గిరిపుత్రులకు కొలువుల శిక్షణ.. శిక్షణ కేంద్రాలివీ..
రానున్న 6 నెలల్లో కనీసం 10 వేల మందికి పోలీసు, గ్రూప్–1, గ్రూప్–2, 3, 4 ఉద్యోగాలకు సంబంధించి శిక్షణ ఇవ్వనుంది. ఇందుకోసం రూ. 10 కోట్ల వ్యయంతో 38 శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. భద్రాచలం, ఉట్నూరు, ఏటూరునాగారం, మన్ననూరు ఐటీడీఏల పరిధిలో 31 శిక్షణ కేంద్రాలు, మైదాన ప్రాంతా ల్లో 7 శిక్షణ కేంద్రాలు పెట్టనుంది. వాటిని ప్రత్యేక భవనాల్లో కాకుండా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న యువజన శిక్షణ కేంద్రాలు, సంక్షేమ వసతి గృహాలు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవనాల్లోనే నిర్వహించాలని నిర్ణయించింది. అభ్యర్థులకు శిక్షణ రకాన్ని బట్టి వసతిని కల్పించనుంది. ఐటీడీఏల పరిధిలో ఉన్న శిక్షణ కేంద్రాలను సంబంధిత ప్రాజెక్టు అధికారి, మైదాన ప్రాంతాల్లో తేలంగాణ గిరిజన సంక్షేమాధికారి పర్యవేక్షిస్తారు. ముందుగా పోలీసు, గ్రూప్–2, గ్రూప్–4 కొలువులకు సంబంధించిన శిక్షణ ఇవ్వాలని తేలంగాణ గిరిజన సంక్షేమ శాఖ భావిస్తోంది.
చదవండి:
టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్ ప్రీవియస్‌పేపర్స్ కోసం క్లిక్ చేయండి
Competitive Exams Preparation Tips: కోచింగ్ లేకుండానే... సివిల్స్, గ్రూప్స్!
ఐటీడీఏ శిక్షణ కేంద్రాలివీ..
ఐటీడీఏ |
కేంద్రాలు |
అభ్యర్థులు |
భద్రాచలం |
9 |
2,300 |
ఉట్నూరు |
9 |
2,300 |
ఏటూరునాగారం |
8 |
2,200 |
మైదాన ప్రాంతం |
7 |
2,000 |
మన్ననూరు |
5 |
1,200 |