Skip to main content

1,681 MLHP Jobs: నోటిఫికేషన్‌.. అర్హతలు ఇవే..

వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లలో సేవలు అందించడానికి 1,681 Mid level Health Provider (MLHP) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ వైద్య శాఖ ఆగస్టు 5న నోటిఫికేషన్‌ జారీ చేసింది.
Mid level health providers posts
ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు నోటిఫికేషన్‌.. అర్హతలు ఇవే..

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం అయిన నాటి నుంచి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వైద్య శాఖలో విప్లవాత్మక మార్పులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లోనే ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయడానికి 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిల్లో సేవలందించడానికి భారీగా ఎంఎల్‌హెచ్‌పీలను నియమిస్తున్నారు. ఇప్పటికే 8,351 పోస్టుల భర్తీ పూర్తయింది. మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఆగస్టు 9వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. http://hmfw.ap.gov.in లేదా https://cfw.ap.nic.in ద్వారా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్టు 24 నుంచి 30వ తేదీ వరకు హాల్‌ టికెట్లు జారీ చేస్తారు. సెప్టెంబర్‌ మొదటి వారంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష తేదీ హాల్‌టికెట్‌లలో తెలియజేస్తారు. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. 

చదవండి: ఇష్టమైన చోట డాక్టర్లకు పోస్టింగ్‌

అర్హతలు 

  • అభ్యర్థులు ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసి ఉండాలి.
  • సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ కమ్యూనిటీ హెల్త్‌ (సీపీసీహెచ్‌) కోర్సుతో బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి. 
  • నోటిఫికేషన్‌ జారీ చేసిన తేదీ నాటికి జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు 18 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు ఐదేళ్లు, ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌కు 10 ఏళ్లు మినహాయింపు ఉంటుంది.

చదవండి: విదేశీ వైద్య విద్యార్థులకు రెండేళ్ల ఇంటర్న్‌షిప్‌

పరీక్ష ఇలా..

బీఎస్సీ నర్సింగ్‌ సిలబస్‌ నుంచి 200 ప్రశ్నలకు మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో పరీక్ష ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 180 నిమిషాలు (మూడు గంటలు)లుగా నిర్ణయించారు. 

Published date : 06 Aug 2022 04:36PM

Photo Stories