Skip to main content

Diamond Jubilee Celebrations : ఘనంగా అంధుల పాఠశాల వజ్రోత్సవ వేడుకలు!

కడప శంకరాపురంలో అంధుల పాఠశాల ఏర్పాటు చేసి 75 ఏళ్ల పూర్తయిన సందర్భంగా శుక్రవారం పాఠశాల ఇన్‌చార్జు హెచ్‌ఎం వేపరాల ఎబినేజర్‌ ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Students should get well educated and grow up to be good academics

కడప ఎడ్యుకేషన్‌: అంధులమనే ఆలోచన లేకుండా బాగా చదువుకుని ఉన్నతస్థాయికి చేరుకుని నలుగురికి సేవలందించే స్థితికి చేరుకోవాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ అదితిసింగ్‌ పేర్కొన్నారు. కడప శంకరాపురంలో అంధుల పాఠశాల ఏర్పాటు చేసి 75 ఏళ్ల పూర్తయిన సందర్భంగా శుక్రవారం పాఠశాల ఇన్‌చార్జు హెచ్‌ఎం వేపరాల ఎబినేజర్‌ ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌తో పాటు మేయర్‌ సురేష్‌బాబు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ యంవీ రామచంద్రారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరైయ్యారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

ఈ సందర్భంగా వారు జ్యోతి ప్రజ్వలన చేసి అంధుల ఆరాద్యదైవం లూయిబ్రైల్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జు కలెక్టర్‌ అదితిసింగ్‌ మాట్లాడుతూ అంధులు లూయి బ్రెయిలీని అందరూ అదర్శంగా తీసుకోవాలన్నారు. పాఠశాలకు అవసమైన మౌలిక వసతుల కల్పినకు తమ వంతు కృషి చేస్తానన్నారు. పిల్లలకు హ్యాడ్‌ రైట్‌ ఫోన్స్‌, లాబ్స్‌ను అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Telangana Outsourcing Jobs : గుడ్‌న్యూస్‌.. 1878 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల‌ భ‌ర్తీకి ఉత్తర్వులు.. పోస్టుల వివ‌రాలు ఇవే...

విద్యావేత్తలుగా ఎదగాలి:

బాగా చదువుకుని మంచి విద్యావేత్తలుగా ఎదగాలని నగర మేయర్‌ సురేష్‌బాబు పేర్కొన్నారు. ఇటీవల అంధురాలు ఒకామే జిల్లా కలెక్టర్‌ కూడా అయ్యారని అలాంటి వారిని మీరంతా స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. తాను చిన్నచౌక సర్పంచ్‌గా ఉన్నప్పటి నుంచే అంధుల పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తూ వస్తున్నాన్నారు. నేడు కడప కార్పోరేషన్‌లో 10 మంది అంధులకు ఉద్యోగాలను కల్పించి వారికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. చాలా మంది ఇక్కడే చదివి ఇక్కడే ఉపాధ్యాయులై సేవలందించడం అభినందనీయం అన్నారు.

-నగర మేయర్‌ సురేష్‌బాబు

Rani Rampal: రిటైర్మెంట్ ప్రకటించిన 'భారత మహిళల హాకీ జట్టు మాజీ కెప్టెన్‌'

అభివృద్ధికి కృషి చేస్తాం:

అంధుల పాఠశాల అభివృద్ధికి ఎమ్మెల్సీగా తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి అన్నారు. అంధుల పాఠశాలకు జూనియర్‌ కళాశాల మంజూరు, అంధుల కోసం ప్రత్యేక శిక్షణా కేంద్ర ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. అలాగే బ్రెయిలీ పాఠ్యపుస్తకాలు సకాలంలో విద్యార్థులకు అందించేందుకు, అలాగే నూతన భవనాల మంజూరు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించేందుకు శాయాశక్తుల కృషి చేస్తానన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

పాఠశాల ఇన్‌చార్జు హెచ్‌ఎం వేపరాల ఎబినైజర్‌ మాట్లాడుతూ అంధుల పాఠశాలలో ఇప్పటి వరకు 10వ తరగతి వరకే బోధన ఉందన్నారు. ఇంటర్మీడియట్‌ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేస్తే అంధులు ఉన్నత విద్యను కొనసాగించే అవకాశం ఉంటుందన్నారు. అలాగే డీఎడ్‌ ఒకేషనల్‌ కాలేజీని కూడా ఏర్పాటు చేయాలన్నారు. మాజీ హెచ్‌ఎం శంకరయ్య, ప్రాథమిక పాఠశాల హెడ్‌ టీచర్‌ రమణ, అంధుల పాఠశాల ఉపాధ్యాయులతోపాటు అంధుల సమాఖ్య నాయకులు పాల్గొన్నారు.

-ఎమ్మెల్సీ యంవీ రామచంద్రారెడ్డి

TGCHE: సరికొత్తగా యువత ఆలోచించాలి

Published date : 26 Oct 2024 02:56PM

Photo Stories