Skip to main content

Andhra Pradesh Jobs 2023 : కొత్తగా ఐదు వైద్య కళాశాలలు.. 1,412 పోస్టులు.. అలాగే వివిధ పోస్టుల భర్తీకి..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఏపీ కేబినెట్ మీటింగ్ జూలై 12వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జ‌రిగింది.
AP CM YS Jagan Mohan Reddy Telugu News
AP CM YS Jagan Mohan Reddy

ఈ కేబినెట్ మీటింగ్‌ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. అలాగే ఈ కేబినెట్ మీటింగ్‌లో వివిధ ర‌కాలు ఉద్యోగాల భ‌ర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.

కొత్తగా ఐదు వైద్య కళాశాలలు.. 1,412 పోస్టులు..
2024–25 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో కొత్తగా ఐదు వైద్య కళాశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. పులివెందుల, పాడేరు, ఆదోని మెడికల్‌ కాలేజీలకు గత మంత్రివర్గ సమావేశంలో పోస్టులు మంజూరు చేశారు. మిగిలిన రెండు చోట్ల.. మదనపల్లి, మార్కాపురం వైద్య కళాశాలలు ప్రారంభించడానికి వీలుగా కళాశాలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున 1,412 పోస్టుల సృష్టికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో ఇప్పటికే 5 వైద్య కళాశాలలను ఈ విద్యా సంవత్సరం(2023–24) నుంచి ప్రారంభించనున్నారు. 

క్యాన్సర్‌ వ్యాధి నియంత్రణ, చికిత్సలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో కర్నూలులో కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు 247 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వం ప్రజా వైద్యాన్ని బలోపేతం చేస్తోంది. పేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకూడదని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ప్రతి మూడు నెలలకోసారి నివేదిక ఇవ్వాలన్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ను ప్రభుత్వ విభాగంలో కలిపేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలో విమ్స్‌.. మెడికల్‌ కాలేజీగా మార్పు, ప్రస్తుతం ఉన్న 11 మెడికల్‌ కాలేజీల్లో కార్డియాలజీ, క్యాథ్‌లాబ్‌ సీటీవీసీ విభాగాల్లో 94 పోస్టుల మంజూరు, పుంగనూరు కమ్యూ నిటీ హెల్త్‌ సెంటర్‌ను ఏరియా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు అనుమతించింది.

కంపెనీలు- ఉద్యోగాలు..
➤ వైఎస్సార్‌ జిల్లా వేంపల్లిలో జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ సంస్థ రూ.8,104 కోట్ల పెట్టు బడితో ఏర్పాటు చేయనున్న 1,500 మెగా వాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు ఆమోదం. దీంతో 1500 ఉద్యోగాలకు రూపకల్పన. 
➤ హీరో ఫ్యూచర్స్‌కు చెందిన క్లీన్‌ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్‌ సోలార్, విండ్‌ ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పేందుకు ఆమోదం. ఈ సంస్థ 375 మెగావాట్ల సామర్థ్యంతో అనంతపురం, నంద్యాల, వైఎస్సార్‌ జిల్లాల్లో రూ.2,450 కోట్ల పెట్టుబడులతో పవర్‌ ప్లాంట్‌లు ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా 375 మందికి ఉద్యోగాల అవకాశాలు దక్కుతాయి.
➤ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఐఐసీ పరిధిలోని వివిధ పరిశ్రమలకు 352.79 ఎకరాల భూముల కే టాయింపులకు సంబంధించి 44 ప్రతిపాదనలకు ఆమోదం. ఇందులో రూ.4,204.07 కోట్ల పెట్టుబడుతో 4,705 మందికి ఉపాధి దక్కనుంది. వీటితో పాటు ఎస్‌ఐపీబీ నిర్ణయాలకూ ఆమోదం.
➤ శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మా­ణానికి అవరసరమైన వనరుల సమీకరణకు ఏపీ మారిటైం బోర్డు రూ.3,884.70 కోట్ల రుణం తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వ గ్యారంటీకి కేబినెట్‌ ఆమోదం.  ఏపీ మారిటైం బోర్డులో 2 ఇంజినీరింగ్‌ పోస్టులు, ఎస్‌ఐపీబీలో ఆమోదించిన టూరిజం ప్రాజెక్టులకు, చెన్నై– కడప, విజయవాడ–కడప, బెంగళూరు–కడప, విశాఖ–కడప మధ్య విమా నాలు నడుపుతున్న ఇండిగో సంస్థకు మరో ఏడాది పాటు వయ బిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ కొనసాగింపునకు అంగీకారం.

