Skip to main content

Department of Medical and Health: పీజీ ఇన్ సర్వీస్‌ కోటా పునరుద్ధరణ

పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్‌ కోటాను ప్రభుత్వం పునరుద్ధరించింది.
Department of Medical and Health
పీజీ ఇన్ సర్వీస్ కోటా పునరుద్ధరణ

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ కోటాలోని 30 శాతం క్లినికల్, 50 శాతం నాన్ క్లినికల్‌ సీట్లను ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న(ఇన్ సరీ్వస్‌) ఎంబీబీఎస్‌ వైద్యులకు కేటాయించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నీట్‌ అర్హత మార్కులు, పదేళ్లు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సేవలు అందించడం, ఇతర నిబంధనలను పరిగణనలోకి తీసుకోవడం య«థావిధిగా ఉంటాయని తెలిపారు. మూడేళ్ల కిందట ప్రభుత్వం ఇన్ సర్వీస్‌ కోటా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పని చేసేందుకు వైద్య విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. దీనికి తోడు ఎంబీబీఎస్‌ వైద్యుల నుంచి.. ఇన్ –సర్వీస్‌ కోటా పునరుద్ధరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులొచ్చాయి. దీంతో గత అక్టోబర్‌ పునరుద్ధరణపై కమిటీ వేసింది. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం పునరుద్ధరణ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 985 పీజీ వైద్య సీట్లున్నాయి. వీటిలో సగం సీట్లు అఖిల భారత కోటాలో భర్తీ అవుతాయి. మిగిలిన సీట్లలోనే ఇన్ సర్వీస్‌ కోటా అమలవుతుంది.

చదవండి: 

560 Grade 2 Posts: ఫార్మసిస్ట్‌ల నియామకం

After 10+2/Inter: బైపీసీతో విస్తృతావకాశాలు!!

Andhra Pradesh jobs: డీఎంఈ, ఏపీలో 326 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

Published date : 14 Dec 2021 01:05PM

Photo Stories