలని తొలిసారి సూచించిన వారు ప్రొఫెసర్ అరవిందుడు
బి) విలీన విద్య ఉద్దేశం విద్యార్థుల అందరి అవసరాలను తీర్చడం
1) ఎ మాత్రమే సరైంది
2) బి సరైంది
3) ఎ, బి రెండూ సరైనవే
4) ఎ, బి రెండూ సరైనవి కావు
- View Answer
- సమాధానం: 3
13. కింది వాటిని జతపరచండి.
జాబితా-1
i) స్వల్ప మానసిక వైకల్యం
ii) తీవ్ర మానసిక వైకల్యం
iii) మిత మానసిక వైకల్యం
iv) అతి తీవ్ర మానసిక వైకల్యం
జాబితా-2
a) శిక్షణ పొందగల మానసిక వికలాంగులు
b) నిరంతర పర్యవేక్షణ అవసరం
c) విద్యను నేర్వ గల మానసిక వికలాంగులు
d) పూర్తిగా నిస్సహాయులు
1) i-c, ii-b, iii-a, iv-d
2) i-a, ii-b, iii-c, iv-d
3) i-d, ii-b, iii-a, iv-c
4) i-c, ii-d, iii-a, iv-b
- View Answer
- సమాధానం: 1
14. కింది వాటిని జతపరచండి.
జాబితా-1
i) జననపూర్వ కారణాలు
ii) జనన సమయ కారణాలు
iii) జననాంతర కారణాలు
iv) పరిసర కారణాలు
జాబితా-2
a) శిశువుకి తీవ్ర పౌష్టికాహారలోపం
b) కఠినమైన క్రమశిక్షణ
c) శిశువు ముందుగానే జన్మించడం
d) మేనరికపు వివాహాలు
1) i-c, ii-a, iii-d, iv-b
2) i-a, ii-c, iii-b, iv-d
3) i-d, ii-a, iii-b, iv-c
4) i-d, ii-c, iii-a, iv-b
- View Answer
- సమాధానం: 4
15. బుద్ధిమాంద్యత ఉన్న పిల్లలకు కిర్క - జాన్సన్ ప్రకారం విద్యా ప్రణాళిక కానిది?
1) సమైక్య విధానం
2) గృహ శిక్షణ
3) ఆల్టర్నేటివ్ స్కూల్ నమూనా
4) ఆశ్రమ పాఠశాల
- View Answer
- సమాధానం: 3
16. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) రిసోర్స్ బోధన నమూనా అంటే ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు పాఠశాలలు మారుతూ ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు తర్ఫీదు ఇచ్చే విధానం
బి) ఇటినరెంట్ బోధన నమూనా అంటే ‘ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు ఒకే పాఠశాలలో ఉండి ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు తర్ఫీదు ఇచ్చే విధానం’
1) ఎ మాత్రమే
2) ఎ,బి రెండూ సరైనవి
3) బి మాత్రమే
4) ఎ, బి రెండూ సరైనవి కావు
- View Answer
- సమాధానం: 4
17.జతపరచండి.
జాబితా-1
i) క్రోమోజోమ్ల అపసవ్యత
ii) థైరాక్సిన్ హార్మోన్ లోపం
iii) సెరిబ్రో స్పైనల్ ప్లూయిడ్
iv) అమైనోయాసిడ్ ఫినైల్ ఎలనైన్
జాబితా-2
a) హైడ్రోసెఫాలీ
b) ఫినైల్ కిటోన్యూరియో
c) డౌన్ సిండ్రోమ్
d) క్రిటినిజమ్
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-c, ii-d, iii-b, iv-a
3) i-c, ii-d, iii-a, iv-b
4) i-a, ii-d, iii-c, iv-b
- View Answer
- సమాధానం: 3
18. జతపర చండి.
జాబితా-1
i) ఆకృతీకరణం
ii) గొలుసు విధానం
iii) క్రమణ అస్థిత్వం
iv) సంకేతీకరణం
జాబితా-2
a) కీలక విషయాన్ని అందిస్తూ భౌతికంగా మార్గదర్శకత్వం అందించడం
b) కార్యక్రమంలో పురోభివృద్ధిని బట్టి క్రమంగా సహాయం తగ్గించడం
c) చెప్పే విషయాన్ని చిన్న చిన్న భాగాలు చేసి బోధించి ప్రతిస్పందనలు వచ్చేటట్లు చేయడం
d) విజయవంతమైన కార్యక్రమాలకు మాత్రమే పునర్భలనాలను అందిస్తూ ముందుకు సాగడం
1) i-d, ii-c, iii-a, iv-b
2) i-d, ii-c, iii-b, iv-a
3) i-a, ii-c, iii-b, iv-d
4) i-b, ii-c, iii-a, iv-d
- View Answer
- సమాధానం:2
19. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) హైపోగ్లైసీమియా అభ్యసన వైకల్యానికి దారితీస్తుంది
బి) టర్నర్ సిండ్రోమ్ అభ్యసన వైకల్యానికి దారితీస్తుంది
1) ఎ మాత్రమే సరైంది
2) ఎ,బి రెండూ సరైనవే
3) ఎ,బి రెండూ సరైనవి కావు
4) బి మాత్రమే సరైంది
- View Answer
- సమాధానం: 2
20.కింది వాటిని జతపరచండి.
