Guest Lecturers: గెస్ట్ లెక్చరర్ల రెన్యువల్‌కు వినతి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్, డిగ్రీ కళాశాలలు జూన్ 1 నుంచి ప్రారంభమైనప్పటికీ, 35శాతం గెస్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేయలేదని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
దీంతో ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలకు వెళ్తున్నారని, వెంటనే సమస్యను పరిష్కరించి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.
చదవండి: Faculty Jobs: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం
ఆయన తెలంగాణ భవన్‌లో జూన్ 27న విలేకరులతో మాట్లాడుతూ పర్మినెంట్ లెక్చరర్లు లేని కళాశాలలు రాష్ట్రంలో 25 ఉన్నాయన్నారు. మూడు వేలమంది గెస్ట్ లెక్చరర్ లకు ఉద్యోగ భద్రత లేకపోవడంతో రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
Published date : 29 Jun 2024 10:20AM