Skip to main content

351 Jobs: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఖాళీల వివ‌రాలు..

Andhra Pradesh Vaidya Vidhana Parishad (APVVP) ఆసుపత్రుల్లో 351 స్పెషలిస్ట్‌ వైద్యుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
351 Jobs
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఖాళీల వివ‌రాలు..

అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆగ‌స్టు 26వ తేదీ రాత్రి  వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఖాళీల వివ‌రాలు..

  • జనరల్‌ మెడిసిన్: 75
  • ఎనస్థీషియా: 60
  • గైనకాలజీ విభాగం: 60 
  • పిడియాట్రిక్స్: 51
  • జనరల్‌ సర్జరీ: 57
  • రేడియాలజీ: 27
  • పాథాలజీ: 9
  • ఈఎన్‌టీ: 9
  • ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగం: 3

పీజీ/డిప్లొమా/డీఎన్‌బీ కోర్సులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. అకడమిక్‌ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత సాధించినవారికి నెలకు రూ.61,000ల నుంచి రూ.1,50,000ల వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్ధులు రూ.500లు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

పూర్తి వివరాలను https://dmeaponline.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

చదవండి:

Published date : 16 Aug 2022 12:53PM

Photo Stories