స్వాతంత్య్రం అనంతర విద్యా విధానం
1. "A lot is taught but little is learnt or understood’అనేది దేని సమీక్షా సారాంశం?
1) కొఠారి కమిషన్
2) ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ
3) యశ్పాల్ కమిటీ
4) మొదలియార్ కమిషన్
- View Answer
- సమాధానం: 3
2. జతపరచండి.
జాబితా-I
a) కొఠారి కమిషన్
b) NPE 1986
c) ఆచార్య రామ్మూర్తి కమిటీ
d) యశ్పాల్ కమిటీ
e) మల్కం ఆదిశేషయ్య కమిటీ
జాబితా-II
i) Learning without burden
ii) Learning to do
iii) Education and national development
iv) Challenges in education, policy perspective
v) Towards an enlightened human Society
1) a-iii, b-iv, c-v, d-ii, e-i
2) a-iii, b-iv, c-ii, d-v, e-i
3) a-iii, b-iv, c-i, d-ii, e-v
4) a-iii, b-iv, c-v, d-i, e-ii
- View Answer
- సమాధానం: 4
3. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ‘పని అనుభవం’ను ప్రవేశపెట్టాలి - కొఠారి ప్రతిపాదన
బి) "SUPW’ను ప్రవేశపెట్టాలి - యశ్పాల్ ప్రతిపాదన
1) ఎ, బి రెండూ సరైనవి
2) ఎ సరైంది, బి సరైంది కాదు
3) ఎ సరైంది కాదు, బి సరైంది
4) ఎ, బి రెండూ సరైనవి కావు
- View Answer
- సమాధానం: 2
4. కింది వాటిలో సరికానిది ఏది?
1) సెకండరీ విద్యా కమిషన్ సూచించిన విద్యా నిర్మాణం 5+3+4+3
2) కొఠారి కమిషన్ సూచించిన విద్యా నిర్మాణం 10+2+3
3) NPE 1986 వ్యూహకర్త - ఇందిరా గాంధీ
4) ఆచార్య రామ్మూర్తి కమిటీ NPE 1986కి రివ్యూ కమిటీ
- View Answer
- సమాధానం: 3
5. కింది కమిటీలను వాటి సంవత్సరాలకు అనుగుణంగా ఆరోహణ క్రమంలో అమర్చండి.
ఎ) యశ్పాల్ కమిటీ
బి) ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ
సి) జనార్దన్‌రెడ్డి కమిటీ
డి) ఆచార్య రామ్మూర్తి కమిటీ
1) బి,డి,సి,ఎ
2) బి,డి,ఎ,సి
3) బి,ఎ,డి,సి
4) డి,బి,సి,ఎ
- View Answer
- సమాధానం: 1
6. కింది వాటిలో కొఠారి కమిషన్ సూచన కానిది ఏది?
1) పని అనుభవాన్ని విద్యా ప్రణాళికలో భాగం చేయాలి
2) త్రిభాషా సూత్రాన్ని మాధ్యమిక విద్యలో ప్రవేశపెట్టాలి
3) విద్యను ఉత్పాదకతతో ముడిపెట్టాలి
4) బహుళార్థసాధక మాధ్యమిక పాఠశాలలు ఏర్పాటుచేయాలి
- View Answer
- సమాధానం: 4
7. జతపరచండి.
జాబితా-I
a) భారతీయ విద్యా కమిషన్
b) స్కూల్ బ్యాగ్ కమిటీ
c) సెకండరీ విద్యా కమిషన్
d) విశ్వవిద్యాలయాల కమిషన్
జాబితా-II
i) మొదలియార్
ii) రాధాకృష్ణన్
iii) కొఠారి
iv) యశ్పాల్
1) a-iii, b-iv, c-i, d-ii
2) a-iii, b-iv, c-ii, d-i
3) a-iii, b-ii, c-i, d-iv
4) a-iii, b-i, c-iv, d-ii
- View Answer
- సమాధానం: 1
8. కింది వాటిలో సరికానిది ఏది?
