UPSC Civils Ranker Lakhan Singh Success Story: విఫలమైనా చివరికి సివిల్స్‌లో 756 ర్యాంకును సాధించిన లఖన్ సింగ్... నన్ను ఇంటర్వ్యూలో ఇలా అడిగారు..!
సాక్షి ఎడ్యుకేషన్: సివిల్స్ రాయాలనే ఆశయంతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించాడు. అయితే, తను చేసిన ఐదు ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయినప్పటికీ వెన్నక్కి తిరగలేదు. అడుగు ఆపలేదు. ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే వచ్చాడు. చివరికి ఆరో ప్రయత్నంలో ఘనత సాధించాడు. ఇలా, పూర్తిగా ఆరు ప్రయత్నాలు చేసిన ఈ యువకుడు చివరికి సివిల్స్‌లో ర్యాంకు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అతని ప్రయాణాన్ని తన మాటల్లోనే తెలుసుకుందాం..
'ర్యాంకు సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. నేను ఈ ప్రయాణాన్ని ప్రారంభించింది 2017లో నా గ్రాడ్జువేషన్ పూర్తి చేసుకున్న తరువాత.. అప్పటినుంచి ప్రయత్నాలు కొనసాగిస్తూనే వచ్చాను. చివరికి నా ఆరో ప్రయత్నం ఫలించింది. నేను చేసిన ప్రయత్నంలో ఎన్నో కష్టాలు, మెట్లు ఎక్కుతూ, దిగుతూ ఇక్కడిదాక చేరుకున్నాను. ఇది నా మూడో ఇంటర్వ్యూ. నేను ఎంచుకుంది సోష్యొలాజీ. ప్రిలిమ్స్‌కి నేను ఐదు సార్లు అటెండ్ అయ్యాను. ఇందులో నేను బేసిక్ సబ్జెక్టులను ముందుగా ఎంచుకున్నను. ఇందులో 90 శాతం సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాను.
తరువాత, మెయిన్స్ పరీక్ష.. ఇందుకోసం, నాకు నేనుగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ప్రతీ బేసిక్ సబ్జెక్ట్‌పైనా నేను 3, 4 పేజీల్లో 300, 400 పదాలతో నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. తరువాత, వ్యాల్యూ అడిషన్, ఎథిక్స్, సుప్రిమ్ కోర్టు జడ్జిమెంట్స్ వంటి విషయాలపై దృష్టి సారించాను. పర్సనాలిటీ టెస్ట్ కోసం మాక్ ఇంటర్వ్యూలను ఎక్కుడవగా చూశాను. ప్రస్తుతం, నెగ్గిన ఈ ఇంటర్వ్యూలో నన్ను అడిగిన ఒక ప్రశ్న నాకు బాగా గుర్తుండిపోయింది.. "ఏ పని చేయకపోయినా, ఎదో చేస్తున్నట్టే.." దీనికి సమాధానంగా భారత్, ఉక్రేన్ యుద్ధంతో ముడి పెట్టాను. మనం ఏమి చేయట్లేదు. కాని, మన ఇరు దేశాలు యుద్ధం చేస్తున్నాయి.'
Tamil Nadu 12th Results Released: తమిళనాడు ఇంటర్మీడియట్ ఫలితాల్లో టాపర్‌గా ఆటో డ్రైవర్ కూతురు
Tags
- upsc rankers
- UPSC Rankers 2023
- Success Stories
- preparation method of upsc rankers
- inspiring journey
- success stories of civils rankers in telugu
- Mock Tests
- latest success stories
- Civils rankers interview
- upsc rankers success stories
- inspirational stories in telugu
- planning for prelims and mains
- mock interviews
- UPSC Civils Ranker Lakhan Singh Success story
- Education News
- Sakshi Education News
- latest stories of upsc rankers
- inspiring stories of ias and ips officers