Skip to main content

560 Grade 2 Posts: ఫార్మసిస్ట్‌ల నియామకం

నగర, పట్టణ ప్రాంతాల్లోని 560 వైఎస్సార్‌ అర్బన్ హెల్త్‌ క్లినిక్‌లలో 560 గ్రేడ్‌–2 ఫార్మసిస్టు పోస్టులను ప్రభుత్వం ఇటీవల సృష్టించిన విషయం తెలిసిందే.
Pharmacists
560 గ్రేడ్‌–2 ఫార్మసిస్ట్‌ల నియామకం

వీటిలో ‘104’ నుంచి మిగులు సిబ్బందిని సర్దుబాటు చేయడం ద్వారా 253 పోస్టులు భర్తీ చేయనున్నారు. మిగిలిన 307 పోస్టులను జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ)ల ద్వారా భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్‌లు, వైద్య అధికారులను ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా జిల్లాల్లో పోస్టుల భర్తీకి డిసెంబర్‌ 7వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 7 నుంచి 12వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. 21 నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన, 24వ తేదీ ప్రొవిజన్ మెరిట్‌ లిస్టు ప్రకటన ఉంటుంది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం 29న తుది మెరిట్‌ జాబితా విడుదల చేస్తారు. 31వ తేదీ ఎంపికైన వారికి అపాయింట్‌మెంట్‌ లెటర్‌లు ఇస్తారు.

చదవండి:

NHM: ఏపీలో 27 ఉద్యోగాలు

డైటీషియన్ కోర్పు పూర్తి చేస్తే రూ.30 వేల ప్రారంభ వేత‌నంతో ఉద్యోగాలు..!

ఫార్మసిస్ట్‌గా కెరీర్ కోరుకునే వారి కోసం ఈ వివ‌రాలు.. తెలుసుకోండిలా.

Published date : 03 Dec 2021 12:31PM

Photo Stories