Skip to main content

ఫార్మసిస్ట్‌గా కెరీర్ కోరుకునే వారి కోసం ఈ వివ‌రాలు.. తెలుసుకోండిలా.

హెల్త్‌కేర్‌ రంగంలో ఫార్మసిస్ట్‌లది ప్రముఖ పాత్ర. ఫార్మసీ రంగానికి ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది.

కాబట్టి ఫార్మసీ కోర్సులను పూర్తి చేసిన వారు ఉద్యోగాలతోపాటు స్వయం ఉపాధిని కూడా పొందవచ్చు. ఫార్మసీ కెరీర్‌ను ఎంచుకోవాలనుకునే వారికి డిప్లొమా ఇన్‌ ఫార్మసీ(రెండేళ్లు), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫార్మసీ(నాలుగేళ్లు), మాస్టర్‌ ఆఫ్‌ ఫార్మస్‌(ఎంఫార్మసీ–రెండేళ్లు), డాక్టర్‌ ఆఫ్‌ ఫార్మసీ(ఫార్మ్‌ డి–ఐదేళ్లు) వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 


డీ ఫార్మసీ..

ఈ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు.. ఇంటర్మీడియట్‌(బైపీసీ/ఎంపీసీ) లేదా తత్సమాన విద్య ఉత్తీర్ణులవ్వాలి. వయసు 17ఏళ్లు నిండి ఉండాలి.


బీఫార్మసీ..

  1.  బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫార్మసీ(బీఫార్మసీ)లో చేరాలనుకునే విద్యార్థులు.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌/బయాలజీ సబ్జెక్టులుగా ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన విద్య 50శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. 
  2.  డీ ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీఫార్మసీ కోర్సులో చేరే అవకాశం కూడా ఉంది.


డాక్టర్‌ ఆఫ్‌ ఫార్మసీ(ఫార్మ–డీ)..

  1.      ఈ కోర్సు కాల వ్యవధి 6ఏళ్లు. ఇందులో ఐదేళ్లు కోర్సు కాలవ్యవధి. కాగా ఇంటర్న్‌షిప్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ ఒక ఏడాది ఉంటుంది.
  2.       కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌/బయలాజికల్‌ సైన్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన విద్యను పూర్తి చేసి ఉండాలి.


ఉద్యోగావకాశాలు..

దేశంలో ఫార్మసీ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు..ఫార్మసిస్ట్, క్లినికల్‌ రీసెర్చ్‌ అసోసియేట్, డ్రగ్‌ సేఫ్టీ అసోసియేట్, డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్, ఫార్మాస్యూటికల్‌ సైంటిస్ట్, ఫార్ములేషన్‌ డవలప్‌మెంట్‌ అసోసియేట్‌ వంటి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. దాంతోపాటు అనలిస్ట్, ఫార్మసీ కాలేజీల్లో టీచింగ్‌ వంటి ప్రైవేట్‌/ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. హాస్పిటల్స్, ఫార్మాకంపెనీల్లో కొలువులు లభిస్తాయి. రోగులకు ప్రిస్కిప్షన్‌ తయారు చేయడం,రిటైల్‌/హోల్‌సెల్‌ కెమిస్ట్‌/డ్రగ్గిస్ట్‌ వ్యాపారం తోపాటు స్వయం ఉపాధి పొందే అవకాశం ఉంది.

ఇంకా చ‌ద‌వండి: part 3: డైటీషియన్ కోర్పు పూర్తి చేస్తే రూ.30 వేల ప్రారంభ వేత‌నంతో ఉద్యోగాలు..!

Published date : 21 May 2021 01:15PM

Photo Stories