కేంద్రీయ విద్యా సలహా బోర్డ్‌ను ఎప్పుడు స్థాపించారు?
మాదిరి ప్రశ్నలు
1. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) విద్య అనేది భారతీయులను మేధావులుగా తీర్చిదిద్దేలా ఉండాలి - మెకాలే ప్రతిపాదన
బి) విద్య అనేది భారతీయులను గుమాస్తాలుగా తయారు చేసేదిగా ఉండాలి - వుడ్స్ ప్రతిపాదన.
1) ఎ, బి రెండూ సరైనవే
2) ఎ సరైంది, బి సరికాదు
3) ఎ సరికాదు, బి సరైంది
4) ఎ, బి రెండూ సరికావు
- View Answer
- సమాధానం: 4
2. జతపరచండి.
జాబితా - I
i) అబ్జర్వేషన్స్
ii) స్కూల్ అండ్ స్కూల్ బుక్ సొసైటీ
iii) పుణె సంస్కృత కళాశాల
iv) సెయింట్ ఆన్స్ పాఠశాల
జాబితా - II
a) కెప్టెన్ కెండీ
b) ఫ్రాన్సిస్ జేవియర్
c) ఎల్ఫిన్స్టన్
d) చార్లెస్ గ్రాంట్
1) i-b, ii-c, iii-d, iv-a
2) i-d, ii-c, iii-b, iv-a
3) i-d, ii-c, iii-a, iv-b
4) i-d, ii-a, iii-c, iv-b
- View Answer
- సమాధానం: 3
3. కింది వాటిలో సరికానిది ఏది?
1) మనదేశంలో ఆంగ్ల విద్య ప్రవేశ పెట్టడానికి కారణం - మెకాలే మినట్స్
2) యుద్ధానంతర విద్యా పథకం - శాడ్లర్ కమిషన్
3) భారతీయ విద్యకు మాగ్నాకార్టా - వుడ్స్ నివేదిక
4) తొలి భారతీయ కమిషన్ - హంటర్ కమిషన్
- View Answer
- సమాధానం: 2
4. కింది వాటిలో వుడ్స్ నివేదికలోని అంశం కానిది ఏది?
1) ప్రతి రాష్ట్రానికి ప్రజా విద్యా నిర్దేశక శాఖ ఏర్పాటు చేయాలి
2) కలకత్తా, బొంబాయి, మద్రాస్ నగరాల్లో విశ్వవిద్యాలయాలు స్థాపించాలి
3) అథోముఖ వడపోత సిద్ధాంతం ద్వారా ఆంగ్ల విద్యను అందించాలి
4) గ్రాంట్ - ఇన్- ఎయిడ్ విధానాన్ని రూపొందించాలి
- View Answer
- సమాధానం: 3
5. జతపరచండి.
జాబితా - I
i) హలక్ బంధీ పాఠశాలలు
ii) గాంధీజీ ప్రాతిపదిక విద్య
iii) తొలి ఉపాధ్యాయ కళాశాల
జాబితా - II
a) వార్థా
b) ఆగ్రా
c) ట్వింక్వీ బార్
1) i-a, ii-b, iii-c
2) i-b, ii-a, iii-c
3) i-b, ii-c, iii-a
4) i-c, ii-b, iii-a
- View Answer
- సమాధానం: 2
6. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ప్రాథమిక విద్యావ్యాప్తిని స్థానిక సంస్థలకు అప్పగించాలి - హంటర్ కమిషన్ సూచన
బి) ప్రజ్ఞ, నైతికత అభివృద్ధి చెందేదిగా విద్య ఉండాలి - వుడ్స్ ప్రతిపాదన
సి) భారతీయ భాషల మాధ్యమంలోనే విద్యను అందించాలి - మెకాలే మినట్స్‌లో అంశం
1) ఎ, బి మాత్రమే
2) ఎ, బి, సి మూడూ సరైనవే
3) ఎ, బి, సి మూడూ సరికావు
4) ఎ, సి మాత్రమే
- View Answer
- సమాధానం: 1
7. జతపరచండి.