టీచింగ్‌– నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు :
➤ నంద్యాల జిల్లా బేతంచర్ల, అనంతపురం జిల్లా గుంతకల్, వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు పాలి టెక్నిక్‌ కళాశాలల్లో 128 టీచింగ్‌ పోస్టులు, 68 నాన్‌ టీచింగ్‌ పోస్ట్‌ల మంజూరుకు ఆమోదం. ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 26, ప్రతి నియో జకవర్గంలో ఒకటి చొప్పున 175 నైపుణ్యాభివృద్ధి సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు కుంటోంది. వీటన్నింటికీ ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసి, దాని ద్వారా పాఠ్య ప్రణాళికను రూపొందించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు.  
➤ జేఎన్‌టీయూ(కే)లో 27 నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ని యామకానికి ఆమోదం. వర్సిటీల్లో బోధనా సి బ్బంది కొరతను తీర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు. రిటైర్‌ అవుతున్న బోధనా సిబ్బంది సేవలను కాంట్రాక్టు పద్ధతిలో వినియోగించుకో వాలని నిర్ణయం. కోర్టు కేసుల దృష్ట్యా పోస్టుల భర్తీలో జాప్యం ఉంటోంది. దీనికి ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా 62 ఏళ్లకు రిటైర్‌ అవు తు న్న బోధనా సిబ్బంది సేవలను 65 ఏళ్లకు కాంట్రాక్టు పద్ధతిలో వినియోగించుకోవడానికి కేబినెట్‌ ఆమోదం.

టోఫెల్‌ పరీక్షల కోసం..
టోఫెల్‌ పరీక్షల కోసం ప్రభుత్వ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం కోసం విఖ్యాత విద్యా సంస్థ ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీసెస్‌ (ఈటీఎస్‌)తో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందా నికి కేబినెట్‌ ఆమోదం. 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్న ఈటీఎస్‌. సన్నా హక పరీక్షలతోపాటు టోఫెల్‌ ప్రైమరీ, జూని యర్‌ స్థాయి పరీక్షలను ఈటీఎస్‌ నిర్వహించనుంది. అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకునేలా ప్రాథమిక స్థాయి నుంచే మన విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం చేస్తోంది. ఈ శిక్షణను ప్లస్, ప్లస్‌ వన్‌ స్థాయికి  విస్తరించనున్నారు. జూలై 23వ తేదీ నుంచి ప్రభుత్వ విద్యా సంస్థల్లో టోఫెల్‌పై శిక్షణ ప్రారంభం కానుంది. 

వివిధ రకాల ఉద్యోగాలకు..
➤ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్, ట్రైనింగ్‌ (ఎస్‌సీఈఆర్‌టి)ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎస్‌సీ ఈఆర్‌టీలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో తొమ్మిది అకడమిక్‌ ఎక్స్‌పర్ట్‌ పోస్టుల నియామకాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పాటు చేసిన తాడేపల్లిగూడెం రెవె­న్యూ డివిజన్‌లో 19 పోస్టుల మంజూరు, కొత్తగా ఏర్పాటైన ఒంగోలు, అనంతపురం, నంద్యాల, చిత్తూరు, విజయనగరం, మచిలీపట్నం సౌత్‌ మండలాల్లో 70 పోస్టులు, కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో 13 స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పోస్టుల మంజూరుకు ఆమోదం. 

మచిలీ పట్నం, గుడివాడల్లో 6 కాలనీల్లో 1970–80 మధ్య ప్రభుత్వ ఉద్యోగు­లకు, జర్నలిస్టులకు మార్కెట్‌/నామినల్‌ విలు­వపై భూములు కేటాయిస్తూ అప్పుడు పేర్కొన్న నిబంధనలను సవరించేందుకు ఆమోదం. రాష్ట్ర మానవ హక్కుల సంఘంలోని దర్యాప్తు విభాగానికి కేటాయించిన 9 పోస్టుల మంజూరుతో పాటు, మరో 21 పోస్టులకు ఆమోదం. విశాఖ భూముల అక్రమాలపై సిట్‌ కమిటీ ఇచ్చిన తొలి నివేదికలోని 69 సిఫార్సులను కేబినెట్‌ ఆమోదించింది. ఇందులో మరో 18 సిఫార్సులపై మరింత శోధన అవసరమన్న సిట్‌ నివేదికకు సమ్మతి వ్యక్తం చేసింది. 

Published date : 13 Jul 2023 06:10PM

Photo Stories