1) మాధ్యమిక విద్యలో హిందీని తప్పనిసరి చేయాలి - మొదలియార్ ప్రతిపాదన
2) విద్యార్ధుల్లో ఆధ్యాత్మిక, నైతిక విలువలు పెంపొందించాలి - కొఠారి ప్రతిపాదన
3) మాధ్యమిక పాఠశాల స్థాయిలో ద్విభాషా సూత్రాన్ని అమలు చేయాలి - NPE 1986 ప్రతిపాదన
4) ప్రాథమిక స్థాయిలో క్రీడా పద్ధతులను అనుసరించాలి - యశ్పాల్ ప్రతిపాదన
- View Answer
- సమాధానం: 3
9. కింది అంశాలకు సంబంధించి సంవత్సరాలకు అనుగుణంగా అవరోహణ క్రమంలో అమర్చండి.
ఎ) జాతీయ అక్షరాస్యతా ఉద్యమం
బి) న ల్లబల్ల ప్రక్రియ అమలు ప్రారంభం
సి) నవోదయ పాఠశాలలు ఏర్పాటు ప్రారంభం
డి) జాతీయ వయోజన విద్యా పథకం ఏర్పాటు
1) సి,డి,బి,ఎ
2) సి,ఎ,బి,డి
3) ఎ,సి,బి,డి
4) ఎ,బి,డి,సి
- View Answer
- సమాధానం: 2
10. జతపరచండి.
జాబితా-I
a) మౌలిక విద్యా కమిటీ
b) దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ కమిటీ
c) భావ సమైక్యతా కమిటీ
d) ఛటోపాధ్యాయ కమిషన్
జాబితా-II
i) ప్రార్థనాంశాలు
ii) స్త్రీ విద్య
iii) ఉపాధ్యాయుని జీతభత్యాలు
iv) విద్యార్థుల స్వావలంబన
1) a-iii, b-i, c-ii, d-iv
2) a-iii, b-ii, c-iv, d-i
3) a-iv, b-ii, c-iii, d-i
4) a-iv, b-ii, c-i, d-iii
- View Answer
- సమాధానం: 4
11. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) త్రిభాషా సూత్రం - కొఠారి ప్రతిపాదన
బి) త్రిభాషా సూత్రం - NPE 1986 ప్రతిపాదన
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ,బి సరైనవి
4) ఎ,బి సరైనవి కావు
- View Answer
- సమాధానం: 3
12. కింది వాటిలో NPE 1986 ప్రతిపాదన కానిది ఏది?
ఎ) విద్య వర్తమానానికి భవిష్యత్తుకు పెట్టుబడిలా ఉండాలి
బి) రాష్ట్రానికొక విద్యాక్రమం ఉండాలి
సి) ఉద్యోగాలకు డిగ్రీలకు లింక్‌ను తొలగించాలి
డి) సమాన విద్యావకాశాలు కల్పించాలి
1) ఎ,బి
2) బి మాత్రమే
3) సి మాత్రమే
4) సి,డి
- View Answer
- సమాధానం: 2
13.కింది వాటిలో కొఠారి కమిషన్ లక్ష్యం?
ఎ) సామాజిక, నైతిక, ఆధ్యాత్మిక విలువల్ని పెంపొందిండం
బి) ఆధునికీకరణ
సి) జాతీయ, సామాజిక సమగ్రతను సాధించాలి
డి) ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచాలి
1) ఎ,బి,సి
2) ఎ,బి,డి
3) ఎ,సి,డి
4) ఎ,బి,సి,డి
- View Answer
- సమాధానం: 4
14. 1976లోగా ప్రాథమిక విద్యలో, 1986లోగా ఎగువ ప్రాథమిక విద్యలో వృథా, స్థబ్దత తగ్గించే కార్యక్రమాలను నిర్వహించాలి అని సూచించిన కమిషన్?
1) మొదలియార్ కమిషన్
2) రాధాకృష్ణన్ కమిషన్
3) కొఠారి కమిషన్
4) ఛటోపాధ్యాయ కమిషన్
- View Answer
- సమాధానం: 3
15. జతపరచండి.
జాబితా-I
a) 1948-49 b) 1952-53
c) 1964-66 d) 1992-93
జాబితా-II
i) కొఠారి కమిషన్
ii) యశ్పాల్ కమిటీ
iii) రాధాకృష్ణన్ కమిషన్
iv) మొదలియార్ కమిషన్
1) a-iii, b-iv, c-i, d-ii
2) a-iii, b-iv, c-ii, d-i
3) a-iii, b-i, c-iv, d-ii
4) a-iii, b-ii, c-i, d-iv
16. కొఠారి ప్రతిపాదనను అనుసరించి దిగువ ప్రాథమిక స్థాయి విద్యా ప్రణాళికలో ఏ అంశాలు ఉన్నాయి?
