Skip to main content

కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌.. ఉద్యోగులకు భరోసా.. వివిధ శాఖల్లో ఉద్యోగులకు పెరిగిన వేతనాలు ఇలా..

ప్రభుత్వ, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంక్షేమం కోసం 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం వివిధ రకాల చర్యలు తీసుకున్నట్టు కార్యదర్శుల కమిటీ తన నివేదికలో తెలిపింది.
jobs
కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌.. ఉద్యోగులకు భరోసా

27 శాతం ఐఆర్‌ అమలు, అంగన్ వాడీ, ఆశ, ఇతర ఉద్యోగుల వేతనాల పెంపు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యల కారణంగా ప్రభుత్వంపై అదనపు భారం పడినట్టు పేర్కొంది.

  • ప్రభుత్వ, గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, పెన్షనర్‌లకు రాష్ట్రప్రభుత్వం 2019 జూలై 1 నుంచి 27 శాతం ఐఆర్‌ అమలు చేస్తోంది.
  • 2019 జూలై 1 నుంచి ప్రభుత్వం ఇప్పటి వరకూ ఐఆర్‌ కింద ఉద్యోగులు, పెన్షనర్‌లకు రూ.15,839.99 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో రూ.11,270.21 కోట్లు, ఉద్యోగుల కోసం, రూ.4,568.78 కోట్లు పెన్షనర్‌ల కోసం వెచ్చించింది.
  • అంగన్ వాడీలు, ఆశావర్కర్‌లు, హోమ్‌గార్డులు సహా 3,01,021 మంది ఉద్యోగులకు జీతాలు, రోజువారీ వేతనాలు పెంపొందించింది. వీరి వేతనాలు, జీతాల కోసం సంవత్సరానికి చేస్తున్న ఖర్చు రూ.1,198  కోట్ల నుంచి రూ.3,187 కోట్లకు పెరిగింది.

కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్

  • కాంట్రాక్టు ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వీరికి మినిమం టైమ్‌ స్కేల్‌ను అమలులోకి తెచ్చింది. ఈ ఏడాది జూన్ 18న టైమ్‌ స్కేల్‌లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. మొదటి రెండు ప్రసవాలకు మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన సెలవులను వర్తింపచేసింది.
  • కాంట్రాక్టు ఉద్యోగి యాక్సిడెంటల్‌గా మరణిస్తే రూ.5లక్షలు, సహజ మరణానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాను వర్తింప జేసింది.
  • అదనంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు కల్పించిన వసతులకు ప్రభుత్వం సంవత్సరానికి రూ.360 కోట్ల మేర ఖర్చు చేస్తోంది.

వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక వివిధ శాఖల్లో ఉద్యోగులకు పెరిగిన వేతనాలు ఇలా..

శాఖ

జాబ్‌

గత వేతనం

పెరిగిన వేతనం

ఉద్యోగులు

స్త్రీశిశు సంక్షేమం

అంగన్ వాడీ వర్కర్లు

10,500

11,500

47,476

మినీ అంగన్ వాడీ

6,000

7,000

6,526

అంగన్ వాడీ హెల్పర్లు

6,000

7,000

45,175

పీఆర్, ఆర్డీ

వీఓఏ, సంఘమిత్ర, ఏనిమేటర్లు

2,000

10,000

28,152

మున్సిపల్‌

శానిటరీ వర్కర్లు

8,000

18,000

29,800

సూపర్‌వైజర్లు

12,000

18,000

––

వైద్యారోగ్యశాఖ

ఆశావర్కర్లు

4000 నుంచి 8500

10,000

41,416

ఎల్‌ఈటీ ఎఫ్‌

ఎంఎన్ ఓ

6,700

17,746

2

ఎఎన్ ఎం

10,020

28,000

1

ధోబీ

6,700

13,000 (2015 పీఆర్సీ)

2

బార్బర్‌

6,700

13,000 (2015 పీఆర్సీ)

2

ట్రైబల్‌వెల్ఫేర్‌

కమ్యూనిటీ హెల్త్‌వర్కర్స్‌

400

4,000

2,652

హోమ్‌

హోమ్‌గార్డుల డైలీ

600

710

14,984

డ్యూటీ అలవెన్సు

 

 

 

పాఠశాల విద్య

కుక్‌ కమ్‌ హెల్పర్లు

1,000

3,000

84,833

మొత్తం

––

––

––

3,01,021

చదవండి:

TATA Steel: ఆల్‌ వుమెన్‌... ఐరన్‌ వుమెన్‌!

High Court: కాలేజీల ఖాతాల్లోనే జమ చేయాలి

Department of Medical and Health: పీజీ ఇన్ సర్వీస్‌ కోటా పునరుద్ధరణ

Published date : 14 Dec 2021 03:56PM

Photo Stories