Skip to main content

TS High Court Jobs 2023 : హైకోర్టులో 176 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేషన్‌ : తెలంగాణ హైకోర్టులో 176 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను జనవరి 11వ తేదీన(బుధవారం) హైకోర్టు విడుదల చేసింది.
ts high court jobs 2023
TS High Court Jobs

పోస్టుల వివరాలు ఇవే..
సబార్డినేట్‌–50, సిస్టమ్‌ అసిస్టెంట్‌–45, ఎగ్జామినర్‌–17, అసిస్టెంట్‌–10, స్టెనో–2, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌–2, కంప్యూటర్‌ ఆపరేటర్‌–20, ట్రాన్స్‌లేటర్‌–10, కోర్టు మాస్టర్‌/ హైకోర్టు జడ్జిల వ్యక్తిగత కార్యదర్శులు–20 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

Telangana Court Jobs : 1904 కోర్టు ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తులు ప్రారంభం.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే.. పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి

దరఖాస్తు  వివరాలు ఇలా..:
జనవరి 21 నుంచి ఆన్‌లైన్‌లో వీటికి దరఖాస్తులు స్వీకరించనున్నారు. కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు, విద్యార్హత, వయసు, రిజర్వేషన్, భర్తీ విధానం, పరీక్ష ఫీజు తదితర వివరాల కోసం హైకోర్టు వెబ్‌సైట్‌లో చూడొవచ్చని రిజి్రస్టార్‌ (రిక్రూట్‌మెంట్‌) తెలిపారు. పరీక్ష తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.  

షెడ్యూల్‌ ఇదే.. 
నోటిఫికేషన్‌ విడుదల : జనవరి 11, 2023 
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : జనవరి 21, 2023
దరఖాస్తుల స్వీకరణ ముగింపు : ఫిబ్రవరి 11, 2023
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ షురూ : ఫిబ్రవరి 20, 2023

Published date : 12 Jan 2023 07:48PM

Photo Stories