జాబితా - I
i) వుడ్స్ నివేదిక
ii) మెకాలే మినట్స్
iii) హంటర్ కమిషన్
iv) తొలి విశ్వవిద్యాలయ కమిషన్
జాబితా - II
a) 1902
b) 1854
c) 1835
d) 1882
1) i-b, ii-c, iii-a, iv-d
2) i-b, ii-c, iii-d, iv-a
3) i-b, ii-a, iii-c, iv-d
4) i-b, ii-d, iii-c, iv-a
- View Answer
- సమాధానం: 2
8. నియామక సంవత్సరాలకు అనుగుణంగా కింది వాటిని అవరోహణ క్రమంలో అమర్చండి.
ఎ) శాడ్లర్ కమిషన్
బి) సార్జంట్ కమిటీ
సి) ఎబాట్వుడ్ కమిటీ
డి) హర్టాగ్ కమిటీ
1) బి, డి, సి, ఎ
2) బి, డి, ఎ, సి
3) డి, బి, సి, ఎ
4) బి, సి, డి, ఎ
- View Answer
- సమాధానం: 4
9. కింది వాటిలో మెకాలే మినట్స్తో ఏకీభవించని భావన ఏది?
1) భారతీయులు రక్తంలో, వర్ణంలో భారతీయులై, ఆలోచనలు, అభిరుచులు, అభిప్రాయాల్లో బ్రిటిషర్లుగా ఉండే విద్యను వారికి అందించాలి
2) ఇండియా, అరేబియా, ఆసియా దేశాల సాహిత్యం మొత్తం ఇంగ్లిష్ గ్రంథాలయంలో ఒక సొరుగు పుస్తకాలతో కూడా సరితూగదు
3) చౌక వేతనంతో గుమస్తాలను తయారు చేసేదిగా విద్య ఉండాలి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 4
10.జతపరచండి.
జాబితా - I
i) మెకాలే మినట్స్
ii) వుడ్స్ నివేదిక
iii) హంటర్ కమిషన్
iv) తొలి విశ్వవిద్యాలయ కమిషన్
జాబితా - II
a) డల్హౌసి
b) లార్డ్ రిప్పన్
c) లార్డ్ కర్జన్
d) విలియం బెంటింక్
1) i-d, ii-a, iii-b, iv-c
2) i-d, ii-a, iii-c, iv-b
3) i-d, ii-b, iii-a, iv-c
4) i-d, ii-c, iii-b, iv-a
- View Answer
- సమాధానం: 1
11. కింది అంశాలకు సంబంధించిన సంవత్సరాలకు అనుగుణంగా ఆరోహణ క్రమంలో అమర్చండి.
ఎ) బేసిక్ విద్యావిధానం
బి) తొలి విశ్వవిద్యాలయ కమిషన్
సి) ప్రాథమిక విద్యకు గోఖలే తీర్మానం
డి) స్వదేశీ విద్యా ఉద్యమం ప్రారంభం
1) ఎ, బి, సి, డి
2) డి, సి, బి, ఎ
3) సి, డి, బి, ఎ
4) బి, డి, సి, ఎ
- View Answer
- సమాధానం: 4
12. కేంద్రీయ విద్యా సలహా బోర్డ్‌ను ఎప్పుడు స్థాపించారు?
1) 1921
2) 1917
3) 1927
4) 1937
- View Answer
- సమాధానం: 1
13. జతపరచండి.
జాబితా - I
i) శాడ్లర్ కమిషన్
ii) సార్జెంట్ కమిటీ
iii) హర్టాగ్ కమిటీ
iv) ఎబాట్వుడ్ కమిటీ
జాబితా - II
a) 1929
b) 1937
c) 1917
d) 1944
1) i-c, ii-d, iii-b, iv-a
2) i-c, ii-d, iii-a, iv-b
3) i-c, ii-b, iii-d, iv-a
4) i-c, ii-a, iii-d, iv-b
- View Answer
- సమాధానం: 2
14. జాకిర్ హుస్సేన్ కమిటీ దేనికి సంబంధించింది?
1) వృథా, స్తబ్దతల నివారణ
2) ప్రాతిపదిక విద్య
3) బాలికా విద్య
4) వయోజన విద్య
- View Answer
- సమాధానం: 2
15.కింది వాటిలో సరైన జత ఏది?
i) భారతీయ విద్యా విధానానికి వుడ్స్ నివేదికను ‘మాగ్నాకార్టా’గా అభిప్రాయ పడిన విద్యావేత్త - హెచ్.ఆర్. జేమ్స్
ii) 6-10 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని పేర్కొన్న వారు - గోఖలే
iii) భారతదేశ ఆధునిక విద్యా పితామహుడు - చార్లెస్ గ్రాంట్
iv) ఆంగ్ల విద్య మాత్రమే నవీన విజ్ఞానానికి తాళంచెవి లాంటిది అని భావించిన వారు - మెకాలే
1) ఎ, బి మాత్రమే
2) బి, సి మాత్రమే
3) ఎ, బి, సి, డి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
16.కింది వాటిలో సరైన అంశం ఏది?
