Skip to main content

PM SHRI Scheme: 'పీఎంశ్రీ' పథకంతో పాఠశాలల అభివృద్ధి..!

బడులను తీర్చిదిద్దేందుకు చేపట్టిన మరో పతకమే పీఎంశ్రీ.. ఇందులో భాగంగానే పలు పాఠశాలలను ఎంపిక చేశారు ఈ సంస్థ.. పూర్తి వివరాలను పరిశీలించాండి..
Selected Schools by PM Shri Organization     PM Shri Medal for School Improvement  PM SHRI Scheme for more development in students education   YS Jaganmohan Reddy Government

సాక్షి ఎడ్యుకేషన్‌: రాష్ట్రంలో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు అనూహ్యంగా మార్పు చెందిన సంగతి ప్రజలకు ఎరుకే. నాడు–నేడు పథకం ద్వారా పాఠశాలల్లో లక్షలాది రూపాయలు వెచ్చించి అన్ని మౌలిక సదుపాయాలను సమకూర్చి, విద్యావిధానంలో సైతం సమూల మార్పులను తీసుకువచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మన బడులను తీర్చిదిద్దడం కేంద్రాన్ని సైతం కదిలించిందని చెప్పవచ్చు.

DY Chandrachud: గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి న్యాయ విద్య!!

ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా పలు పాఠశాలల అభివృద్ధికి 'పీఎంశ్రీ' అనే పథకాన్ని రూపొందించారు. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, సైన్సు లేబరేటరీలు, లైబ్రరీల ఏర్పాటు, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ను పెంపు చేయడానికి పాఠశాలల మైదానాలను మెరుగుపరచడం, ఔట్‌డోర్‌, ఇండోర్‌ స్టేడియంలను నిర్మించడం వంటి అదనపు సదుపాయాలను కల్పించనున్నారు. భవిష్యత్‌లో 'పీఎంశ్రీ' పథకంలో ఎంపిక కాబడిన ఉన్నత పాఠశాలలను జూనియర్‌ కళాశాలలుగా అభివృద్ధి పరచనున్నారు.

PM SHRI Scheme: పీఎం శ్రీ పథకానికి 21 పాఠశాలలు ఎంపిక..

జిల్లాకు రూ.3.56 కోట్లు పీఎంశ్రీ నిధులు

రాష్ట్రంలో 597 ఉన్నత పాఠశాలలు 'పీఎంశ్రీ' పథకంలో ఎంపికవ్వగా వీటిలో వివిధ ప్రయోగశాలల ఏర్పాటు కోసం రూ.65.22 కోట్లు మంజూరు చేసింది. అనకాపల్లి జిల్లాలో 24 మండలాల్లో 24 ఉన్నత పాఠశాలల్లో 94 పనుల నిమిత్తం రూ.3.56 కోట్లు నిధులు వెచ్చించనున్నారు. ఇదే పథకంలో రాష్ట్రంలోని ఎంపిక కాబడిన 662 పాఠశాలల్లో పీఎంశ్రీ పథకంలో భాగంగా మైదానాలను అభివృద్ధి పరచనున్నారు.

Best Treatment for Students: అనారోగ్యం పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి..

ఇప్పటి వరకు ఆటస్థలాలు కలిగి ఉన్న 634 పాఠశాలలకు ఒక్కో పాఠశాలకు రూ.5 లక్షలు చొప్పున రూ.3.31 కోట్లు మంజూరు చేస్తారు. ప్రస్తుతం ప్రతి పాఠశాలకు మైదానం అభివృద్ధి నిమిత్తం లక్ష రూపాయల లెక్కన విడుదల చేశారు. ఈ పనులు సాగుతున్నాయి. ఫిజిక్సు, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్సు లేబొరేటరీ పరికరాల నిమిత్తం రూ.లక్ష రూపాయలు లెక్కన, కెమిన్ట్రీ లేబోరేటరీ భవన నిర్మాణం కోసం రూ.15.58 లక్షలు విడుదల కానున్నాయి.

పీఎంశ్రీకి ఎంపికైన పాఠశాలలు ఇవే..