జాబితా-1
i) డిస్ఫేషియా
ii) డిస్లెక్సియా
iii) ఆగ్రాఫియా
iv) ఆలేక్సియా
జాబితా-2
a) సరిగ్గా చదవలేకపోవడం
b) ఇతరులు వ్యక్తపరచిన పదాలను గ్రహించడంలో లోపం
c) ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవలేకపోవడం
d) రాయడంలో ఆసక్తిలేకపోవడం
1) i-b, ii-a, iii-d, iv-c
2) i-b, ii-c, iii-d, iv-a
3) i-c, ii-b, iii-d, iv-a
4) i-b, ii-d, iii-a, iv-c
- View Answer
- సమాధానం: 1
21. కింది వాటిలో సరికానిది ఏది?
1) భాష, గణితంపై పట్టు సాధించడం ద్వారా అభ్యసన లోపాలన్నీ అధిగమించడాన్ని ప్రవర్తన విధానం అంటారు
2) బొమ్మలు గీయడం, చిత్రాలు పూరించడం ద్వారా అభ్యసన లోపాలన్నీ అధిగమించే విధానాన్ని వికాస విధానం అంటారు
3) VAKT విధానంలో K అంటే ‘Kinaesthetic’ అని అర్థం’
4) పరిశీలన ద్వారా అభ్యసనా లోపాలను అధిగమించడాన్ని మనో విజ్ఞాన పద్ధతి అంటారు.
- View Answer
- సమాధానం: 4
22. జతపరచండి.
జాబితా-1
i) వ్యతిరిక్త వినికిడి లోపం
ii) వాహక సంబంధ వినికిడి లోపం
iii) అపరివర్తన వినికిడి లోపం
iv) సెన్సరీన్యూరాల్ వినికిడి లోపం
జాబితా-2
a) వెలుపలి లేదా మధ్య చెవిలో లోపాలు కలిగి ఉండటం
b) మందుల ద్వారా నయం చేయగల వినికిడి లోపం
c) లోపలి చెవి లేదా శ్రవణ నాడి మార్గంలో లోపాలు కలిగి ఉండటం
d) మందుల ద్వారా నయం చేయలేని వినికిడి లోపం
1) i-d, ii-c, iii-b, iv-a
2) i-a, ii-b, iii-c, iv-d
3) i-d, ii-a, iii-c, iv-b
4) i-b, ii-a, iii-d, iv-c
- View Answer
- సమాధానం: 4
23. పీడబ్ల్యూడీ 1995 ప్రకారం అంధులు కానివారు?
1) దృష్టి స్పష్టత 6/60 కంటే తక్కువగా ఉన్న వారు
2) దృష్టి క్షేత్రం 30° కంటే తక్కువ ఉన్న వారు
3) దృష్టి క్షేత్రం 20° కంటే తక్కువగా ఉన్న వారు
4) దృష్టి స్పష్టత 20/200 కంటే తక్కువగా ఉన్న వారు
- View Answer
- సమాధానం: 2
24. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) లోవెన్ఫీల్డ్ అంధుల కోసం కూర్జవల్ రీడింగ్ మిషన్ పరికరం కనుగొన్నాడు
బి) 1784లో లూయీ బ్రెయిల్ పారిస్లో తొలి అంధుల పాఠశాలను స్థాపించాడు
1) ఎ మాత్రమే
2) ఎ,బి సరైనవి కావు
3) బి మాత్రమే
4) ఎ,బి సరైనవి
- View Answer
- సమాధానం: 1
25. జతపరచండి.
జాబితా-1
i) మిత వినికిడి లోపం
ii) తీవ్ర వినికిడి లోపం
iii) మిత తీవ్ర వినికిడి లోపం
iv) స్వల్ప వినికిడి లోపం
జాబితా-2
a) 71 dB-90 dB
b) 26dB- 40 dB
c) 91 dB-110 dB
d) 41dB-55 dB
e) 56 dB-70 dB
1) i-d, ii-c, iii-e, iv-a
2) i-d, ii-a, iii-e, iv-b
3) i-b, ii-a, iii-d, iv-e
4) i-e, ii-c, iii-a, iv-b
- View Answer
- సమాధానం: 2
26. జతపరచండి.
జాబితా-1
i) కీన్స
ii) ఆడస్మిత్
iii) యునెస్కో
iv) మార్షల్
జాబితా-2
a) విద్య అనేది వినిమయ అంశం
b) విద్య అనేది ఒక పెట్టుబడి
c) విద్య ఒక మూలధనం
d) విద్యపై మనం చేసేది పెట్టుబడి కాదు, అది మనం చేసే ఖర్చుగా భావించాలి
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-d, ii-c, iii-b, iv-a
3) i-c, ii-d, iii-a, iv-b
4) i-a, ii-c, iii-b, iv-d
- View Answer
- సమాధానం: 1
27. స్నెల్లెన్ చార్టును దేని కోసం ఉపయోగిస్తారు?
1) శ్రవణ నష్టాన్ని కొలవడానికి
2) దృష్టి క్షేత్రం తెలుసుకోవడానికి
3) అభ్యసనా వైకల్యాన్ని తెలుసుకోవడానికి
4) దృష్టి స్పష్టతను తెలుసుకోవడానికి
- View Answer
- సమాధానం: 4