‘ఆచార్య దేవోభవ’ అని కీర్తించిన విద్యా విధానం?
భారతదేశ విద్యా చరిత్ర
1. వీటిలో సరికాని జత?
1) ఉడ్స్ డిస్పాచ్ - 1854
2) సార్జంట్ కమిషన్ - 1944
3) మెకాలే మినిట్స్ - 1834
4) హర్టాగ్ కమిటీ - 1934
- View Answer
- సమాధానం: 4
2. ఎవరి సలహా మేరకు అన్ని రాష్ట్రాల్లో డెరైక్టర్స్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ను నియ మించారు?
1) మెకాలే మినిట్స్
2) ఉడ్స్ డిస్పాచ్
3) హంటర్ కమిషన్
4) సార్జంట్ రిపోర్ట్
- View Answer
- సమాధానం: 2
3. భారత్‌లో తొలి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను ఎవరు స్థాపించారు?
1) మెకాలే
2) ఫ్రాన్సిస్ జేవియర్
3) జీజెన్ బాల్గ్
4) హంటర్
- View Answer
- సమాధానం: 3
4. భారత్‌లో స్త్రీలకు ప్రవేశం కల్పించిన తొలి విశ్వవిద్యాలయం?
1) కలకత్తా
2) మద్రాస్
3) బొంబాయి
4) బరోడా
- View Answer
- సమాధానం: 1
5. ప్రాథమిక విద్యా బాధ్యత స్థానిక సంస్థలు చేపట్టాలని సూచించింది?
1) ఉడ్స్ డిస్పాచ్
2) మెకాలే మినిట్స్
3) హంటర్ కమిషన్
4) హోర్టాగ్ కమిటీ
- View Answer
- సమాధానం: 3
6. యుద్ధానంతర పథకం అని దేన్ని అంటారు?
1) హర్టాగ్ కమిటీ
2) ఎబట్ ఉడో పథకం
3) సాడ్లర్ పథకం
4) సార్జంట్ రిపోర్ట్
- View Answer
- సమాధానం: 4
7. చర్చా పద్ధతి ఎవరి కాలంలో ఉపయోగించే వారు?
1) చార్వాకులు
2) జైనులు
3) బౌద్ధులు
4) ముస్లింలు
- View Answer
- సమాధానం: 3
8. కలకత్తా, మద్రాసు, బొంబాయి విశ్వవిద్యా లయాలు ఏర్పడడానికి కారణమైన కమిషన్?
1) మెకాలే మినిట్స్
2) సార్టంట్ రిపోర్ట్
3) ఉడ్స్ డిస్పాచ్
4) హంటర్ కమిషన్
- View Answer
- సమాధానం: 3
9. నేటి నర్సరీ విధానాన్ని సూచించిన తొలి కమిషన్?
1) మెకాలె మినిట్స్
2) ఉడ్స్ డిస్పాచ్
3) హంటర్ కమిషన్
4) సార్జంట్ రిపోర్ట్
- View Answer
- సమాధానం: 4
10. ‘ఆరామాలు’ ఎవరి విద్యా విధానంలోని పాఠశాలలు?
1) వేద
2) బౌద్ధుల
3) ముస్లిం
4) చార్వాకులు
- View Answer
- సమాధానం: 2
11. బొంబాయిలోని బాంధాలో భారత దేశం లోని తొలి ఆధునిక కళాశాల స్థాపిం చింది?
1) జీజెన్ బాల్గ్
2) ఫ్రాన్సిస్ జేవియర్
3) మెకాలే
4) హంటర్
- View Answer
- సమాధానం: 2
12. ఇంగ్లండ్‌లోని విద్యా విధానం భారత్ చేరడానికి 40 ఏళ్లు పడుతుందని పేర్కొన్న వారు?
1) మెకాలే మినిట్స్
2) సార్జంట్ కమిషన్
3) ఉడ్స్ డిస్పాచ్
4) హంటర్ కమిషన్
- View Answer
- సమాధానం: 2
13. ఆత్మ పరమాత్మతో విలీనం కావాలనే ఆశ యంతో విద్యనందించిన విద్యా విధానం?
1) చార్వాక
2) వేద
3) బౌద్ధ
4) జైన
- View Answer
- సమాధానం: 2
14. పాఠశాల విద్యార్థుల స్కూల్ బ్యాగ్‌పై వేసిన కమిటీ?
1) కొఠారి
2) మాల్కం ఆదిశేషయ్య
3) ఈశ్వరీ భాయి పటేల్
4) యశ్పాల్
- View Answer
- సమాధానం: 4
15.మొదలియార్ కమిషన్ ప్రకారం పరీక్ష విధా నంలో దేన్ని తగ్గించడానికి లక్ష్యాత్మక ప్రశ్న లు ప్రవేశపెట్టాలి?
1) వ్యక్తి నిష్టత
2) వస్తు నిష్టత
3) ఆత్మాశ్రయత
4) వస్త్వాశ్రయత
- View Answer
- సమాధానం: 1
16. ఏ విద్యపై సూచనలకు మొదలియార్ కమిషన్ నియమించారు?
1) సెకండరీ
2) సాంకేతిక
3) విశ్వవిద్యాలయ
4) ప్రాథమిక
- View Answer
- సమాధానం: 1
17. నేటి ఆంగ్ల విద్య ప్రాధాన్యతకు దారి తీసిన నాటి కమిషన్ సూచనలు?
1) హంటర్
2) హార్టాగ్
3) మెకాలే మినిట్స్
4) ఉడ్స్ డిస్పాచ్
- View Answer
- సమాధానం: 3
18. స్వాతంత్య్రానికి ముందు ఏ కమిషన్‌ను ‘భారతీయ విద్యా కమిషన్’ అని పిలిచే వారు?