ఎ) ప్రాంతీయ భాష, గణితం
బి) పరిసరాల పరిజ్ఞానం, పని అనుభవం
సి) ఆధ్యాత్మిక విద్య, నైతిక విద్య
డి) సృజనాత్మక కృత్యాలు, ఆరోగ్య విద్య
1) ఎ,బి,సి
2) ఎ,సి,డి
3) బి,సి,డి
4) ఎ,బి,డి
- View Answer
- సమాధానం: 4
17. జతపరచండి.
జాబితా-I
a) యశ్పాల్ కమిటీ
b) కొఠారి కమిషన్
c) మొదలియార్ కమిషన్
d) ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ
జాబితా-II
i) బహుళ బిందు ప్రవేశం
ii) ఆనందకరమైన అభ్యసన వాతావరణం
iii) ఎన్సీసీ, స్కౌట్స్ ఏర్పాటు
iv) విద్య ప్రజల ఆశయాలకు, మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉండాలి
1) a-iv, b-iii, c-ii, d-i
2) a-iii, b-iv, c-i, d-ii
3) a-ii, b-iv, c-iii, d-i
4) a-ii, b-iv, c-i, d-iii
- View Answer
- సమాధానం: 3
18. మొదలియర్ కమిషన్ విద్యా లక్ష్యాలు?
ఎ) నిజమైన దేశభక్తి, మూర్తిమత్వ అభివృద్ధి
బి) ఆధునికీకరణ, ఆధ్యాత్మిక, నైతిక విలువలు పెంపొందించడం
సి) వృత్తి సామర్థ్యం పెంపు, నాయకత్వ అభివృద్ధి
1) ఎ,బి
2) బి,సి
3) ఎ,సి
4) ఎ,బి,సి
- View Answer
- సమాధానం: 3
19. జతపరచండి.
జాబితా-I
a) కొఠారి కమిషన్
b) యశ్పాల్ కమిటీ
c) ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ
d) POA 1992
జాబితా-II
i) సిలబస్, పాఠ్యపుస్తకాలపై సమీక్ష
ii) స్కూల్ బ్యాగ్ పుస్తకాల బరువుపై సమీక్ష
iii) NPE 1986కు కార్యాచరణ ప్రణాళిక
iv) కేజీ నుంచి పీజీ వరకు విద్యపై సమీక్ష
1) a-iv, b-ii, c-i, d-iii
2) a-iv, b-ii, c-iii, d-i
3) a-iv, b-iii, c-i, d-ii
4) a-iv, b-i, c-ii, d-iii
- View Answer
- సమాధానం: 1
20. కింది వాటిలో మొదలియార్ కమిషన్ సూచన కానిది ఏది?
1) 12వ తరగతి పూర్తి అయిన తర్వాత వృత్తి విద్యా కోర్సులైన మెడికల్, ఇంజినీరింగ్ కోర్సులకు అర్హులుగా నిర్ణయించడం
2) గురుకుల పాఠశాలలును స్థాపించాలి
3) పని అనుభవాన్ని ప్రవేశపెట్టాలి
4) మూల్యాంకనా విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలు ప్రవేశపెట్టాలి
- View Answer
- సమాధానం: 3
21. 10 మౌలిక అంశాల ఆధారంగా విద్యా ప్రణాళికను రూపొందించాలి అని ప్రతిపాదించింది?
1) కొఠారి కమిషన్
2) యశ్పాల్ కమిటీ
3) NPE 1986
4) POA 1992
- View Answer
- సమాధానం: 3
22. కింది వాటిలో యశ్పాల్ కమిటీ సూచన కానిది ఏది?
1) ప్రాథమిక స్థాయిలో ఇంటి పనిని పూర్తిగా ఇవ్వరాదు
2) బట్టీపట్టే విధానాలకు స్వస్తి పలకాలి
3) పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలి
4) ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1:40
- View Answer
- సమాధానం: 4
23. 1986 జాతీయ విద్యా విధానంను ‘భారత జాతికి రాజీవ్ గాంధీ రాసి ఇచ్చిన విద్యా వీలునామా’గా పేర్కొన్నది?
