Andhra Pradesh Jobs 2023 : హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. మొత్తం ఎన్ని పోస్టులంటే..?
https://dmeaponline.com వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్‌ను అందుబాటులో ఉంచారు. జనవరి 11వ తేదీ (బుధవారం) నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలు పెట్టారు. అర్హులైన వైద్యులు జనవరి 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.వెయ్యి, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.750 చొప్పున దరఖాస్తు రుసుం ఉంటుంది.
AP Govt Jobs: సీఎస్‌పీజీ, ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
అర్హతలు ఇవే..
రెండేళ్ల కాలపరిమితితో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీ చేపడతారు. ఎంబీబీఎస్/బీడీఎస్ పూర్తి చేసి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్ డిగ్రీ/హాస్పిటల్ మేనేజ్‌మెంట్/ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్‌మెంట్/ఎంబీఏ హ్యూమన్ రీసోర్స్ కోర్సులు చేసి, ఇతర అర్హతలున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నాటికి గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయోపరిమితి నుంచి మినహాయింపు ఉంటుంది. http://hmfw.ap.gov.in వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ను ఉంచారు.
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్