1) కొఠారి
2) రాధా కృష్ణన్
3) హంటర్
4) సార్జంట్
- View Answer
- సమాధానం: 4
19. వృథా (wastage), స్తబ్దత (Stagna-tion)లు ప్రాథమిక విద్యా వ్యాప్తికి అడ్డం కులుగా ఉన్న జంట సమస్యలని పేర్కొన్న వారు?
1) మెకాలే మినిట్స్
2) హంటర్ కమిషన్
3) హార్టాగ్ కమిటీ
4) ఉడ్స్ డిస్పాచ్
- View Answer
- సమాధానం: 3
20.సహాయ విరాళ విధానం (Grant in Aid)ను భారతదేశంలో రూపొందించాలి అని పేర్కొన్న కమిషన్?
1) ఉడ్స్ డిస్పాచ్
2) హంటర్ కమిషన్
3) మెకాలే మినిట్స్
4) సార్జంట్ కమిషన్
- View Answer
- సమాధానం: 1
21. 8 నైతిక చర్యలకు ప్రాధాన్యమిచ్చిన విద్యా విధానం?
1) వేద
2) బౌద్ధుల
3) జైనుల
4) చార్వాకుల
- View Answer
- సమాధానం: 2
22. మాధ్యమిక స్థాయిలో ఒక పబ్లిక్ పరీక్ష ఉండాలని సూచించిన కమిషన్?
1) మొదలియార్
2) కొఠారి
3) ఈశ్వరీ భాయ్ పటేల్
4) నూతన జాతీయ విద్యా విధానం
- View Answer
- సమాధానం: 1
23. ‘భారతదేశ భవిష్యత్ తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుందని’ పేర్కొన్నది?
1) రాధాకృష్ణన్ కమిషన్
2) కొఠారి కమిషన్
3) ఈశ్వరీ భాయ్ పటేల్ కమిటీ
4) నూతన జాతీయ విద్యా విధానం
- View Answer
- సమాధానం: 2
24.దేని గురించి ‘రాజీవ్ గాంధీ వీలునామా’ గా పి.వి. నరసింహారావు పేర్కొన్నారు?
1) రాధాకృష్ణన్ కమిషన్
2) కొఠారి కమిషన్
3) ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ
4) నూతన జాతీయ విద్యా విధానం
- View Answer
- సమాధానం: 4
25. విశ్వ విద్యాలయ స్థాయిలో లెక్చరర్, రీడర్, ప్రొఫెసర్ అనే మూడు స్థాయిలుండాలని సూచించిన కమిషన్?
1) కొఠారి
2) ఈశ్వరీ భాయ్ పటేల్
3) రాధాకృష్ణన్
4) 1986 జాతీయ విద్యా విధానం
- View Answer
- సమాధానం: 3
26. ‘ఆచార్య దేవోభవ’ అని కీర్తించిన విద్యా విధానం?
1) వేద
2) బౌద్ధ
3) చార్వాకులు
4) ముస్లిం
- View Answer
- సమాధానం: 1
27.రక్తం, వర్ణంల్లో భారతీయులై; అభిరుచులు, అభిప్రాయాలు, మేధలో ఆంగ్లే యుల్లాఉండే కొత్త వర్గాన్ని భారతదేశం తయారుచేయాలని పేర్కొన్నవారు?
1) మెకాలే
2) ఉడ్
3) హంటర్
4) సార్జంట్
- View Answer
- సమాధానం: 1
28.విద్యను ఉత్పాదకతతో ముడి పెట్టాలన్న కమిషన్ ?
1) రాధాకృష్ణన్
2) కొఠారి
3) ఈశ్వరీభాయ్ పటేల్
4) నూతన జాతీయ విద్యా విధానం
- View Answer
- సమాధానం: 2
29. భారతీయ విద్యా విధానానికి ‘మాగ్నా కార్టా’ వంటిది?
1) మెకాలే మినిట్స్
2) ఉడ్స్ డిస్పాచ్
3) హార్టాగ్ కమిటీ
4) హంటర్ కమిషన్
- View Answer
- సమాధానం: 2
30. త్రిభాష సూత్రం పేర్కొన్న కమిషన్?
1) రాధాకృష్ణన్
2) కొఠారి
3) ఈశ్వరీభాయ్ పటేల్
4) నూతన జాతీయ విద్యా విధానం
- View Answer
- సమాధానం: 2
31. సెకండరీ విద్యాకమిషన్ ప్రకారం విద్యా స్వరూపం?
1) 3 + 5 + 3 + 4
2) 5 + 4 + 3 + 3
3) 5+ 3 + 4 + 3
4) 4 + 5 + 3 + 3
- View Answer
- సమాధానం: 3
32.పరిశోధన చేసే వారికి ఆర్థిక సహాయాన్ని అందించాలని పేర్కొన్న కమిషన్?
1) యశ్పాల్
2) రాధాకృష్ణన్
3) ఈశ్వరీ భాయ్ పటేల్
4) కొఠారి
- View Answer
- సమాధానం: 2
33. ‘మంచి ఇంగ్లిష్ గ్రంథాలయంలోని ఒక్క సొరుగులోని పుస్తకాల్లో ఇండియా, అరే బియా దేశాల సాహిత్యం మొత్తం కలిపినా కూడా సరి తూగదు’ అని పేర్కొంది?
1) మెకాలే మినిట్స్
2)ఉడ్స్ డిస్పాచ్
3) హంటర్ కమిషన్
4) సార్టంట్ రిపోర్ట్
- View Answer
- సమాధానం: 1