1) మన్మోహన్ సింగ్
2) పి.వి. నరసింహారావు
3) సోనియా గాంధీ
4) అబ్దుల్ కలాం
- View Answer
- సమాధానం: 2
24. NPE 1986 ప్రతిపాదనాంశం కానిది ఏది?
1) నిరంతర సమగ్ర మూల్యాంకనంను ప్రవేశపెట్టాలి
2) జీవితాంత విద్యలో భాగంగా సార్వత్రిక, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు అందుబాటులో ఉండాలి
3) 1990 నాటికి 10% మంది, 1995 నాటికి 25% మంది ఉన్నత మాధ్యమిక విద్యలో వృత్తి విద్యా కోర్సులు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి
4) జాతీయ ఆదాయంలో 3% విద్యకు కేటాయించాలి
- View Answer
- సమాధానం: 4
25. NPE 1986 ప్రతిపాదనకు సంబంధించిన అంశం ఏది?
ఎ) కనీస అభ్యసన స్థాయిలపై దృష్టిపెట్టాలి
బి) ఈఐఉఖీలను స్థాపించాలి
సి) నవోదయ పాఠశాలలను ఏర్పాటుచేయాలి
డి) శిశు సంక్షేమ, శిశు కేంద్రీకృత విధానాలకు పెద్దపీట వేయాలి
1) ఎ,బి
2) ఎ,బి,సి
3) ఎ,బి,డి
4) ఎ,బి,సి,డి
- View Answer
- సమాధానం: 4
26. కింది వాటిలో POA 1992లో అంశం కానిది ఏది?
1) పంచాయతీరాజ్ సంస్థల ద్వారా విద్యా నిర్వహణ వికేంద్రీకరించాలి
2) జిల్లా బోర్డులు, గ్రామ విద్యా కమిటీలు ఏర్పాటుచేసి వాటికి విద్యా కార్యక్రమాల రూపకల్పన అమలు బాధ్యతను అప్పజెప్పాలి
3) 2000 నాటికి సమీకృత శిశు వికాస సేవలు సార్వత్రికం చేయాలి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 4
27. విశ్వవిద్యాలయ బోధకులను 3 స్థాయిలుగా వర్గీకరించి వాటి ఆధారంగా జీతభత్యాలు, ప్రమోషన్ ఉండాలి అని ఏ కమిషన్ సూచించింది?
1) కొఠారి కమిషన్
2) మొదలియార్ కమిషన్
3) రాధాకృష్ణన్ కమిషన్
4) ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ
- View Answer
- సమాధానం: 3
28. కింది వాటిలో కొఠారి కమిషన్ సూచన కానిదేది?
1) జాతీయ, సామాజిక సమగ్రతను సాధించడానికి NSS కార్యక్రమాలు ప్రవేశపెట్టాలి
2) ఉమ్మడి పాఠశాల విధానం ప్రవేశపెట్టాలి
3) ప్రాథమిక స్థాయిలో మాతృభాషతో పాటు ఆంగ్ల భాషకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి
4) సామాజిక ఉపయోగ ఉత్పాదక పనిని ప్రవేశపెట్టాలి
- View Answer
- సమాధానం: 4
29. కింది వాటిలో ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ నివేదికలోని అంశం ఏది?
ఎ) ప్రాథమిక విద్యలో బోధనా సమయం 2బీ గం- 3గం
బి) 1, 2 తరగతులకు భాష, గణితానికి మాత్రమే పాఠ్యపుస్తకాలు ఉండాలి
సి) స్వీయ అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి పాఠశాలల్లో గ్రంథాలయాలు, ప్రయోగశాలలు ప్రవేశపెట్టాలి
1) ఎ మాత్రమే
2) ఎ,బి,సి
3) బి,సి మాత్రమే
4) ఎ,సి మాత్రమే
- View Answer
- సమాధానం: 2
30. కంప్యూటర్ అక్షరాస్యతా కార్యక్రమాలను చేపట్టాలి అని ప్రతిపాదించిన నివేదిక?
1) కొఠారి కమిషన్
2) NPE 1986
3) ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ
4) మొదలియార్ కమిషన్
- View Answer
- సమాధానం: 2