Skip to main content

Inspiring Story : తల్లీకొడుకులకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం కొట్టారిలా.. కొడుకుతో కలిసి చదువుకునే సమయంలో..

ఎవరైనా ప్రభుత్వం ఉద్యోగం సాధిస్తే ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు ఉండవు. ఒక్కోసారి ఒకే ఇంట్లో ఇద్దరు, లేదా ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తారు.
Government Job

కానీ, ఒకేసారి తల్లీకొడుకులకు ఉద్యోగం రావటం చూశారా? అవునండీ.. కేరళలో ఈ సంఘటన జరిగింది. మలప్పురమ్‌కు చెందిన బిందు అనే మహిళ, ఆమె కుమారుడు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం సాధించారు.

APPSC Group 1 Ranker Naga Jyothi Success : భర్త మరణంతో కుంగిపోయ్యా.. ఈ క‌సితోనే డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం కొట్టానిలా..

ఈమె చూపు.. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల వైపు..
బిందు తన కుమారుడు 10వ తరగతి చదువుతున్న సమయంలో అతడిని ప్రోత్సహించేందుకు పుస్తకాలు చదవటం ప్రారంభించారు. అదే ఆమెను కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(పీఎస్‌సీ) పరీక్షలవైపు మళ్లించింది. తొమ్మిదేళ్ల తర్వాత కుమారుడితో పాటు ఉద్యోగం సాధించారు.  42 ఏళ్ల బిందు.. లాస్ట్‌ గ్రేడ్‌ సర్వెంట్‌(ఎల్‌జీఎస్‌) పరీక్షలో 92వ ర్యాంకు సాధించారు. 24 ఏళ్ల ఆమె కుమారుడు లోవర్‌ డివిజనల్‌ క్లర్క్‌(ఎల్‌డీసీ) పరీక్షలో 38వ ర్యాంక్‌ సాధించాడు. ఈ విషయాన్ని ఓ టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు బిందు. 

UPSC Civils Results 2022: ప‌రీక్ష రాయలేని స్మరణ్‌ను.. అమ్మ గెలిపించిదిలా.. గంటకు 40 పేజీలు..

తాను తల్లితో కలిసి చదువుకునే సమయంలో..
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న తనను స్నేహితులు, శిక్షణ కేంద్రంలోని గురువులు, కుమారుడు ఎంతగానో ప్రోత్సహించారని చెప్పారు. తాను తల్లితో కలిసి చదువుకునే సమయంలో ఇద్దరం వివిధ అంశాలపై చర్చించుకునే వారమని బిందు కుమారుడు తెలిపారు. నేను ఎక్కువగా ఒంటరిగా చదువుకోవాలని భావించేవాడిని. మా అమ్మ అస్తమానూ చదివేది కాదు. అంగన్‌వాడీ పనులు ముగిశాకే చదువుకునేది.

Success Story: ఓకే సారి గ్రూప్‌-2కు తండ్రీ కొడుకులు సెలక్ట్‌.. వీరి స‌క్సెస్ సిక్రెట్ చూస్తే..

నా మాత్రం లక్ష‍్యం ఇదే..
కుమారుడిని ప్రోత్సహించేందుకు చదువు మొదలు పెట్టిన బిందు.. ఆ తర్వాత కోచింగ్‌ సెంటర్‌లో చేరారు. కుమారుడి డిగ్రీ పూర్తవగానే అతడిని సైతం కోచింగ్‌ సెంటర్‌లో చేర్పించారు. రెండు సార్లు ఎల్‌జీఎస్‌, ఒకసారి ఎల్‌డీసీ పరీక్ష రాసినా ఉత్తీర్ణత సాధించలేకపోయారు. నాలుగో సారి విజయాన్ని అందుకున్నారు. అయితే.. తన లక్ష‍్యం ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పరీక్ష అని.. ఎల్‌జీఎస్‌ బోనస్‌ అని పేర్కొన్నారు బిందు. గత 10 ఏళ్లుగా అంగన్‌వాడీ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Inspiring Success Story: ఆ రైతు ఇంట‌ ఐదుగురు అక్కాచెల్లెళ్లు.. అందరూ కలెక్టర్లే.. కానీ..

Government Jobs Family: వీరి ఇంట అందరికి ప్రభుత్వ కొలువులే..!

Published date : 09 Aug 2022 12:39PM

Photo Stories