APPSC Group 1 Ranker Naga Jyothi Success : భర్త మరణంతో కుంగిపోయ్యా.. ఈ కసితోనే డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం కొట్టానిలా..
2018 డిసెంబర్‌లో మొత్తం 167 పోస్టుల నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో గ్రూప్–1లో మంచి ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి ఎంపికైన నాగజ్యోతి సక్సెస్ జర్నీ మీకోసం..
APPSC Group 1 Ranker Success Story : నా ఫోన్‌తోనే.. గ్రూప్-1 ర్యాంక్ కొట్టానిలా.. ఎలా అంటే..?
భర్త మరణించినా కూడా.. ఆత్మస్థైర్యంతో..
చెన్నేకొత్తపల్లి మండలం వెల్దుర్తిలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బుక్కపట్నానికి చెందిన నాగజ్యోతి గ్రూప్–1లో ప్రతిభ కనబరచి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. భర్త వెంకటరెడ్డి మరణించినా ఆమెలో ఆత్మస్థైర్యం ఏమాత్రం సడలలేదు. గ్రూప్–1లో నెగ్గి ఉద్యోగం సాధించారు. కూతురి ఎంపికపై తల్లిదండ్రులు లక్ష్మీనారాయణమ్మ, నాగిరెడ్డిల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
మహిళలదే హావా..
ఏపీపీఎస్సీ గ్రూప్–1 ఇంటర్వ్యూలకు ఎంపికైన 325 మందిలో 156 మంది మహిళలు ఉన్నారు. ఈ గ్రూప్-1 పోస్టులకు ఎంపికైన మొదటి పది మందిలో ఏడుగురు మహిళలే ఉన్నారు. అలాగే ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల్లో ఎక్కువ మంది అత్యున్నత విద్యాసంస్థల్లో చదివినవారే. ఐఐటీ, ఐఐఎంల్లో చదివినవారు 20 మంది ఉన్నారు. అలాగే ఐఐఐటీల్లో చదివినవారు 15 మంది ఉన్నారు. 55 మంది ఎంటెక్ పూర్తిచేసినవారు కాగా 18 మంది డాక్టర్లు ఉండటం విశేషం. వీరిలో 9 మంది సివిల్ సర్వీసు ర్యాంకర్లు కూడా ఉన్నారు.
Success Story: సొంతంగానే గ్రూప్-1కి ప్రిపేరయ్యా.. టాప్ ర్యాంక్ కొట్టా.. డిప్యూటీ కలెక్టర్ అయ్యా..
1,14,473 మంది..
2018 డిసెంబర్‌లో మొత్తం 167 పోస్టుల (2 స్పోర్ట్స్ కోటాతో కలిపి) నోటిఫికేషన్ ఇచ్చారు. 2019 మేలో గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు 1,14,473 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 58,059 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. తరువాత కరోనా, ఇతర కారణాల వల్ల మెయిన్స్ పరీక్షలు మూడుసార్లు వాయిదా పడ్డాయి. 2020 డిసెంబర్‌లో మెయిన్స్ పరీక్షలను ట్యాబ్ ఆధారిత ప్రశ్నపత్రాలతో అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. తొలిసారిగా గ్రూప్–1 సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని డిజిటల్ విధానంలో చేశారు. 2021 ఏప్రిల్‌లో వీటి ఫలితాలు విడుదల చేయగా కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇచ్చిన తీర్పుతో మూల్యాంకనాన్ని సంప్రదాయ పద్ధతిలో మ్యాన్యువల్‌గా అత్యంత పారదర్శకంగా చేయించారు. మొత్తం మూల్యాంకన ప్రక్రియను సీసీ కెమెరాల్లో చిత్రీకరించి భద్రపరిచారు. అనంతరం మూడు బోర్డులను ఏర్పాటు చేసి ఇంటర్వ్యూలను పూర్తి చేశారు. బోర్డుల్లో కూడా కమిషన్ సభ్యులు ఇద్దరితోపాటు ఇద్దరు ఆలిండియా సర్వీసు సీనియర్ అధికారులు, సబ్జెక్టు నిపుణులు ఉన్నారు.
Success Story: నోటిఫికేషన్ చూశాకే.. గ్రూప్-2 పై దృష్టి పెట్టి.. సాధించానిలా..