Skip to main content

APSSDC: అమెరికా ఐటీ ఉద్యోగాలకు ఏపీఎస్‌ఎస్‌డీసీ శిక్షణ

అమెరికాలోని ఐటీ కంపెనీల్లో పనిచేసేందుకు గాను అర్హతలున్న సిబ్బందిని ఎంపి క చేసేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేలా రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ అవుట్‌సోర్సింగ్‌ అనే సరికొత్త కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ) శ్రీకారం చుట్టింది.
APSSDC
అమెరికా ఐటీ ఉద్యోగాలకు ఏపీఎస్‌ఎస్‌డీసీ శిక్షణ

ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను నవంబర్‌ 19న ఏపీఎస్‌ఎస్డీసీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ సలహాదారు చల్లా మధుసూదన్ రెడ్డి, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి(నార్త్‌ అమెరికా) పండుగాయల రత్నాకర్, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ బంగార్రాజు ఆవిష్కరించారు. చల్లా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుకునే సమయంలోనే ఉద్యోగావశాలు కల్పించేలా ప్రోగ్రాం డిజైన్‌ చేశామన్నారు. ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. వివరాలకు ఏపీఎస్‌ఎస్‌డీసీ వెబ్‌సైట్‌ www.apssdc.in గానీ, సంస్థ కాల్‌ సెంటర్‌ నంబర్‌ 9988853335ని సంప్రదించాలని సూచించారు.

చదవండి: 

ECET: ఈసెట్‌ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ పొడిగింపు

AP NIT: ఏపీ నిట్‌లో ఆన్ లైన్ రిపోర్టింగ్‌ చివరి తేదీ ఇదే..

GNM: జీఎన్ఎం పరీక్షల తేదీలు

Published date : 20 Nov 2021 05:54PM

Photo Stories