ఎ) కలకత్తా విశ్వవిద్యాలయ సమస్యల పరిష్కారానికి నియమించింది - హర్టాగ్ కమిటీ
బి) స్వయం పోషకంగా పాఠశాలల అభివృద్ధి చెందాలన్నదే ప్రాతిపదిక విద్య ప్రధాన ఉద్దేశం
సి) వృథా, స్తబ్దతల నివారణకు నియమించింది - శాడ్లర్ కమిషన్
డి) వయోజన విద్యా వ్యాప్తికి బ్రిటిషర్లు నియమించింది - ఎబాట్వుడ్ కమిటీ
1) ఎ, బి మాత్రమే
2) ఎ, బి, సి మాత్రమే
3) సి మాత్రమే
4) బి మాత్రమే
- View Answer
- సమాధానం: 4
17. జతపరచండి.
జాబితా - I
i) బేసిక్ విద్యావిధానం
ii) గోఖలే విద్యాతీర్మానం
iii) విశ్వవిద్యాలయాల చట్టం
iv) జాతీయ విద్యావిధానం
జాబితా - II
a) 1913
b) 1904
c) 1911
d) 1937
1) i-d, ii-c, iii-b, iv-a
2) i-d, ii-c, iii-a, iv-b
3) i-d, ii-b, iii-c, iv-a
4) i-d, ii-a, iii-b, iv-c
- View Answer
- సమాధానం: 1
18. ‘6-14 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. దానిని 40 ఏళ్లలో అంటే 1984లోగా సాధించాలి’ అని సూచించింది?
1) హర్టాగ్ కమిటీ
2) శాడ్లర్ కమిషన్
3) సార్జెంట్ ప్లాన్
4) ఎబాట్వుడ్ కమిటీ
- View Answer
- సమాధానం: 3
19. జతపరచండి.
జాబితా - I
i) సార్జెంట్ కమిటీ
ii) ఎబాట్వుడ్ కమిటీ
iii) హర్టాగ్ కమిటీ
iv) శాడ్లర్ కమిషన్
జాబితా - II
a) ఉప కమిటీ
b) వృత్తి విద్యా కమిటీ
c) యుద్ధానంతర విద్యా పథకం
d) విశ్వవిద్యాలయాల సంస్కరణలను సూచించింది
1) i-c, ii-b, iii-d, iv-a
2) i-c, ii-d, iii-b, iv-a
3) i-c, ii-a, iii-d, iv-b
4) i-c, ii-b, iii-a, iv-d
- View Answer
- సమాధానం: 4
20. ‘ప్రాక్-పశ్చిమ వివాదం’ అంటే?
1) పాశ్చాత్య విజ్ఞానానికి, భారతీయ విజ్ఞానానికి మధ్య వివాదం
2) భారతీయ భాషలకు, ఇంగ్లిష్‌కు మధ్య వివాదం
3) భారతీయ సంప్రదాయాలకు, యురోపియన్ సంప్రదాయానికి మధ్య వివాదం
4) యురోపియన్ సంస్కృతికి, భారతీయ సంస్కృతికి మధ్య వివాదం
- View Answer
- సమాధానం: 1
21. వివిధ అంశాలు, వాటి సంవత్సరాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) రాష్ట్ర విద్యా నిర్దేశక శాఖలు ఏర్పాటు - 1871
బి) విశ్వవిద్యాలయాల్లో స్త్రీలకు ప్రవేశం - 1877
సి) మద్రాస్, కలకత్తా, బొంబాయి విశ్వవిద్యాలయాల స్థాపన - 1857
1) ఎ, బి మాత్రమే
2) బి, సి మాత్రమే
3) ఎ, బి, సి
4) ఎ, సి మాత్రమే
- View Answer
- సమాధానం: 3
22. కింది వాటిలో సార్జెంట్ కమిటీ సూచన కానిది ఏది?
