Skip to main content

KN Nehru: పాఠశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రి నెహ్రూ

తిరువొత్తియూరు: ఎన్నూర్‌లో రూ. 76 లక్షల ఖర్చుతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెఎన్‌ నెహ్రూ ప్రారంభించారు.
KN Nehru
పాఠశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రి నెహ్రూ

 ఎన్నూర్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ నివాస ప్రాంతంలో చైన్నె మున్సిపల్‌ కార్పొరేషన్‌. ప్రాథమిక పాఠశాల నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఆరుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. 100 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. సిమెంటు రేకులతో నిర్మించిన పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో కొత్త భవనం నిర్మించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరారు. దీంతో చైన్నె కార్పొరేషన్‌ అధికారులు తమకు తామే పథకం కింద కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.

ఉత్తర చైన్నె పార్లమెంట్‌ సభ్యుడు డా. కళానిధి మారన్‌ ఈ పాఠశాల భవనాన్ని సీఎస్‌ఆర్‌ నిధులతో పునరుద్ధరించాలని కోరారు. ఆయన అభ్యర్థనను స్వీకరించి ఎన్నూర్‌ కామరాజ్‌ పోర్ట్‌ రూ.48 లక్షలు అందించింది. ప్రణాళిక ప్రకారం చైన్నెకి చెందిన కార్పొరేషన్‌ వారు రూ.28 లక్షలు అందించగా మొత్ట్‌రూ.76 లక్షలతో మూడు తరగతి గదులతో కూడిన భవనాన్ని నిర్మించారు. ఈ క్రమంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.ఎన్‌ నెహ్రూ అక్టోబ‌ర్ 1న‌ భవనాన్ని ప్రారంభించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో ముచ్చటించారు.

చదవండి: Govt Scholarships: తపాలా శాఖ–స్పర్ష్‌ యోజన స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్‌ విడుదల..

చైన్నె పార్లమెంటు సభ్యుడు డాక్టర్‌ కళానిధి వీరసామి, శాసనమండలి సభ్యులు కె.పి. శంకర్‌, ఎస్‌.సుదర్శనం, కార్పొరేషన్‌ మేయర్‌ ఆర్‌.ప్రియ, నార్త్‌ జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ శివగురు ప్రభాకరన్‌, జోనల్‌ కమిటీ అధ్యక్షుడు వర్తి. ఎం.తాన్యారసు తదితరులు పాల్గొన్నారు.

Published date : 02 Oct 2023 03:43PM

Photo Stories