Skip to main content

Telangana Court Jobs : 1904 కోర్టు ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తులు ప్రారంభం.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే.. పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటైన వాటితో కలిపి పలు కోర్టుల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్‌ల‌ను విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.

ఆఫీస్ సబార్డినేట్-1226 ప్రాసెస్ సర్వర్–163, రికార్డు అసిస్టెంట్ –97, జూనియర్ అసిస్టెంట్–277, ఫీల్డ్ అసిస్టెంట్–77, ఎక్జామినర్–66 విభాగాల్లో ఈ ఉద్యోగాల‌ను భర్తీ చేయనున్నారు. మొత్తం 1,904 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశారు. ఈ ఉద్యోగాల‌ను రాతపరీక్ష ద్వారా ఎంపికలు చేపట్టనున్నారు. అలాగే ఆయా ఉద్యోగాలకు కంప్యూటర్ ఆధారిత పరీక్షను మార్చిలో నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలను ఈ పోస్టులకు జనవరి 11వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా.. జనవరి 31వ తేదీతో ముగియనుంది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి హాల్‌టికెట్లను వైబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని హైకోర్టు రిజిస్ట్రార్‌ తెలిపారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ http://tshc.gov.inలో చూడొచ్చు.

పోస్టుల వివ‌రాలు ఇవే..

ts high court jobs notification 2023 details in telugu

ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు : 1226 
తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ & సబార్డినేట్ సర్వీసులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 1,226 పోస్టులను భర్తీ చేయనున్నారు. 
అర్హ‌త‌లు ఇవే : ఏడో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఏదైనా పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్హత కలిగిన అభ్యర్థులు అనర్హులు. 
ద‌ర‌ఖాస్తు విధానం : సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

జూనియర్ అసిస్టెంట్ పోస్టులు : 275 
తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ & సబార్డినేట్ సర్వీసులో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా వివిధ జిల్లా కోర్టుల్లో మొత్తం 275 పోస్టులను భర్తీ చేయనున్నారు. 
అర్హ‌త‌లు : డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
ఎంపిక విధానం : రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపిక చేస్తారు.


ప్రాసెస్ సర్వర్ పోస్టులు : 163 
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ & సబార్డినేట్ సర్వీసులో ప్రాసెస్ సర్వర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ జిల్లా కోర్టుల్లో మొత్తం 163 పోస్టులను భర్తీ చేయనున్నారు. 
అర్హ‌త‌లు : పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. స్థానిక భాషపై పట్టు ఉండాలి. 
ఎంపిక విధానం : రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.

రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు : 97 
తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ & సబార్డినేట్ సర్వీసులో రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ జిల్లా కోర్టుల్లో మొత్తం 97 పోస్టులను భర్తీ చేయనున్నారు. 
అర్హ‌త‌లు : ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
ఎంపిక విధానం : రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేస్తారు.


ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు : 77
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ & సబార్డినేట్ సర్వీసులో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా వివిధ జిల్లా కోర్టుల్లో మొత్తం 77 పోస్టులను భర్తీ చేయనున్నారు. 
అర్హ‌తలు : డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
ఎంపిక విధానం : రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపిక చేస్తారు.


ఎగ్జామినర్ పోస్టులు : 66 
తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ & సబార్డినేట్ సర్వీసులో ఎగ్జామినర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా వివిధ జిల్లా కోర్టుల్లో మొత్తం 66 పోస్టులను భర్తీ చేయనున్నారు. 
అర్హ‌త‌లు : ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
ఎంపిక విధానం : రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు ఫీజు : 
పై ఉద్యోగాల‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఒక్కో నోటిఫికేషన్‌కు జనరల్, బీసీ అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, ఈబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి.

పై ఉద్యోగాల‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇవే..

దరఖాస్తులు ప్రారంభ తేదీ : జనవరి 11, 2023

దరఖాస్తులకు చివరి తేదీ : జనవరి 31, 2023

అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్‌ తేదీ : ఫిబ్రవరి 15, 2023

పరీక్ష తేదీ : మార్చి 2023

Published date : 11 Jan 2023 07:18PM

Photo Stories