1) ఎంప్లాయిమెంట్ బ్యూరోను స్థాపించాలి
2) విశ్వవిద్యాలయాల విరాళాల కమిటీని ఏర్పాటు చేయాలి
3) 6-14 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి
4) ఇంటర్మీడియట్‌ను రెండు సంవత్సరాలుగా నిర్వహించాలి
- View Answer
- సమాధానం: 4
23. కింది వాటిలో సరైన జత ఏది?
ఎ) రాజా రామ్మోహన్రాయ్ హిందూ కాలేజ్‌ని స్థాపించారు - 1817
బి) భారతీయుల విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ఈస్టిండియా కంపెనీ ఏటా రూ. ఒక లక్ష కేటాయించాలని తీర్మానం - 1813
సి) లార్డ్ హోర్డింగ్.. ఉద్యోగావకాశాలను కేవలం ఆంగ్ల భాషను అభ్యసించిన భారతీయులకు మాత్రమే ఇవ్వాలని ఆదేశించాడు - 1844
1) ఎ, బి మాత్రమే
2) బి, సి మాత్రమే
3) ఎ, బి, సి
4) ఎ, సి మాత్రమే
- View Answer
- సమాధానం: 3
24. కింది వారిలో విద్యాసంస్థల్లో తటస్థ మత విధానాన్ని సమర్థించిన వారు?
ఎ) మెకాలే
బి) చార్లెస్ వుడ్స్,
సి) హంటర్
1) బి మాత్రమే
2) బి, సి మాత్రమే
3) ఎ మాత్రమే
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 4
25. కింది వాటిలో హంటర్ కమిషన్ సూచన ఏది?
1) నిత్యజీవితానికి పనికి వచ్చే భౌతికశాస్త్రం, వ్యవసాయం, క్షేత్ర గణితం లాంటి అంశాలను ప్రాథమిక విద్యాప్రణాళికలో చేర్చాలి
2) విద్యాలయాల్లో ప్రవేశానికి అన్ని వర్గాల నుంచి ఫీజు వసూలు చేయాలి
3) ప్రాథమిక పాఠశాలల స్థాపన బాధ్యతను ప్రజలే చేపట్టాలి
4) ప్రాథమిక విద్యావ్యాప్తిని విశ్వవిద్యాలయాలు చేపట్టాలి
- View Answer
- సమాధానం: 1
26.‘నిరక్షరాస్యులు, అమాయకులు ఉన్న జాతి సంపూర్ణమైన అభివృద్ధి సాధించ లేదు, పోటీపడలేదు’ అని వ్యాఖ్యానించిన వారు?
1) హెచ్.ఆర్. జేమ్స్
2) గోఖలే
3) హాలెండ్
4) సార్జెంట్
- View Answer
- సమాధానం: 2
27. 10 + 2 + 3 విద్యా నమూనాను మొదటిసారిగా సూచించింది?
1) హర్టాగ్ కమిటీ
2) సార్జెంట్ కమిటీ
3) ఎబాట్వుడ్ కమిటీ
4) శాడ్లర్ కమిషన్
- View Answer
- సమాధానం: 4
28. కేంద్రీయ విద్యా సలహా బోర్డ్ పునరుద్ధరణను సూచించిన కమిటీ ఏది?
1) హర్టాగ్ కమిటీ
2) సార్జెంట్ కమిటీ
3) ఎబాట్వుడ్ కమిటీ
4) జాకీర్ హుస్సేన్ కమిటీ
- View Answer
- సమాధానం: 1
29. నిర్బంధ ప్రాథమిక విద్య సిద్ధాంతాన్ని ఆమోదించిన తొలి చట్టం ఏది?
1) పటేల్ చట్టం - 1918
2) భారత ప్రభుత్వ చట్టం - 1919
3) భారత ప్రభుత్వ చట్టం - 1921
4) భారత ప్రభుత్వ చట్టం - 1935
- View Answer
- సమాధానం: 1
30. స్వదేశీ విద్యా ఉద్యమ కాలంలో మన దేశంలో ఏ విద్యా విధానాన్ని అమలు చేయాలనే అభిప్రాయం వ్యక్తమైంది?
1) చైనీస్ విద్యావిధానం
2) అమెరికన్ విద్యావిధానం
3) జర్మన్ విద్యావిధానం
4) జపనీస్ విద్యావిధానం
- View Answer
- సమాధానం: 4