Skip to main content

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌: బస్‌పాస్‌లో 20 శాతం రాయితీ..

సాక్షి, హైదరాబాద్‌: పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగులకు బస్‌ పాస్‌ల్లో ఆర్టీసీ రాయితీ ప్రకటించింది.
tsrtc bus pass
tsrtc bus pass

సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో మూడు నెలల పాస్‌లపై 20 శాతం చొప్పున  రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ  గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ యాదగిరి ఏప్రిల్ 31వ తేదీన (శనివారం) ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం మూడు నెలల (క్వార్టర్లీ) ఆర్డినరీ బస్‌పాస్‌ రూ.3,450 ఉండగా.. 20 శాతం రాయితీ  రూ.2800కు పాస్‌లు ఇస్తారు. మెట్రో మూడు నెలల పాస్‌ (క్వార్టర్లీ) ప్రస్తుతం  రూ.3900. 20 శాతం డిస్కౌంట్‌ అనంతరం రూ.3120. రౌండెడ్‌ ఆఫ్‌తో రూ.3200కు పాస్‌లను పొందవచ్చు. పాస్‌ల కోసం తీసుకొనే గుర్తింపు కార్డుకు రూ.30 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

Published date : 01 May 2022 07:54PM

Photo Stories