APSSDC: నిరుద్యోగులకు అధునాతన శిక్షణ
వృత్తి విద్యా నైపుణ్య కోర్సుల్లో శిక్షణ, పరిశోధన కోసం జర్మనీకి చెందిన డ్యూయిష్ గెసెల్స్ చాఫ్ట్ ఫర్ ఇంటర్నేషనల్ జుసమ్మెనార్బెయిట్ (జీఐజెడ్) సంస్థతో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఒప్పందం కుదుర్చుకుంది. డిసెంబర్ 9న వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ బంగారరాజు, జీఐజెడ్ ఐజీవీఈటీ (ఇండో–జర్మన్ ప్రోగ్రాం ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్) ప్రాజెక్ట్ హెడ్ డాక్టర్ రోడ్నీ రెవియర్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన వృత్తి విద్యా నైపుణ్య శిక్షణ సంస్థలను ఐజీవీఈటీ ఒకే వేదికపైకి చేర్చుతుంది. అలాగే రాష్ట్రంలోని ప్రముఖ పరిశ్రమలు, త్వరలో ఏర్పాటు కానున్న నైపుణ్య కళాశాలల మధ్య సమన్వయం చేస్తూ డిమాండ్ ఆధారిత వృత్తి విద్యా శిక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. ఇండస్ట్రియల్ క్లస్టర్లలో శిక్షణ సామర్థ్యాలను పెంచడంతోపాటు స్కిల్ కాలేజీల సహకారంతో అనేక కార్యక్రమాలను జర్మనీ సంస్థ నిర్వహిస్తుంది. ఏపీఎస్‌ఎస్‌డీసీ సీజీఎం సత్యప్రభ, జీఐజెడ్ ప్రతినిధులు నరసింహం, చనీరాజ్ పాల్గొన్నారు.
చదవండి:
NSDC, APSSDC: సౌత్ జోన్ స్కిల్ పోటీలు ప్రారంభం