అనకాపల్లి జిల్లాలో ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎంశ్రీ)లో భాగంగా 24 పాఠశాలలను ఎంపిక చేశారు. 24 ఫిజిక్స్‌, 18 కెమిస్ట్రీ, 15 బయాలజీ, 19 సైన్సు లేబరేటరీ పరికరాల ఏర్పాటుకు ఒక్కో లక్ష రూపాయలు 18 కెమిస్ట్రీ లేబరేటరీ భవనాల నిర్మాణానికి రూ.2.80 కోట్లు మంజూరు చేయనున్నారు. సర్వశిక్ష అభయాన్‌ పథకంలో చేపట్టబడే ఈ పనులను జిల్లాలోని 24 పాఠశాలలను ఎంపిక చేశారు.

Tenth Class Public Exams 2024: పదవతరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు

ఏపి బాలికల రెసిడెన్షియల్‌ ఉన్నత పాఠశాల, కోనాంలోని ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ ఉన్నత పాఠశాల, దేవరాపల్లి, కోటఉరట్ల, పాయకరావుపేట, సబ్బవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలు, వేములపూడి పిబీఎం జెడ్పీ ఉన్నత పాఠశాల, అలమండ కోడూరు, చీడిగుమ్మల, చినపాచిల, దేవరాపల్లి, డి.ఎర్రవరం, ఏటికొప్పాక, గణపర్తి, గిడుతూరు, కశింకోట, పరవాడ, కింతలి, లక్ష్మీపురం, రాంబిల్లి, రోలుగుంట, సీతయ్యపేట, తుమ్మపాల, వంపూడి జడ్పీ ఉన్నత పాఠశాలలు పిఎంశ్రీకి ఎంపిక అయ్యాయి. భవిష్యత్‌లు ఈ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు ఇంటర్మీడియట్‌ విద్యార్జన చేయనున్నారు.

Tenth Class Public Exams 2024: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో మెరుగైన ఫలితాలతో ... లక్ష్యంగా

విద్యార్థుల ఉన్నతికి తోడ్పాటు

ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎంశ్రీ) పథకంలో మా పాఠశాల ఎంపిక కావడం విద్యార్థులు మరింత ఉన్నతంగా విద్యాభ్యాసన చేయగలుగుతారు. లేబరేటరీల ఏర్పాటు వారి ఉన్నతి ఎంతగానో దోహదపడుతుంది. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి విద్యరంగం మెరుగునకు చేస్తున్న కృషి సర్వదా అభినందనీయం. సర్వశిక్షా అభయాన్‌ ద్వారా ఈ అభివృద్ధి పనులు నాడు–నేడు పథకం మాదిరిగానే చేపట్టబడతాయి. మా పాఠశాలకు ఫిజిక్సు, కెమిస్ట్రీ, లేబరేటరీ పరికరాలకు నిధులు మంజూరయ్యాయి. అలాగే గ్రౌండ్‌ డెవలప్‌మెంట్‌కు నిధులు విడుదల అయ్యాయి

–ఎ.వి.జగన్నాథరావు, ప్రధానోపాధ్యాయుడు, జెడ్పీ హైస్కూలు, లక్ష్మీపురం

NBA Certification: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు ఎన్‌బీఏ గుర్తింపు..

పాఠశాల అభివృద్ధికి ఉపయోగం

రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడులో భాగంగా మా పాఠశాలను మంచిగా అభివృద్ధి చేసుకున్నాం. వేన్నీళ్ళకు చన్నీళ్ళ తోడులాగా మా పాఠశాలను ప్రభుత్వం పీఎంశ్రీ పథకానికి ఎంపిక చేయడం మాకు ఎంతగానో సంతోషాన్ని కలిగించింది. లేబరేటరీల ఏర్పాటు రెండు లక్షలు మంజూరు కాగా, మైదానం అభివృద్ధికి ముందుగా లక్ష రూపాయలు విడుదల చేసారు. దీంతో ఎగుడు దిగుడుగా ఉన్న మైదానాన్ని మెరుగు పరుస్తున్నాం. ఇది మా పాఠశాలకు, పిల్లలకు, అదృష్టమే. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి మా గ్రామం రుణపడి ఉంటుంది.

Ugc Mandatory To Apppoint Ombudspersons- అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో అంబుడ్స్‌పర్సన్‌ తప్పనిసరి..

–భూతనాధు రామారావు, స్కూల్‌ కమిటీ చైర్మన్‌, లక్ష్మీపురం హైస్కూలు.

Published date : 19 Feb 2024 03:11PM

Photo Stories