Skip to main content

నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసిన నైపుణ్య కోర్సులివే..

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటుచేస్తున్న పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) వేగంగా అడుగులు వేస్తోంది.
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుతోపాటు అక్కడ అందించబోయే కోర్సులను ప్రాథమికంగా ఎంపికచేసింది. ఒక్క అమలాపురం నియోజకవర్గం తప్ప మిగిలిన చోట్ల ఇప్పటికే స్థలాల ఎంపికను ఖరారు చేసింది. నిర్మాణ పనులకు టెండర్లు పిలవడానికి ఏపీఎస్‌ఎస్‌డీసీ సర్వసన్నద్ధమైంది. ప్రతీ శిక్షణ కేంద్రంలో కనీసం రెండు రంగాలకు చెందిన కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల అవసరాలను రాష్ట్ర పరిశ్రమల శాఖ తెలుసుకుని దానికి అనుగుణంగా కోర్సులను ప్రాథమికంగా ఎంపిక చేసినట్లు ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ ఎన్‌. బంగారరాజు తెలిపారు. ప్రస్తుతం నియోజకవర్గ పరిధిలో ఉన్న పరిశ్రమలు.. భవిష్యత్తులో రావడానికి అవకాశమున్న రంగాలను పరిగణనలోకి తీసుకుని, అభ్యర్థులకు అత్యున్నత స్థాయిలో శిక్షణనిచ్చే విధంగా ఈ కోర్సులను రూపొందించనున్నారు. ఇందుకోసం డీఎస్‌టీ, సీఎస్‌ఆర్‌ఐ, ఐఐటీ, ఐఐఎం వంటి ప్రముఖ విద్యా సంస్థలతోపాటు పరిశోధన రంగంలో విశేష అనుభవం ఉన్న వాటితో ఏపీఎస్‌ఎస్‌డీసీ చర్చిస్తోంది. అలాగే, ఈ కోర్సుల్లో శిక్షణనిచ్చి నేరుగా ఉద్యోగం కల్పించే విధంగా ఆసక్తి కలిగిన సంస్థల నుంచి రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్స్‌ (ఆర్‌ఎఫ్‌క్యూ)ను కూడా ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆహ్వానించనుంది.

చ‌ద‌వండి: 40 ఎకరాల్లో.. పశ్చిమ డెల్టాలో ఫిషరీస్ వర్సిటీ

చ‌ద‌వండి: 1,180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ సన్నాహాలు

చ‌ద‌వండి: వైద్య విద్యలో ప్రవేశాలు: 2024 వరకూ కేంద్ర కౌన్సెలింగ్లో చేరలేం..!

ఒక్కో కేంద్రంలో ఏటా 1,920 మందికి శిక్షణ
ఐదు ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.20 కోట్ల అంచనాతో ఈ నైపుణ్య శిక్షణ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నారు. 4,520 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిరి్మంచే ఈ కేంద్రాల్లో 6 తరగతి గదులు, 2 ల్యాబ్‌లు, 2 వర్క్‌షాపులు, ఒక స్టార్టప్‌ ల్యాబ్, అడ్మిన్‌, స్టాఫ్‌ గదులు ఉండే విధంగా డిజైన్‌ చేశారు. అంతేకాక.. 126 మంది అక్కడే ఉండి శిక్షణ తీసుకునే విధంగా హాస్టళ్లను కూడా నిర్మించనున్నారు. రంగాలను బట్టి కోర్సు కాల వ్యవధి 3 నుంచి 6 నెలల వరకు ఉంటుంది. ఏడాదికి ఒక్కో శిక్షణ కేంద్రం నుంచి 1,920 మంది శిక్షణ తీసుకునేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధంచేసింది.

పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా నైపుణ్య శిక్షణ కోర్సుల వివరాలు..

నియోజకవర్గం

మొదటి ప్రాధాన్యత రంగం

రెండో ప్రాధాన్యత రంగం

శ్రీకాకుళం

లైఫ్‌ సైన్సెస్‌

క్యాపిటల్‌ గూడ్స్‌ (గ్రానైట్‌)

విజయనగరం

లైఫ్‌ సైన్సెస్‌

క్యాపిటల్‌ గూడ్స్‌ (ఫెర్రో అల్లాయిస్‌)

అరకు

పర్యాటకం, ఆతిథ్యం

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ (అటవీ ఉత్పత్తులు)

విశాఖపట్నం

ఐటీ, అనుబంధ సంస్థలు

పోర్టు ఆధారిత లాజిస్టిక్స్‌

అనకాపల్లి

లైఫ్‌ సైన్సెస్‌

హైడ్రో కార్బన్స్‌

కాకినాడ

ఫుడ్‌ ప్రాసెసింగ్‌

పోర్టు ఆధారిత లాజిస్టిక్స్‌

అమలాపురం

ఫుడ్‌ ప్రాసెసింగ్‌

హైడ్రో కార్బన్స్‌

రాజమహేంద్రవరం

హైడ్రో కార్బన్స్‌

కాగిత పరిశ్రమ

ఏలూరు

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ (ఆక్వా)

క్యాపిటల్‌ గూడ్స్‌ (శానిటరీ)

నర్సాపురం

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ (ఆక్వా)

అపారెల్‌ (అల్లికలు)

విజయవాడ

క్యాపిటల్‌ గూడ్స్‌

నిర్మాణ రంగం, భారీ వాహనాల నిర్వహణ

మచిలీపట్నం

ఫుడ్‌ ప్రాసెసింగ్‌

ఇమిటేషన్‌ జ్యువెలరీ

గుంటూరు

ఫుడ్‌ ప్రాసెసింగ్‌

శీతల గిడ్డంగుల లాజిస్టిక్స్‌

బాపట్ల

వ్యవసాయ, అనుబంధ

టెక్స్‌టైల్స్‌

నరసరావుపేట

సిమెంట్‌

మౌలిక వసతుల పరికరాల నిర్వహణ

ఒంగోలు

మైనింగ్‌

మౌలిక వసతుల పరికరాల నిర్వహణ

నెల్లూరు

ఫుడ్‌ ప్రాసెసింగ్‌

లాజిస్టిక్స్‌/పాదరక్షల తయారీ

నంద్యాల

మైనింగ్‌

మౌలిక వసతుల పరికరాల నిర్వహణ

కర్నూలు

సిమెంట్‌

ఉద్యానవనం

రాజంపేట

మైనింగ్‌

మౌలిక వసతుల పరికరాల నిర్వహణ

కడప

సిమెంట్‌

మైనింగ్‌

చిత్తూరు

ఎల్రక్టానిక్స్, హార్డ్‌వేర్‌

పర్యాటకం, ఆతిథ్యం

తిరుపతి

ఎల్రక్టానిక్స్, హార్డ్‌వేర్‌

పర్యాటకం, ఆతిథ్యం

అనంతపురం

ఆటోమోటివ్‌

సిమెంట్‌

హిందూపురం

ఐటీ, అనుబంధ సంస్థలు

ఆటోమోటివ్‌

Published date : 24 Jul 2021 03:20PM

Photo Stories