Model Libraries: మోడల్ గ్రంథాలయాలు.. ఆకట్టుకునేలా గదులు, పుస్తకాలు
కెరమెరి(ఆసిఫాబాద్): ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు పూర్తిస్థాయిలో చదవడం, రాయడం రావా లనేది విద్యాశాఖ లక్ష్యం.. ఇందుకు అనుగుణంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఎప్పటికప్పుడు విద్యార్థి నైపుణ్యాలను మూల్యాంకనం చే స్తూ అవసరమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా విద్యార్థుల్లో పఠన నైపుణ్యాలు మెరుగుపర్చేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
రూం టు రీడ్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సెరి ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో ఆదర్శ గ్రంథలయాలు ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది నుంచి అన్ని పాఠశాలలకు కథల పుస్తకాలు అందిస్తున్నారు. అయితే విద్యార్థులకు చదవడంపై మరింత ఆసక్తి పెంచేందుకు మండలంలో ఒక పాఠశాలను ఎంపిక చేసి మోడల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నారు.
చదవండి: Students Reading Books: విద్యార్థుల్లో పఠన సామర్థ్యం పెంపొందించాలి
ఆకట్టుకునేలా గదులు, పుస్తకాలు
సెరి(స్కేలింగ్ అప్ ఎర్లీ రీడింగ్ ఇంటర్వెన్షన్) ప్రాజెక్టులో రూం టు రీడ్ స్వచ్ఛంద సంస్థ పనిచేస్తోంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఆదర్శ గ్రంథాలయాల్లో 475 పుస్తకాలు అందుబాటులో ఉంచుతున్నారు. విద్యార్థులను ఆకట్టుకునే బొమ్మలు తెప్పిస్తున్నారు. గ్రంథాలయం కోసం పాఠశాలలో ప్రత్యేక గది కేటాయిస్తున్నారు. చిన్నారులు కింద కూర్చొనేందుకు తివాచీ, అలాగే డ్యూయల్ డెస్క్ బెంచీలు, పుస్తకాలు భద్రపర్చుకునేందుకు అల్మారాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రౌబై అనే పేరుతో రంగుల ఆధారంగా పుస్తకాలు ఉన్నాయి.
చదవండి: Diamond Jubilee Celebrations : ఘనంగా అంధుల పాఠశాల వజ్రోత్సవ వేడుకలు!
ఆకుపచ్చ రంగులో ఉండే పుస్తకాలు భాషను మెరుగుపర్చుకునేందుకు ఉపయోగపడతాయి. ఎరుపు రంగు పుస్తకాల్లో ఎక్కువ బొమ్మలు ఉంటూ చిన్నచిన్న వాక్యాలతో కథలు ఉంటాయి, నారింజ రంగు పుస్తకాల్లో చిన్న పేరాలతో కథలు ఉంటాయి. తెలుపు రంగు పుస్తకాల్లో సంయుక్త, ద్విత్వ పదాలతో కథలు ఉంటాయి. నీలి రంగు పుస్తకాల్లో సంయుక్త పదాలతో పాటు సంక్లిష్ట పదాల కథలు ఉంటాయి. పసుపు రంగు పుస్తకాల్లో అన్ని అంశాలతో కూడిన చిత్రాల సంఖ్య తక్కువగా ఉండి పదాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
పిల్లలు చదివి అర్థం చేసుకుని సొంత మాటల్లో చెప్పగలిగే సామర్థ్యం పెంపొందించుకునేందుకు అనువుగా ఉంటాయి. ఆదర్శ లైబ్రరీలకు తెలుగు, హిందీ, గోండి, కొలామి, ఉర్దూ భాషల పుస్తకాలు సైతం అందిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో విద్యార్థుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని సరఫరా చేస్తున్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
ఆరు మండలాల్లో ప్రారంభం
జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం తుంపెల్లి ప్రాథమిక పాఠశాలలో ఆదర్శ గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అలాగే రెబ్బెన మండలం వంకులం, వాంకిడి మండలం ఖిరిడి, బెజ్జూర్ మండలం బారెగూడ, పెంచికల్‌పేట్ మండలం కొండపల్లి, కౌటాల మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మోడల్ లైబ్రరీలు ప్రారంభమయ్యాయి.
కెరమెరి, లింగాపూర్, జైనూర్, సిర్పూర్(యూ), తిర్యాణి, సిర్పూర్(టి), చింతలమానెపల్లి, దహెగాం, కాగజ్‌నగర్ మండలాల్లో త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
విద్యార్థులు చదివేలా..
కథల పుస్తకాలతో విద్యార్థుల్లో పఠనాసక్తి పెరిగింది. గతంలో ప్రభుత్వం సరఫరా చేసే పుస్తకాలు తప్ప వేరే ఉండేవికాదు. రూం టు రీడ్ సంస్థ అందిస్తున్న పుస్తకాలు విద్యార్థులు సొంతంగా చదివేలా ఉన్నాయి. పాఠశాలల్లో 60 నుంచి 70 శాతం మంది చదవగలుగుతున్నారు.
– శ్రీనివాస్, ఏఎంవో
ఎంతో ఉపయోగం
విద్యార్థుల్లో పఠన నైపు ణ్యం, ఆసక్తి పెంపొందించేందుకు రూం టు రీడ్ సంస్థ అందించే పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పటికే ఆరు మండలాల్లో ఆదర్శ గ్రంథలయాలు ప్రారంభించాం. త్వరలో మిగిలిన మండలాల్లోనూ అందుబాటులోకి తీసుకువస్తాం.
– జెన్నీఫర్, రూం టు రీడ్ సంస్థ జిల్లా ప్రతినిధి