Skip to main content

ANU: దూరవిద్య పరీక్షల్లో ప్రత్యేక పరిశీలక బృందం విస్తృత తనిఖీలు

ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో కర్నూలు జిల్లాలో జరుగుతున్న దూరవిద్య పరీక్ష కేంద్రాలను ప్రత్యేక పరిశీలక బృందం సోమవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టింది.
special inspection team conducts extensive inspections in distance education examinations

తనిఖీలలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గూడూరు పట్టణంలో ఉన్న శ్రీ శ్రీనివాస జూనియర్‌ కళాశాలలో యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు గుర్తించడం జరిగిందని తెలిపారు.

చదవండి: Distance Education: దూర విద్యలో ఇగ్నో ఆధునిక కోర్సులు.. దేశ వ్యాప్తంగా స్థానం ఇది!

పరీక్ష నిర్వాహకులు పలు అవకతవతలకు పాల్పడినట్లు గుర్తించి, ఈ అంశాన్ని వర్సిటీ దూరవిద్య పరీక్షల కోఆర్డినేటర్‌ ఆచార్య డి.రామచంద్రన్‌ దృష్టికి తీసుకువెళ్లగా, అవకతలకు పాల్పడిన సెంటర్‌ను దగ్గరలో ఉన్న మరొక సెంటర్‌కు మార్చాలని ఆదేశించడం జరిగిందని వెల్లడించారు. దీంతో గూడూరు శ్రీ శ్రీనివాస జూనియర్‌ కళాశాల పరీక్ష కేంద్రాన్ని రద్దు చేసినట్లు తెలిపారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

కేంద్రంలో పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కర్నూలు పట్టణంలోని బి.తాండ్రపాడు ఎస్‌ఎల్‌ఎస్‌ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులు ఆ పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాసే ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Published date : 06 Nov 2024 09:52AM

Photo Stories