89 Jobs: వైద్య పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ
డిసెంబర్ 19న ఆర్థోపెడిక్స్‌లో 10, పీడియాట్రిక్స్ 29, ఆప్తమాలజీ 16, రేడియాలజీ 34 ఇలా నాలుగు స్పెషాలిటీల్లో 89 పోస్టుల భర్తీని చేపట్టనున్నారు. 250 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి డిసెంబర్ 14 నుంచి వాక్–ఇన్ ఇంటర్వ్యూలను వైద్య శాఖ చేపట్టింది. కాగా, ఇప్పటి వరకూ 109 పోస్టులు భర్తీ అయ్యాయి.
చదవండి: Ministry of Health and Family Welfare: ఎంబీబీఎస్ సీట్లు ఇంత శాతం పెరిగాయ్
శాశ్వత, కాంట్రాక్ట్ పద్ధతుల్లో పోస్టుల భర్తీని చేపడుతున్నారు. అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో పట్టణాల్లో రూ.1.30 లక్షలు, గ్రామీణంలో రూ.2 లక్షలు, గిరిజన ప్రాంతాల్లో రూ.2.50 లక్షల చొప్పున ప్రభుత్వం వేతనాలను నిర్దేశించింది. అంతేకాకుండా ఎంపిక చేసుకునే ప్రాంతం, అభ్యర్థి అనుభవం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించింది. ఇప్పటి వరకూ భర్తీ చేసిన 109 పోస్టుల్లో 45 పోస్టులు కాంట్రాక్ట్ విధానంలోనే భర్తీ అయ్యాయి.